Kadam

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. నలుగురు అరెస్ట్..?

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ సిట్ నలుగురు నెయ్యి సరఫరాదారులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఉన్న వీరిని సోమవారం కోర్టులో హాజరుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. AR డయిరీ ఏండీ రాజశేఖరన్‌తో పాటు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన డయిరీ నిర్వాహకులను సిట్ అదుపులోకి ఉన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కల్తీ నెయ్యి కేసులో నలుగురు …

Read More »

ఢిల్లీలో బీజేపీ విజయం చరిత్రాత్మకం.. ప్రతిపక్షహోదా కావాలంటే 10శాతం సీట్లు దక్కాల్సిందే

ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. దేశ ప్రజలందరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని ఆమోదించారని.. తాజాగా ఢిల్లీ ప్రజలు కూడా మోదీ నాయకత్వాన్ని బలపరిచారని చెప్పారు. ప్యాలెస్‌ల విషయంలోనూ ఏపీ, ఢిల్లీకి పోలికలు ఉన్నాయని.. రుషికొండలో ప్యాలెస్ కట్టుకున్నా.. ఢిల్లీలో శీష్ మహల్‌ కట్టుకున్నా.. వాటిలోకి అడుగుపెట్టలేకపోయారన్నారు.కొందరు నాయకుల సంక్షేమం ముసుగులో రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు… ఏపీ, ఢిల్లీకి ఈ అంశంలో పలు పోలికలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో బీజేపీ విజయం …

Read More »

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 82% బాధితులు మైనర్లే.. బడుగు వర్గాలకు రక్షణేది?

బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం ఎన్నో చట్టాలను మనదేశంలో తీసుకుని వచ్చారు. ఎస్సీ, ఎస్టీల కోసం 1989వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టును తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టంలో కులం పేరుతో దూషించిన ఏదైనా కారణాలతో వీరిపై అఘాయిత్యాలకు పాల్పడిన కఠినమైనటువంటి శిక్షలతో పాటుగా ఆ కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదీ కూడా అమలయ్యేలా ఈ చట్టంలో ఉంది. అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. 2023 లో 1877 కేసులు నమోదు …

Read More »

మెడికల్ కాలేజీలపై యూజీసీ కన్నెర్ర.. ఏకంగా 18 కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు జారీ

నిబంధనలు పాటించని మెడికల్‌ కాలేజీలపై యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) కన్నెర్ర చేసింది. తెలుగు రాష్ట్రాలతో సహా దాదాపు 18 మెడికల్‌ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ జాబితాలో ఆంధ్రపదేశ్‌లో మూడు మెడికల్ కాలేజీలు ఉండగా.. తెలంగాణ నుంచి ఎంతో చారిత్రక రికార్డు ఉన్న ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ఉండటం గమనార్హం..యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) పలు వైద్యా కాలేజీలపై కన్నెర్ర చేసింది. ర్యాగింగ్‌ నిరోధక చర్యలు పాటించని దాదాపు 18 మెడికల్‌ కాలేజీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ …

Read More »

పదో తరగరతి ప్రశ్నపత్రాలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రణ.. లీకులకు కళ్లెం పడేనా?

రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తున్నాయి. మరో వైపు అధికారులు కూడా పరీక్షల నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈసారి పదో తరగతి పశ్నాపత్రాలు లీకేజీలకు తావులేకుండా పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం తొలిసారి ప్రశ్నాపత్రాలపై విద్యాశాఖ క్యూఆర్‌ కోడ్‌ ముద్రించనుంది..తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మర్చి 21వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో విద్యార్ధులు ముమ్మరంగా …

Read More »

మాజీ సీఎం కేజ్రీవాల్‌ను ఓడించిన బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఎవరు?

న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రత్యక్ష పోరులో పోటీ చేసిన పర్వేష్ వర్మ విజయం నమోదు చేసుకున్నారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో ముందు వరుసలో నిలిచారు. గత లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పర్వేష్ వర్మ.. తాజా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూ ఢిల్లీ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ …

Read More »

దేశ రాజధాని ఢిల్లీలో కాషాయ దళ విజయానికి అసలు కారణం ఇదే!

26 ఏళ్ల తరువాత ఢిల్లీకి రాజా అనిపించుకుంది భారతీయ జనతా పార్టీ. దేశ రాజధానిలో ఊరిస్తున్న విజయం కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు కమలనాథులు. కొన్ని నెలల ముందే గ్రౌండ్ వర్క్‌ మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. విజయమే లక్ష్యంగా ఢిల్లీ గల్లీల్లో దూసుకుపోయారు.మూడు పర్యాయాలు దేశంలో అధికారాన్ని దక్కించుకున్నా… దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం జెండా ఎగరవేయలేకపోయిన భారతీయ జనతా పార్టీ.. ఈసారి మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఢిల్లీ …

Read More »

ఢిల్లీ ఎన్నికల ఫలితాల వేళ సంచలనం.. ఆప్ అధినేత కేజ్రివాల్ ఓటమి

ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం చోటుచేసుకుంది.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రివాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. న్యూఢిల్లీ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌‌పై 1200 పైచిలుకు ఓట్ల తేడాతో  బీజేపీ అభ్యర్థి పర్వేష్‌ సాహిబ్ సింగ్ వర్మ విజయం సాధించారు. జంగ్‌పురలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్‌సింగ్‌ చేతిలో మాజీ డిప్యూటీ సీఎం సిసోదియా ఓటమి పాలయ్యారు. మరో పార్టీ కీలక నేత..  సత్యేందర్ జైన్ సైతం.. షాకుర్‌ బస్తీ స్థానంలో ఓడిపోయారు.  ఓటమివైపు సాగుతోన్న పార్టీకి అగ్ర …

Read More »

నీట్‌ యూజీ ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష ఎప్పుడంటే?

దేశ వ్యాప్తంగా ఉన్న మెడికాల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీఎస్‌ఎంఎస్‌ వంటి మెడికల్ కోర్సులకు నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. గతేడాది నీట్‌ యూజీ 2024 ప్రవేశ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్ధులు హాజరైన సంగతి తెలిసిందే..దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్‌-యూజీ 2025 ప్రవేశ పరీక్ష మే 4న నిర్వహించనున్నట్లు నేషనల్‌ …

Read More »

కౌంట్ డౌన్‌ షురూ..! రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు..?

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటై 14 నెలలు గడచిపోయింది. ఇప్పటికీ సీఎం 11 మంది మంత్రివర్గ సహచరులతోనే పాలన కొనసాగిస్తున్నారు. ఢిల్లీ వెళ్లిన రేవంత్‌కి కేబినెట్‌లో ఫుల్ టీమ్‌ ఏర్పాటు చేసుకునేందుకు పార్టీ హై కమాండ్ ఓకే చెప్పిందా? హైకమండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే రేవంత్ కేబినెట్ 2.0లో ఉండేదెవరు?.. అనేది హాట్ టాపిక్ గా మారింది.ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న తెలంగాణ కేబినెట్ విస్తరణకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సంవ‌త్సర కాలంగా అప్పుడు ఇప్పుడు అంటూ ఊరిస్తూ వ‌స్తున్న …

Read More »