amaravatinews

SIP: 20 ఏళ్ల వయసులో రూ. 1000 సిప్ స్టార్ట్ చేస్తే.. రిటైర్మెంట్‌ నాటికి చేతికి ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?

SIP Calculator: పెట్టుబడులు పెట్టే వారికి మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇక్కడ కాస్త రిస్క్ ఉన్నా కూడా లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉంటుంది. స్థిరంగా రిటర్న్స్ వస్తాయని గ్యారెంటీ ఏం లేనప్పటికీ.. పాస్ట్ రిటర్న్స్ చూస్తూ.. ఏ స్కీమ్ ఎలా పెర్ఫామ్ చేసింది తెలుసుకొని సరైన పథకం ఎంచుకోవాలి. అప్పుడు నిపుణుల సలహాతో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ అందుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే.. మ్యూచువల్ ఫండ్లలో లంప్ సమ్ (ఏకకాలంలో పెట్టుబడి) లేదా సిస్టమేటిక్ …

Read More »

విశాఖ: రూ.1500కు కొనుగోలు చేసి రూ.25 వేలకు అమ్మకం.. ఐదేళ్లుగా నడుస్తోంది, పెద్ద ప్లానింగే

ఉత్తరాంధ్ర టు హైదరాబాద్.. అక్కడ తీగ లాగితే ఇక్కడ డొంక మొత్తం కదిలింది. కొంతకాలంగా హైదరాబాద్‌లో గంజాయి, డ్రగ్స్ దందాలు నడుస్తున్నాయి. కొంతమంది ఉత్తరాంధ్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌‌లో విక్రయిస్తున్నారు. ఈ ముఠాను పట్టుకున్న పోలీసులు.. ఈ దందాపై ఆరా తీస్తే ఉత్తరాంధ్రలో డొంక కదిలింది.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. రెండు రోజుల క్రితం పోలీసులు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న బాలాజీ గోవింంద్‌‌ గ్యాంగ్‌ను అరెస్ట్ చేశారు.. వారిని ప్రశ్నిస్తే ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. బాలాజీ గోవింద్ …

Read More »

ఏపీ మంత్రిపై అభిమానంతో కేజీ చికెన్ రూ.100కే.. ఎగబడిన జనం, ట్రాఫిక్ కష్టాలు

కర్నూలులో బంపరాఫర్ ఇచ్చారు.. రూ.100కే చికెన్ అన్నారు. ఇంకేముంది జనాలు అక్కడికి క్యూ కట్టారు.. దెబ్బకు రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరంలోని మద్దూర్ నగర్‌లో షమీర్ చికెన్ సెంటర్, సుభాన్ మటన్ చికెన్ సెంటర్‌లు ఉన్నాయి. వీరిద్దరు ఒకరిపై మరొకరు పోటీపడి కిలో చికెన్ ధర రూ.100కు తగ్గించారు. దీంతో జనాలు చికెన్ కొనేందుకు షాపుల దగ్గర బారులు తీరారు. ఈ ఆఫర్ ఏమో కానీ వాహనాల రాకపోకలకు రెండు గంటలకు పైగా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు కలగ జేసుకొని …

Read More »

ఏపీలో పింఛన్ డబ్బులు ఒకరోజు ముందుగానే ఇస్తారు.. కారణం ఇదే, ఈ నెల నుంచి మరో కొత్త రూల్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెలకు సంబంధించిన పింఛన్‌ను ఒకరోజు ముందుగానే పంపిణీ చేయనున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తోంది. కానీ ఒకటో తేదీన సెలవు అయితే మాత్రం ముందు రోజే పింఛన్ పంపిణీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డిసెంబర్ 1 ఆదివారం కావడంతో పింఛన్ డబ్బుల్ని ఒక రోజు ముందుగానే.. అంటే నవంబర్ 30వ తేదీనే పంపిణీ చేయనున్నారు. పింఛన్ తీసుకునేవారు ఈ విషయాన్ని …

Read More »

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారికి ఊరట.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 23, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే సూచనలున్నాయి. వృషభ రాశి వారికి ఉద్యోగపరంగా కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు దాదాపు సమానంగా ఉంటాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఉద్యోగంలో పదోన్నతి లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగం పోయినవారికి, నిరుద్యోగులకు ఒకటి రెండు …

Read More »

శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. ఉచిత బస్సు సర్వీస్ ప్రారంభం

శ్రీశైలం వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక. ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. భక్తుల సౌకర్యార్థం శుక్రవారం ఉచిత బస్సును ప్రారంభించారు. శ్రీశైలంలో పర్వదినాలు, వారాంతపు సెలవు రోజుల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో క్షేత్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైల క్షేత్రంలో భక్తులు ప్రయాణించేందుకు వీలుగా ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటల వరకు బస్సును అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఈ బస్సు గణేశ సదనం, అన్నప్రసాద భవనం మీదుగా క్యూ కాంప్లెక్సు వరకు ప్రయాణిస్తుందని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని …

Read More »

ఏపీలో కాలేజీలకు సీరియస్ వార్నింగ్.. రూ.15 లక్షలు జరిమానా, విద్యార్థులకు పండగే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం.. నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్నాయంది ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. అలా నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధించే అధికారం కమిషన్‌కు ఉందని గుర్తు చేశారు. కొన్ని విద్యా సంస్థలు కోర్సు పూర్తైనా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని.. ప్రభుత్వ ఆదేశాల్లో పేర్కొన్న ఫీజు కంటే ఎక్కువగా …

Read More »

విశాఖ: ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు జరిమానా.. అమ్మో పోలీసులే అవాక్కు, కారణం ఏంటో తెలుసా!

విశాఖపట్నంలో ఆటో డ్రైవర్‌కు పోలీసులు భారీ జరిమానా విధించారు. డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి ఆటోలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు వన్‌టౌన్‌ ట్రాఫిక్‌ సీఐ చెప్పారు. వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.. ఆ సమయంలో పూర్ణమార్కెట్ నుంచి జగదాంబకూడలికి వెళ్తున్న ఆటోను ఆపారు.. అందులో ఏకంగా 20 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఆటోలో ఏకంగా 20మందిని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.. అంతమందిని ఎలా ఎక్కించావురా బాబూ అంటూ …

Read More »

Election Results 2024 Live: ఎన్డీయే, ఇండియా కూటమిలకు అగ్ని పరీక్ష

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 45 శాసనసభ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మహారాష్ట్రలోని 288 స్థానాలుకు ఒకే దశలో పోలింగ్ నిర్వహించగా… ఝార్ఖండ్‌లోని 81 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఇక, కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానానికి ఉప-ఎన్నిక జరగ్గా.. అక్కడ నుంచి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ బరిలో నిలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీకి దిగడం ఇదే మొదటిసారి. దీంతో ఆ స్థానంలో ఫలితంపై ఆసక్తి నెలకుంది. …

Read More »

‘మెకానిక్‌ రాకీ’ మూవీ రివ్యూ

ఆశకి అవసరానికి మధ్య కొట్టిమిట్టాడే మధ్య తరగతి వాడు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ఏవిధంగా చిక్కుకుంటున్నాడనే బర్నింగ్ ఇష్యూని సందేశాత్మకంగా చూపించారు. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకుని.. ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలను కళ్లకి కట్టే ప్రయత్నం చేశారు. ఏదో బలమైన సందేశాన్ని జనాలకు ఇవ్వాలనే థీమ్‌లో కాకుండా.. ఎంటర్‌టైన్మెంట్‌ మోడ్‌లోని కథని ముందుకు తీసుకుని వెళ్తూ.. బర్నింగ్ ఇష్యూని రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు మెకానిక్ రాకీ. మరి ఇతని రిపేర్ ఏ స్థాయిలో పనికొచ్చింది.. బొమ్మకి మంచి మైలేజ్ ఇచ్చిందా? …

Read More »