Kadam

వేసవిలో ముక్కు నుంచి రక్తం ఎందుకు కారుతుంది?.. దీన్ని నిర్లక్ష్యం చేస్తే డేంజర్

వేసవిలో ముక్కు నుంచి రక్తం కారడానికి ప్రధాన కారణం వేడి. వేడి గాలి వల్ల ముక్కు లోపలి పొరలు ఎండిపోతుంటాయి. ఇది పగుళ్లకు దారితీస్తుంది. తక్కువ తేమ, అలెర్జీలు, డీహైడ్రేషన్ లేదా ముక్కు గోకడం కూడా కారణాలు కావచ్చు. అయితే, ఇలా ఎక్కువ రోజులు జరుగుతున్నా, రక్తస్రావం ఎక్కువగా అనిపించినా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సమస్యకు కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..వేసవిలో ముక్కు నుంచి రక్తస్రావం నివారించడానికి రోజూ 2-3 లీటర్ల నీరు, కొబ్బరి నీళ్లు లేదా నిమ్మరసం …

Read More »

వాతావరణ శాఖ హెచ్చరిక.. పిడుగులతో ఏపీ వర్షాలు.. ఈ జిల్లాలకు..

ఏపీకి వచ్చే 3 రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న మూడు గంటల్లో ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలైన ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.సోమవారం ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా దక్షిణ తీరప్రాంత ఒడిశా వరకు ఏర్పడి ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య భాగం నుంచి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ & ఒడిశా …

Read More »

3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 3 గంటల పాటు సాగిన ఏపీ కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆ ఆర్డినెన్స్‌ ద్వారా జిల్లాలవారీగా జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తారు. వేట నిషేధకాలంలో మత్స్యకారులకు ఇచ్చే సాయం 20 వేలకు పెంచింది ప్రభుత్వం. ఏప్రిల్ 26న ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌ భేటీలో మంత్రులకు క్లాస్‌ తీసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను మంత్రులు …

Read More »

తెలంగాణలో పొలిటికల్‌ వార్.. ప్రకంపనలు సృష్టిస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు!

మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం..అనే మాట కొన్నాళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో విపరీతంగా వినిపిస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా బీఆర్ఎస్ నేతలు పలు సందర్భాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన పలు సభల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మీరు ప్రభుత్వాన్ని కూలుస్తామంటే.. జనాలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకుంటారా?..చెట్టుకు కట్టేసి బట్టలూడదీసి కొడతారంటూ ప్రతిపక్షాలకు గట్టి వార్నింగే ఇచ్చారు.ఈ అంశంలో సీఎం రేవంత్ రెడ్డి …

Read More »

మే 2న అమరావతికి ప్రధాని మోదీ.. రాజధాని పునః నిర్మాణ పనులకు శ్రీకారం..

తెలుగు ప్రజలందరూ ఎప్పటినుంచో ఉత్కంఠగా ఎదురు చూసే సమయం రానే వచ్చింది. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి విచ్చేయనున్నారు. ఈ పర్యటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ కీలక మలుపుగా నిలవనుంది. ఎందుకంటే, చాలా కాలంగా ఎదురుచూస్తున్న అమరావతి పునఃనిర్మాణ పనులకు మోదీ స్వయంగా శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ పర్యటన నిర్ధారణ కాగానే ముఖ్యమంత్రి కార్యాలయం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యటనపై మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి, …

Read More »

తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడో చెప్పేసిన బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య

అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ముందే తక్కువ మార్కుల తేడాతే ఫెయిల్ న పేపర్లను మరోసారి వాల్యూయేషన్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు నష్టం జరగకుండా ఉంటుందని అంటున్నారు. ఇంటర్ రిజల్ట్స్ ఇచ్చాక విద్యార్థులు కావాలంటే రీ వాల్యూయేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్ ఎప్పటిలానే ఉంటుందని అన్నారు.ఏపీలో ఇంటర్ ఫలితాలు వెలువడటంతో తెలంగాణలో ఫలితాలు ఎప్పుడు వస్తాయో అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత నెల 25న తెలంగాణ ఇంటర పరీక్షలు పూర్తయ్యాయి. నెల రోజుల లోపే ఫలితాలు ఇవ్వాలని …

Read More »

నల్గొండ కాంగ్రెస్‌లో కార్చిచ్చు.. హైకమాండ్‌కు తలనొప్పిగా మారిన కేబినెట్ కూర్పు!

కాంగ్రెస్‌ పార్టీకి, నల్గొండ జిల్లాకు అవినాభావ సంబంధం ఉంది. అందుకు తగ్గట్టే.. ఈ జిల్లా నుంచి ఉద్ధండ నాయకులు పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తుంటారు. అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో.. పెద్ద తలకాయలుగా చలామణి అవుతుంటారు. జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి.. ఇలా చెప్పుకుంటూ పోతే బడా లీడర్ల పేర్లకు ఇక్కడ కొదవుండదు. అదంతా ఒకెత్తయితే.. జిల్లాలో ఈ హేమాహేమీల మద్య అస్సలు పొసగకకపోవడం ఒకెత్తు. పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఇక్కడి నాయకులతో ఇదో తలనొప్పి. కాంగ్రెస్ అధికారంలోకి …

Read More »

ఆరేళ్లుగా పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు.. కట్‌చేస్తే.. కటకటాలపాలయ్యాడు!

2019 నుంచి పోలీసులకు చిక్కకుండా, దారి దోపిడీలు, దౌర్జన్యాలు, దొంగతనాలకు పాల్పడుతున్న కేటుగాడికి నంద్యాల పోలీసులు చెక్‌ పెట్టారు. ఎట్టకేలకు ఆరేళ్ల తర్వాత పాణ్యం మండంలోని సుగాలిమెట్ట గ్రామంలో చెంచు హనుమంతు అనే కేటుగాడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. అతను కరుడు గట్టిన నిందితుడు, ఒకటి రెండు కాదు ఏకంగా 22 కేసుల్లో ముద్దాయి.  2019 నుంచి నంద్యాల,  గుంటూరు జిల్లాల్లో యదేచ్చగా దారి దోపిడిలు, చోరిలకు పాల్పడుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్న చెంచు హనుమంతును ఎట్టకేలకు నంద్యాల పోలీసులు అరెస్టు చేసి …

Read More »

గుమ్మడి, నిమ్మ, కొబ్బరికాయలతో అమ్మవారికి సాత్విక బలి.. శ్రీశైలంలో కన్నుల పండగ!

అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన శ్రీశైల క్షేత్రంలో శ్రీ భ్రమరాంబికాదేవి వార్షిక కుంభోత్సవం ఘనంగా జరిగింది. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన తొలి మంగళవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి,  ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణలను నిర్వహించారు. తరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం అర్చకులు ఏకాంతంగా ఈ పూజలన్ని నిర్వహించిన తర్వాత అమ్మవారికి మొదటి విడత సాత్వికబలిగా వందల సంఖ్యలో గుమ్మడి కాయలు, కొబ్బరికాయలలు, నిమ్మకాయలను ఆలయ ఈవో శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు సమర్పించారు. మల్లికార్జునస్వామికి మహామంగళ హారతి తర్వాత …

Read More »

సముద్రంలో నేటి నుంచి వేట నిషేధం అమలు… ఎందుకంటే

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం అర్ధరాత్రి నుంచి చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. జూన్ 15 వరకు 61 రోజుల పాటు చేపల వేట నిషేధం అమల్లో ఉంటుంది. ఈ రెండు నెలల సమయంలో చేపలు, రొయ్యలు గుడ్లు పెట్టి పిల్లల్ని చేస్తాయి. అందుకే రెండు నెలల పాటు వేటను ఆపేస్తారు.సముద్ర తీరప్రాంతంలో ఉండే మత్స్యకారులు చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తుంటారు. కాని ప్రతిఏటా 61 రోజులు పాటు వేట నిషేధం అమలులో ఉంటుంది. దీన్ని అతిక్రమిస్తే సముద్ర మత్స్య క్రమబద్ధీకరణ చట్టం – 1944 …

Read More »