Tag Archives: ys jagan

ప్రతిపక్ష నేత హోదా కోరుతూ వైఎస్ జగన్ పిటిషన్.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కోసం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ఏజీ వాదనలు వినిపించారు. అయితే అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ విన్నవించారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్‌ జగన్‌ తరఫున లాయర్ తెలిపారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరినట్లు చెప్పారు. ఈ మేరకు వివరాలు ఇవ్వాలని, కౌంటర్ దాఖలు చేయాలని.. …

Read More »

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే.. 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వ పాలన చూస్తుంటే.. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా.. రివర్స్‌ వెళ్తోందా అనే అనుమానం కలుగుతోందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్లను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని.. బాధితులపై కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక పాలన, ఆటవిక పాలనగా మారిందని.. ఏపీలో రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు …

Read More »

వైఎస్ జగన్‌కు ఎవరు ఇలాంటి సలహాలు ఇస్తున్నారో….?

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. వినుకొండ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాగబాబు వీడియో విడుదల చేశారు. వినుకొండ రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్న నాగబాబు.. పాత పగల కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో రషీద్ హత్యకు …

Read More »

జగన్: సంచలన నిర్ణయం..?

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలలో చాలా ఘోరంగా ఓడిపోయారు.. అయినప్పటికీ కూడా తాను నేతలతో మాట్లాడి ప్రజలు 40% వరకు మన వైపే ఉన్నారు.. ఎవరు కూడా మనోధైర్యాన్ని కోల్పోకూడదు అంటూ ధైర్యాన్ని నింపే పనిలో ఉన్నారు..అలాగే కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల పైన కూడా స్పందిస్తూ త్వరలోనే మరొకసారి యాత్రను చేయబడుతానని కూడా వెల్లడించారు. పార్లమెంటు కమిటీకి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంటులో పార్టీ తరఫున ఎవరు చూస్తారు అనే విషయాన్ని.. అయితే ఇదివరకు లాగా పార్టీరాజ్యసభ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారని తెలిపారు. …

Read More »

యాత్ర-2కు సిద్ధం.. దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించనున్న జగన్!!

వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ఓదార్పు యాత్ర చేపట్టనున్నారు. గతంలో తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన కార్యకర్తలు, నేతల కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఓదార్పు యాత్ర పేరుతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు. ఇపుడు ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. గత ఐదేళ్ల కాలంలో అనేక సంక్షేమ ఫలాలు అందించినప్పటికీ వైకాపా ఓడిపోయింది. ఈ ఓటమిని ఓ ఒక్క వైకాపాకు చెందిన నిజమైన కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నారు.పైగా, ఈ ఫలాలు జగన్‌కు కూడా ఏమాత్రం మింగుడుపడటం …

Read More »