amaravatinews

ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని APCRDAలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి కలిగిన వారు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇతర వివరాలు నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (APCRDA)… ఒప్పంద ప్రాతిపదికన కింది రిమోట్ సెన్సింగ్ అసిస్టెంట్, ప్లానింగ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు …

Read More »

దీపాలు, రంగోలీ, బాణసంచాతో దేశం వెలిగిపోయింది.. ఈరోజు కూడా దీపావళి జరుపుకోవచ్చు.. పూజ శుభసమయం ఎప్పుడంటే

దీపాల పండుగ దీపావళిని అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ రోజున సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవిని, గణపతి బప్పను పూజిస్తారు. ఈసారి అమావాస్య తిథి రెండు రోజులుగా ఉండడంతో దీపావళి విషయంలో చాలా గందరగోళం నెలకొంది. కొంతమంది జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం అక్టోబర్ 31 న దీపావళి జరుపుకోవడం సరైనది. ఎందుకంటే అమావాస్య తిథి రాత్రి అక్టోబర్ 31 న ఉంది. అయితే మరి కొంతమంది జ్యోతిష్య పండితులు పంచాంగం ప్రకారం నవంబర్ 1న దీపావళిని జరుపుకోవాలని సూచించారు. కాశీలోని …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో SGT టీచర్‌ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.. నవంబర్‌ 1: తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ పాఠశాలలో ఎస్జీటీ గెస్ట్‌ ఉపాధ్యాయ పోస్టులకు అర్హులైన దరఖాస్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు …

Read More »

ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం.. యూఎస్‌కు వెళ్లాల్సిన 60 విమానాలు రద్దు

విమాన ప్రయాణికులకు ఎయిర్‌లైన్‌ కంపెనీ షాక్ ఇచ్చింది. నవంబర్, డిసెంబర్‌లో ఇండియా నుంచి అమెరికా వెళ్లాల్సిన 60 విమానాలను రద్దు చేసినట్టు ప్రకటించింది. ప్రయాణికులకు డేట్ మార్చుకునే అవకాశం ఇవ్వడంతో పాటు టికెట్‌ డబ్బులు రిటర్న్‌ చేస్తున్నట్టు వెల్లడించింది. టాటా యాజమాన్యంలోని ఎయిర్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ మధ్య భారత్‌ నుంచి యూఎస్‌కు నడవాల్సిన 60 విమానాలను క్యాన్సిల్ చేసింది. నిర్వహణ సమస్యల కారణంగా విమానాలు అందుబాటులో లేకపోవడంతో ఆయా విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. పీక్‌ …

Read More »

చంద్రబాబూ.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నోరు మెదపరేంటి: వైఎస్ జగన్ ప్రశ్న

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి. కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రానికి అన్యాయం చేసేలా ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. ‘చంద్రబాబు గారూ.. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి …

Read More »

ఆ రాశి వారికి ధన యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 1, 2024): మేష రాశి వారికి ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, …

Read More »

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. నేటి నుంచే మొదలు, మంచి అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌కార్డులు ఉన్న ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో నేటి నుంచి నాలుగు రకాల సరుకుల్ని పంపిణీ చేయనున్నారు. రేషన్ షాపుల్లో ఉచిత బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, జొన్నలు అందిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు సరిపడా సరుకులు రవాణా చేసేలా పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ఇవాళ్టి నుంచి కార్డుదారులందరికీ సరుకులు పంపిణీ చేయనున్నారు. దాదాపు ఐదు నెలల తర్వాత పూర్తిస్థాయిలో సరుకుల్ని ప్రజలకు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు ధర కిలో …

Read More »

ఏపీలో అన్న క్యాంటీన్లకు యువ పారిశ్రామికవేత్త భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో చెక్కు

ఆంధ్రప్రదేశ్‌లో అన్నక్యాంటీన్ల నిర్వహణకు, వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు దాతలు సాయం అందిస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళాలు అందజేశారు. ప్రముఖ యువ పారిశ్రామికవేత్త, పవర్‌ మెక్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ సంస్థ అధినేత సజ్జా రోహిత్ అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసి..‌ అన్నక్యాంటీన్ల కోసం రూ.కోటి చెక్కును విరాళంగా అందజేశారు. అన్నా క్యాంటీన్ల కోసం భారీ విరాళం అందజేసిన సజ్జా రోహిత్‌‌ను చంద్రబాబు అభినందించారు. మరోవైపు రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్ధం ఎస్‌కే యూనివర్సిటీ సిబ్బంది తరఫున జీ వెంకటనాయుడు …

Read More »

తెలంగాణలో 3 కొత్త రైలు మార్గాలు.. నాలుగు లైన్లతో, ఆ ప్రాంతాలకు మహర్దశ

తెలంగాణలోని రైలు ప్రయాణికులకు తీపి కబురు. రెల్వే కనెక్టివిటీ మరింత పెరగనుంది. ప్రయాణికులకు ఉపయోగపడే మూడు ప్రతిపాదిత రైల్వే ప్రాజెక్టులు కీలకదశలో ఉన్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. పుణే, ముంబయి వైపు వెళ్లే సికింద్రాబాద్‌-వాడి మార్గం ప్రస్తుతం రెండు లైన్లతో ఉండగా.. దాన్ని విస్తరించనున్నారు. క్వాడ్రాప్లింగ్‌ (నాలుగు లైన్ల)కు విస్తరించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే సిద్ధమవుతోంది. ఈ లైన్ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్‌ ఇప్పటికే రైల్వే బోర్డుకు అందింది. బోర్డు అనుమతి లభిస్తే.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టే …

Read More »

ఏపీ ఉచిత గ్యాస్ సిలండర్ల పథకం.. తొలిరోజు ఎంతమంది బుక్ చేసుకున్నారంటే, అంత తక్కువా!

ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం మొదలైంది. ఈ నెల 29 నుంచి గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ప్రారంభమైంది. ఈ దీపం పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో ప్రారంభించనున్నారని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. సూపర్‌ సిక్స్‌లో అమలవుతున్న మొదటి పథకం ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకమని గుర్తు చేశారు. తొలిరోజు 4.3 లక్షల బుకింగ్‌లు అయ్యాయని.. లబ్ధిదారుల నుంచి భారీ స్పందన వస్తోందన్నారు. గ్యాస్ రోజుకు రెండున్నర …

Read More »