amaravatinews

ఆ ఒక్క కారణంతో ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నా: చాగంటి కోటేశ్వరరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు కూడా కేబినెట్ ర్యాంక్‌తో కీలక పదవి దక్కింది. ఆయన్ను విద్యార్థులు నైతిక విలువల ప్రభుత్వ సలహాదారుగా నియమించారు.. రెండేళ్ల పాటు ఈ పదవిలొ కొనసాగుతారు. అయితే చాగంటి ఈ పదవిని తీసుకుంటారా లేదా అనే చర్చ జరిగింది. ఎందుకంటే 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం, 2023లో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మరోసారి పదవులు ఇచ్చినా ఆయన తిరస్కరించారు. తనకు ఈ పదవి దక్కడంపై చాగంటి …

Read More »

AP Gas Cylinders: భీమవరంలో 35 గ్యాస్ సిలిండర్లు సీజ్.. ఆ పొరపాటు చేస్తే సిలిండర్లు పోయినట్టే..!

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీపావళి నుంచే దీపం 2.0 పథకం కింద ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభించారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి దీనికి అనూహ్య స్పందన వస్తోంది. నియోగదారులు ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం నమోదు చేసుకోవటంతో పాటుగా.. సిలిండర్ బుక్ చేసుకుని ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనం పొందుతున్నారు. అయితే కొన్ని చిన్న, చిన్న పొరబాట్ల కారణంగా ఉచిత గ్యాస్ …

Read More »

తెలంగాణలో వారందరికీ గుడ్ న్యూస్.. మరింత త్వరగా డబ్బులు జమ.. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే..!

Medical Reimbursement Money Released: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. ఇక మీదట మెడికల్ బిల్లుల రియింబర్స్ మెంట్ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేని సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి మొత్తం ఆన్‌లైన్ ద్వారానే మెడికల్ బిల్లులను సబ్మిట్ చేయాలని.. తద్వారా నిధుల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై ఉద్యోగులు మెడికల్ రియంబర్స్‌మెంట్ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా స్వీకరించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల …

Read More »

ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా.. గొప్ప క్రికెటర్ అయ్యాకే తిరిగొస్తా.. ఆలోచింపజేస్తున్న బాలుడి లేఖ

బాల్యంలో పిల్లలకు చదువు మీది కంటే ఆటలపైనే శ్రద్ధ ఎక్కువ. సండే ఎప్పుడోస్తుందా.. దోస్తులతో రోజు మొత్తం క్రికెట్ ఆడుకుందామా అని ఎదురుచూస్తుంటారు. అయితే.. విద్యార్థులకు చదువూ ముఖ్యమే.. అటు ఆటలూ అవసరమే. కానీ ఇప్పుడున్న విద్యావ్యవస్థ, తల్లిదండ్రుల ఒత్తిడితో.. చాలా మంది పిల్లలను బట్టి చదువులకు అలవాటుపడుతూ.. ఆటలకు దూరమవుతున్నారు. దీంతో.. కొంతమంది పిల్లలు తమకు ఇష్టమైన ఆటలు ఆడుకోలేక.. తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో వెళ్లనివ్వక.. తాము పెట్టుకున్న లక్ష్యాలకు ప్రోత్సాహం దొరకక తమలో తామే ఒత్తిడికి గురవుతున్నారు. అలా మథన …

Read More »

విశాఖలో ఫైవ్ స్టార్ హోటల్ కూల్చివేత.. బీచ్ రోడ్‌లో 24 అంతస్థుల భారీ స్కై స్క్రాపర్

విశాఖపట్నం.. ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా టూరిస్ట్ డెస్టినేషన్ కూడా అనే సంగతి తెలిసిందే. విశాఖ బీచ్, అరకు అందాలను చూడటానికి ఏటా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వైజాగ్ వస్తుంటారు. దేశం నలుమూలల నుంచి విశాఖ వస్తోన్న పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అనేక సదస్సులకు కూడా నగరం వేదికగా మారుతోంది. దీంతో విశాఖ నగరంలో ఫైవ్ స్టార్ హోటళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరంలోని ఐకానిక్ తాజ్ గేట్ వే హోటల్‌ను కూల్చివేసి దాని స్థానంలో ఫైవ్ స్టార్ …

Read More »

Bigg Boss Today Promo: టేస్టీ తేజాకి శిక్ష వేసిన నాగార్జున.. ఇంతకంటే గొప్ప హోస్టింగ్ ఆశించడం పొరపాటే సుమీ

వీకెండ్‌లో వచ్చే ప్రోమో కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటాం. కొన్నిసార్లు లేటుగా వచ్చినా ఫుల్ కంటెంట్‌తో వచ్చి.. ఎదురుచూపులకు న్యాయం చేస్తారు. కొన్నిసార్లు మాత్రం.. దీని కోసమా? ఇంతసేపూ ఎదురుచూసింది అన్నట్టుగా తుస్సుమనిపిస్తారు. ఈ ఆదివారం నాటి ఎపిసోడ్ ప్రోమో కూడా అలాగే తుస్సుమనిపించింది. అసలు విషయం సెకండ్ ప్రోమో కోసం దాచి పెట్టినట్టున్నారు కానీ.. ఫస్ట్ ప్రోమో మాత్రం ఎవిక్షన్ షీల్డ్ కోసమే సాగింది. ఎవిక్షన్ షీల్డ్ విషయంలో టేస్టీ తేజా.. నిఖిల్ ఎగ్‌ని పాము నోట్లే వేసి గేమ్ ఛేంజర్‌గా …

Read More »

Chandrababu: శ్రీశైలానికి మహర్దశ.. తిరుమల తరహాలో.. మంత్రులతో కమిటీ ఏర్పాటు!

శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శ్రీశైలం ఆలయ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్న ముఖ్యమంత్రి.. ఇందుకోసం పవన్ కళ్యాణ్, ఆనం రామనారాయణరెడ్డి, జనార్ధన్, కందుల దుర్గేష్‌లతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే శ్రీశైలం అభివృద్ధిపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సలహాలు, సూచనలతో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులు కూడా …

Read More »

Donald Trump: ట్రంప్ గెలుపు.. అమెరికాను వీడనున్న హాలీవుడ్ హీరోయిన్లు, కారణం ఇదే!

Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. వచ్చే ఏడాది జనవరిలో అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అడుగుపెట్టనున్న వేళ.. కొందరు తీవ్రంగా వ్యతిరేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు హాలీవుడ్ హీరోయిన్లు.. తాము అమెరికాను విడిచిపెట్టి ఇతర దేశాలకు వెళ్లిపోతామని ప్రకటిస్తు్న్నారు. అయితే రోజురోజుకూ ఈ సంఖ్య పెరగడం అమెరికాలో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎలాన్ మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె కూడా మరోసారి అమెరికా అధ్యక్షుడిగా …

Read More »

తిట్టటం మాకూ వచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ ఘాటు స్పందన..!

KCR on Demolitions: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు.. మూసీ ప్రక్షాళన విషయం అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, తీవ్ర ఆరోపణలు నడుస్తున్న క్రమంలోనే.. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజు (నవంబర్ 08న) సందర్భంగా మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేయటమే కాకుండా.. అదే సందర్భంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఘాటైనా వ్యాఖ్యలు చేయటం రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాజీ సీఎం, …

Read More »

విజయవాడ – శ్రీశైలం.. సీ ప్లేన్‌లో చంద్రబాబు జర్నీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీ ప్లేన్‌లో ప్రయాణించారు. శనివారం విజయవాడ పున్నమి ఘాట్‌లో సీఎం చంద్రబాబు, విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ సర్వీస్ ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి శ్రీశైలానికి సీ ప్లేన్‌లో ప్రయాణించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతర అధికారులతో కలిసి చంద్రబాబు సీ ప్లేన్‌లో శ్రీశైలం చేరుకున్నారు. శ్రీశైలం పాతాళగంగలో సీ ప్లేన్ ల్యాండ్ చేశారు. అక్కడ అధికారులు వారికి ఘనస్వాగతం పలికారు. అనంతరం పాతాళగంగ వద్ద నుంచి చంద్రబాబు రోప్ వేలో ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ …

Read More »