ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసులక తీపికబురు చెప్పారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని.. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసించారు. ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసులను అభినందిస్తున్నానని.. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఏమాత్రం రాజీలేదు అన్నారు. పోలీసులు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీల ఆట కట్టించారన్నారు. పోలీసుల …
Read More »Tag Archives: andhra pradesh
బాలయ్య అన్‌స్టాపబుల్-4లో చంద్రబాబు.. స్ట్రీమింగ్ ఎప్పుడో క్లారిటీ వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఆహా ఓటీటీలో సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ సీజన్-4 టాక్ షో త్వరలో ప్రారంభంకానుంది. అయితే తొలి ఎపిసోడ్‌కు సీఎం చంద్రబాబు నాయుడు సందడి చేయనున్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ పూర్తయ్యింది. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే అన్‌స్టాపబుల్ సీజన్-2లో చంద్రబాబు, కుమారుడు లోకేష్‌తో కలిసి …
Read More »స్వర్ణాంద్ర ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. విజయవాడ ఏపీలో పనిచేయాలి.. నెలకు రూ.75 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు జీతం
APSDPS Job Notification 2024 : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.apsdps.ap.gov.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి …
Read More »బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రెండ్రోజుల్లోగా వాయుగుండంగా .. ఈ జిల్లాలలో వానలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరుణుడు వదలనంటున్నాడు. బంగాళాఖాతంలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో ఇటీవలే ఏపీవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలో భారీ వానలు పడ్డాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీటమునిగి జనం ఇబ్బందులు కూడా పడ్డారు. అయితే ఇది మరిచిపోకముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో వాయుగుండం ముప్పు భయపెడుతోంది. మరో 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. రెండురోజుల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని.. దీని …
Read More »విశాఖవాసులకు పోలీసుల సూపర్ న్యూస్.. ఇక అర్ధరాత్రి 12 వరకు అనుమతి
విశాఖపట్నంలో హోటల్స్, రెస్టారెంట్‌లకు సంబంధించి పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో అర్ధరాత్రి 12 గంటల వరకూ అన్నిరకాల హోటళ్లు, రెస్టారెంట్లు నడుపుకోవచ్చని తెలిపారు. ఇది వెంటనే అమలులోకి వస్తుందని.. అయితే బార్లు, వాటికి అనుబంధంగా ఉన్న రెస్టారెంట్లు మాత్రం రాత్రి పది గంటలకే మూసేయాలని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయంతో విశాఖవాసులకు అర్థరాత్రి సమయంలో కూడా ఫుడ్ అందుబాటులో ఉండనుంది. విశాఖలో హోటళ్ల సమయాలపై ఇటీవల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. నగరానికి రాత్రి 11 గంటల తరువాత …
Read More »TTD Darshan Tickets : తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు.. ఆన్‌లైన్‌లో ఇలా సింపుల్‌గా బుక్ చేసుకోవచ్చు.. ప్రాసెస్ ఇదే
TTD Darshan Tickets : తిరుమల (TTD Temple)కు వెళ్లే శ్రీవారి భక్తులకు దర్శనం టికెట్లు అంత ఈజీగా దొరకవు. ప్రత్యేక దర్శనం, సేవా టికెట్లను ఒకటి రెండు నెలల ముందే బుక్ చేసుకోవాలి. పోనీ.. ఉచిత దర్శనానికి వెళ్దామంటే రోజంతా క్యూ లైన్‌లో ఉండాలి. మరి 300 రూపాయల దర్శనం టికెట్లు లేని వారు.. గంటల పాటు క్యూలైన్‌లో వెయిట్ చేయలేని ఖచ్చితంగా టికెట్లు బుక్ చేసుకోవాల్సిందే. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే.. ఏదైనా ఒక టికెట్ ఉండాలి. 300 రూపాయల ప్రత్యేక దర్శనం, ఆర్జిత …
Read More »ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. నవంబర్‌లో పక్కా, ఆ జీవో కూడా రద్దు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూళ్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-117ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేయాలని నిర్ణయించింది. స్కూళ్లలో తరగతుల విలీనం, ఉపాధ్యాయుల సర్దుబాటు, టీచర్లకు వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్ లాంటి వాటిని అమలు చేసేందుకు ఈ జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జీవోను రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చింది. తాజాగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీన్ని రద్దు …
Read More »ఏపీకి పొంచి ఉన్న మరో వాయుగుండం ముప్పు.. వాతావరణశాఖ హెచ్చరిక, ఈ జిల్లాలపై ప్రభావం
ఏపీలో మరోసారి వాన ముప్పు పొంచి ఉందని చెబుతోంది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో ఈనెల 22నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉదంటున్నారు. ఆ తర్వాత ఇది వాయవ్య దిశగా కదులుతూ.. ఈ నెల 24 నాటికి వాయుగుండంగా బలపడవచ్చొని చెబుతున్నారు. ఈ వాయుగుండం ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ మధ్యలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత పూర్తిగా స్పష్టత వస్తుందని చెబుతుంది వాతావరణశాఖ. ఈ ప్రభావంతో …
Read More »AP Cabinet: వారం రోజుల గ్యాప్‌లో రెండోసారి భేటీ.. ఈ సారి ఆ నిర్ణయం పక్కా!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం అక్టోబర్ 23వ తేదీ జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాయం వేదికగా అక్టోబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ విషయమై అన్ని ప్రభుత్వ శాఖలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ లేఖలు రాశారు. ఏపీ కేబినెట్ భేటీ నేపథ్యంలో అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 4 గంటలలోపు మంత్రివర్గ భేటీలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని లేఖలో సూచించారు. మరోవైపు ఏపీ కేబినెట్ భేటీ ఇటీవలే జరిగింది. …
Read More »గుంటూరు: రైలు పట్టాలపై ప్రేమజంట.. భయంతో వణికిపోయిన స్థానికులు
గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రపింది. పెదకాకాని సమీపంలో యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన మహేష్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజతో గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేష్ డిప్లొమా వరకు చదివి.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్ స్టోర్‌లో ఉద్యోగం చేశాడు. అక్కడే శైలజతో పరిచయం ఏర్పడగా.. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇటీవల మహేష్, శైలజల ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. యువకుడి తల్లిదండ్రులు …
Read More »