తెలంగాణలో ప్రజల సంక్షేమంతో పాటుగా.. ఆలయాల అభివృద్ధికి రేవంత్ సర్కారు కీలక చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల యాదగిరిగుట్టలో పర్యటించిన సీఎం రేవంత్.. తిరుమల టీటీడీ తరహాలో ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరస్వామివారి ఆలయం రూపు రేఖలు మారనున్నాయి. దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు ఎట్టకేలకు అడుగులు …
Read More »Tag Archives: Telangana
తెలంగాణలో వారందరికీ గుడ్ న్యూస్.. మరింత త్వరగా డబ్బులు జమ.. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే..!
Medical Reimbursement Money Released: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇక మీదట మెడికల్ బిల్లుల రియింబర్స్ మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేని సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి మొత్తం ఆన్‌లైన్ ద్వారానే మెడికల్ బిల్లులను సబ్మిట్ చేయాలని.. తద్వారా నిధుల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఉద్యోగులు మెడికల్ రియంబర్స్‌మెంట్ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల …
Read More »ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా.. గొప్ప క్రికెటర్ అయ్యాకే తిరిగొస్తా.. ఆలోచింపజేస్తున్న బాలుడి లేఖ
బాల్యంలో పిల్లలకు చదువు మీది కంటే ఆటలపైనే శ్రద్ధ ఎక్కువ. సండే ఎప్పుడోస్తుందా.. దోస్తులతో రోజు మొత్తం క్రికెట్ ఆడుకుందామా అని ఎదురుచూస్తుంటారు. అయితే.. విద్యార్థులకు చదువూ ముఖ్యమే.. అటు ఆటలూ అవసరమే. కానీ ఇప్పుడున్న విద్యావ్యవస్థ, తల్లిదండ్రుల ఒత్తిడితో.. చాలా మంది పిల్లలను బట్టి చదువులకు అలవాటుపడుతూ.. ఆటలకు దూరమవుతున్నారు. దీంతో.. కొంతమంది పిల్లలు తమకు ఇష్టమైన ఆటలు ఆడుకోలేక.. తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో వెళ్లనివ్వక.. తాము పెట్టుకున్న లక్ష్యాలకు ప్రోత్సాహం దొరకక తమలో తామే ఒత్తిడికి గురవుతున్నారు. అలా మథన …
Read More »సమగ్ర కుటుంబ సర్వే.. వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా..? అధికారుల క్లారిటీ
తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న సర్వే ప్రారంభం కాగా.. ఈనెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి 8 వరకు ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు చేసి స్టిక్కరింగ్ వేశారు. తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అందుకు అనుగుణంగా 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించి వారికి సర్వే బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఎన్యూమరేటర్ …
Read More »హైదరాబాద్‌లో కొత్త రైల్వేస్టేషన్.. త్వరలోనే ప్రారంభం.. ఇక్కడి నుంచి నడిచే రైళ్ల జాబితా ఇదే..!?
హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అదిపెద్ద రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తికావొచ్చింది. సుమారు 100 ఏళ్ల తర్వాత నగరంలో అతి పెద్ద రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి రైల్వే స్టేషన్ అవతరిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఉన్న.. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు రోజురోజుకు ప్రయాణికుల రద్దీ పెరగటంతో పాటు.. వాళ్ల సౌకర్యార్థం నడుపుతున్న రైళ్ల రాకపోకలు కూడా పెరుగుతుండటంతో.. ఆ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేస్తోంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని తలపించేలా సకల …
Read More »తెలంగాణలో వాళ్లందరికీ శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.లక్ష సాయం.. భట్టి కీలక ప్రకటన
Telangana UPSC Aspirants: తెలంగాణలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త వినిపించారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన ప్రతి ఒక్క అభ్యర్థికి లక్ష రూపాయల నగదు సాయం అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భట్టి విక్రమార్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ …
Read More »TG Schools: నేటి నుంచి ఒంటి పూట బడులు.. ఎప్పటి వరకంటే..?
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీపి కబురు. నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. అయితే ఈ ఒంటిపూట బడులు అన్ని స్కూళ్లకు కాదు. ప్రైమరీ స్కూళ్లు మాత్రమే సగం పూట నడవనున్నాయి. ప్రైమరీ స్కూళ్లను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నడపనున్నారు. తెలంగాణలో నేటి నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరగనుంది. నవంబర్ 6 నుంచి 30 వరకు …
Read More »తెలంగాణ పోలీస్ శాఖ మరో సంచలన నిర్ణయం.. 10 మంది TGSP పోలీసులు డిస్మిస్
తెలంగాణలో గతకొన్ని రోజులుగా స్పెషల్ పోలీసులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు రహదారులు, బెటాలియన్లు, ఎస్పీ కార్యాలయాల ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు విధానం’ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆందోళనలు చేస్తున్న పోలీసులపై కఠిన వైఖరి అవలంభించేందుకు పోలీసు శాఖ సిద్ధమైంది. శనివారం (అక్టోబర్ 26) రాత్రి వివిధ బెటాలియన్లకు చెందిన 39 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసింది. తాజాగా మరో సంచలన …
Read More »యాదాద్రి భక్తులకు బిగ్ షాక్.. ఇక నుంచి గుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం.. ఈవో అధికారిక ప్రకటన
Photos Videos ban in Yadadri Temple: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మి నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. అద్భుతమైన శిల్పకళతో అబ్బురపోయేలా తీర్చిదిద్దిన ఆలయాన్ని దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విచ్చేస్తుంటారు. అయితే.. స్వామివారిని దర్శించుకోవటంతో పాటు.. ఆలయ శిల్పకళను చూసి ముగ్దులవుతున్నారు. ఈ క్రమంలోనే.. ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసుకుని మురిసిపోతున్నారు. అయితే.. ఫొటోలు, వీడియోలు తీసుకోవటం రోజురోజుకు పెరిగిపోతుండటంతో.. ఆలయ అధికారులు కీలక నిర్ణయం …
Read More »నీ అయ్య లెక్క అందరూ ఉండరు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్.. నెటిజన్ల ఘాటు కామెంట్లు
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు హద్దుమీరుతున్నాయి. ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకునే క్రమంలో వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ స్థాయిని దిగజార్చుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల్లా కాకుండా.. సాధారణ ప్రజల్లా అనుచిత, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రజల నుంచి చీత్కారాలు చవిచూస్తున్నారు. ఈ క్రమంలోనే.. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద విమర్శలు చేసే క్రమంలో.. ఎంపీ చామల కిరణ్ …
Read More »