కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో శుక్రవారం (నవంబరు 15) నుంచి మండల మకరు విళక్కు యాత్రా సీజన్ ప్రారంభం కానుండగా.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ రాష్ట్ర ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పూర్తిచేశాయి. తాజాగా, శబరిమల యాత్రికులకు సేవల కోసం ‘స్వామి’ పేరుతో చాట్‌బాట్ అందుబాటులోకి తీసుకొచ్చింది కేరళ సర్కారు. దీనికి సంబంధించిన ‘స్వామి’ చాట్‌బాట్ లోగోను ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవారం ఆవిష్కరించారు. ముత్తూట్ గ్రూప్ సహకారంతో ఈ చాట్‌బాట్ రూపొందించారు. స్మార్ట్ ఫోన్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఆంగ్లం, …
Read More »ఏపీలో రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు
ఏపీలో రైలు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక.. రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు బోగీలు జత చేయనున్నారు. ఈనెల 14 నుంచి 21 వరకు భువనేశ్వర్- కేఎస్‌ఆర్ బెంగుళూరు (18463), 15 నుంచి 22 వరకు కేఎస్‌ఆర్ బెంగళూరు- భువనేశ్వర్(18464) రైళ్లకు అదనపు బోగీలను జత చేస్తామని అధికారులు తెలిపారు. ఈ రైళ్లకు ఓ థర్డ్ ఏసీ బోగీని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాదు ఈ నెల 16న భువనేశ్వర్- తిరుపతి (22879), 17న తిరుపతి- భువనేశ్వర్ (22880) రైళ్లకు ఓ థర్డ్ ఏసీ అదనపు …
Read More »AP News: సెలవుపై వెళ్లిన ఐఏఎస్ ఆమ్రపాలి.. కారణం ఏంటంటే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతో ఐఏఎస్ అధికారిణి పది రోజుల పాటూ సెలవుపై వెళ్లారు. ఆమ్రపాలి సెలవు నుంచి వచ్చే వరకు.. రాష్ట్ర కళాశాల విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తాకు పర్యాటకాభివృద్ధి ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఆమ్రపాలి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఆమెను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించగా.. ఈ నెల 6న బాధ్యతలు స్వీకరించారు.. ఇప్పుడు సెలవులో …
Read More »ఏపీలో స్కూల్ విద్యార్థులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.6వేలు డబ్బులు, కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత దూరంలో స్కూల్ లేకపోతే ఆవాసం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాల్సి ఉంటుందని విద్యా హక్కు చట్టం చెబుతోంది. గతంలో ఉన్న విద్యా హక్కు చట్టంలోని.. నిబంధనల ప్రకారం కిలోమీటరు దూరంలో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత, 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నత …
Read More »‘50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్’.. సీఎం సంచలన ఆరోపణలు
బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని (Karnataka) కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందని ఆయన ఆరోపించారు. అయితే, ఇందుకు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా అంగీకరించకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. తన సొంత మైసూరులో బుధవారం పర్యటించిన సీఎం సిద్ధరామయ్య.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసి సభలో పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా …
Read More »సూర్య కంగువా ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
సూర్య తన కంగువా సినిమాకు ఏ రేంజ్‌లో కష్టపడ్డాడు.. ఏ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడో అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళ, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేశాడు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కొచ్చి, చెన్నై, హైదరాబాద్ వంటి సిటీల్లో పలు ఈవెంట్లు, ప్రెస్ మీట్లు పెట్టి ఇంటరాక్ట్ అయ్యాడు. సూర్య ఈ మూవీని తన భుజానికి ఎత్తుకుని అన్నీ తానై ముందుండి మరీ ప్రమోషన్స్ చేశాడు. మరి ఈ మూవీ నేడు (నవంబర్ 14) థియేటర్లోకి వచ్చింది. ఆల్రెడీ చాలా …
Read More »రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు
తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్ ప్రకటించగా.. త్వరలో రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందించేందుకు సిద్ధమైంది. యాసంగి సీజన్ నుంచి అన్నదాతలకు అవసరమైన వ్యవసాయ ఉపకరణాలు, యంత్రాలను రాయితీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. జిల్లాల వారీగా రైతుల నుంచి ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని వ్యవసాయ పనిముట్లు, యంత్ర పరికరాల జాబితా తయారు చేసినట్లు …
Read More »అందులో తప్పేముంది.. ఏపీలో సోషల్ మీడియా పోస్టుల కేసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు కేసులు పెడుతున్నారంటూ పిల్ దాఖలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లపై పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేస్తున్నారంటూ జర్నలిస్టు విజయబాబు దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరగ్గా.. ఈ కేసులకు సంబంధించి పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది. చివరికి న్యాయమూర్తులను కూడా అవమానపర్చేలా పోస్టులు పెట్టారని …
Read More »Nisha Madhulika: ఆమె వంటలకు కోట్లలో వీక్షకులు.. కాలక్షేపానికి మొదలెట్టి రిచెస్ట్ మహిళా యూట్యూబర్‌గా..!
Nisha Madhulika: అభిరుచి అవసరంతో పెనవేసుకున్నప్పుడు అది జీవితాలను మార్చే, వృత్తిని సృష్టించే ఒక ఆయుధంగా మారుతుంది. అది సామ్రాజ్యాలను సృష్టించే శక్తిని కలిగి ఉంటుంది. వంటపై ఉన్న మక్కువ ఒక టీచర్‌ను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. కాలక్షేపం కోసం మొదలు పెట్టి ఇప్పుడు ఎందరికో శిక్షణ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లింది. 65 ఏళ్ల వయసులో అత్యంత ధనిక భారతీయ మహిళా యూట్యూబర్‌గా మార్చింది. ఆమెనే యూట్యూబ్‌లో సంచలనంగా మారిన నిషా మధులిక. ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. …
Read More »విజయవాడకు చెందిన బ్యాంకు లైసెన్స్ రద్దు.. RBI షాకింగ్ ప్రకటన.. ఖాతాదార్ల పరిస్థితి ఏమిటి?
RBI: నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇదే సమయంలో దివాలా అంచుకు చేరుకుని ఆదాయ మార్గాలు లేని వాటి లైసెన్సులనూ రద్దు చేస్తోంది. తాజాగా మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ప్రముఖ కో ఆపరేటివ్ బ్యాంక్ అయిన దుర్గా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లైసెన్సును ఆర్‌బీఐ రద్దు చేసింది. ఈ బ్యాంకు తగిన మూలధనాన్ని నిర్వహించడం లేదని, ఆదాయ మార్గాలు లేకపోవడం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్ట 1949 నిబంధనలు …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal