తెలంగాణ

మెట్రో స్టేషన్లలో వాహనాలు పార్క్ చేస్తున్నారా..? అయితే మీరూ బాధితులే

డియర్ ప్యాసింజర్స్‌ దయచేసి వినండి.. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించేందుకు మీ బండిని స్టేషన్లలో పార్క్ చేస్తున్నారా? అయితే.. మీ వాహనం ఎండకు మాడిపోవచ్చు.. వానకు తడవొచ్చు.. గాలి దుమారానికి కొట్టుకుపోవచ్చు. అడిగినంత చార్జీలు చెల్లించండి.. కానీ కనీస సౌకర్యాలు ఎక్కడని అడగొద్దంటోంది హైదరాబాద్‌ మెట్రో. అంతేకాదూ.. గాడీ గాయబ్ అయినా ప్రశ్నించొద్దని తెగేసి చెబుతోంది. ఇన్ని చెబుతూనే.. బాదుడే బాదుడుకి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌ మెట్రో వసూళ్ల పర్వానికి.. సగటు వాహనదారుడు బెంబేలెత్తిపోతున్నాడు.హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో బాదుడే బాదుడు ఏ స్థాయిలో ఉందో ఓసారి …

Read More »

వ్యసనాలకు తెలంగాణలో తావులేదు.. తప్పు చేస్తే శిక్ష తప్పదుః సీఎం రేవంత్ రెడ్డి

బెట్టింగ్ వ్యవహారాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బెట్టింగ్ యాప్స్‌, ఆన్‌లైన్‌ యాప్స్‌పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించామన్నారు. దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను వేయాలని నిర్ణయించినట్టు అసెంబ్లీలో వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదన్నారు ముఖ్యమంత్రి. అభివృద్ధి కోసం కలిసి వస్తే అన్ని పార్టీల సలహాలు, సూచనలు తప్పకుండా పాటిస్తామన్నారు. ఎవరైనా ప్రత్యక్షంగా, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. కేవలం …

Read More »

ఒక్కసారి ఆట మొదలుపెడితే జీవితం మటాషే..! ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్‌ యాప్స్

లక్కీ భాస్కర్‌ సంగతి దేవుడెరుగూ.. కన్నవాళ్లకు కడుపుకోత మిగిలిస్తూనే ఉంటారా..? లేటెస్ట్‌గా బెట్టింగ్‌ భూతానికి సోమేశ్‌ అనే యువకుడు బలయ్యాడు. బెట్టింగ్‌ యాప్స్ ఎంతలా వేధిస్తారో చెప్పాడు. ఒక్కసారి ఆటలోకి ఎంటరైతే… జీవితం ఎలా క్లోజ్‌ అవుతుందో తన చావుతో తెలిసేలా చేశాడు..బీకేర్‌ ఫుల్‌ బ్రదరూ.. బెట్టింగ్‌తో పెట్టుకుంటే పోతారు..! సర్వనాశనం అయిపోతారు..! అని పదేపదే హెచ్చరిస్తున్నా పట్టించుకోకపోతే ఎలా..? వద్దురా బాబూ అని ఎంత మొత్తకున్నా వినకుండా బతుకులతో పందేలేస్తూ.. నేరగాళ్లను పెంచి పోషిస్తూనే ఉంటారా..? లక్కీ భాస్కర్‌ సంగతి దేవుడెరుగూ.. కన్నవాళ్లకు …

Read More »

సూరీడుతో జర జాగ్రత్త.. ఇవ్వాల్టి నుంచి చుక్కలేనట..! తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. ఒకవైపు ఎండవేడిమి, మరోవైపు ఉక్కపోతతో చుక్కలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిశాయి.. దీంతో కాస్త ఉపశమనం కలిగినట్లయింది.. భిన్న వాతావరణ పరిస్థితుల మధ్య.. వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఇవ్వాల్టి నుంచి భానుడు మరింత ప్రతాపం చూపిస్తాడని పేర్కొంది.. తెలంగాణలో వాతావరణం ఇలా.. దక్షిణ …

Read More »

30శాతం కమీషన్లు..! ఒళ్లు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి.. అసెంబ్లీలో దుమ్ముదుమారం..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. పలు అంశాలపై సుధీర్ఘ చర్చ కొనసాగుతోంది.. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పెద్దలు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ.. స్వయంగా కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ కామెంట్ చేశారు. అయితే.. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30శాతం కమీషన్లు తీసుకుంటున్నట్టు నిరూపించాలంటూ కేటీఆర్‌కు …

Read More »

తల్లిదండ్రులకు అలర్ట్.. నవోదయా, కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల ఫలితాలు వచ్చేశాయ్‌..! డైరెక్ట్ లింక్ ఇదే

దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ప్రక్రియను అధికారులు చేపట్టారు. ఇందుకు సంబంధించి విద్యార్ధుల ఎంపిక జాబితా తాజాగా విడుదలైంది. మార్చి 7 నుంచి 21వరకు ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. దరఖాస్తు చేసుకున్న తల్లిదండ్రులు మీ పిల్లలు ఎంపిక జాబితా తెలుసుకొనేందుకు కేవీ సంఘటన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను దరఖాస్తు చేసిన సమయంలో వినియోగించిన మొబైల్‌ నంబర్‌/ఈ-మెయిల్‌కు వచ్చిన లాగిన్‌ కోడ్‌, పుట్టిన తేదీ, మొబైల్‌ నంబర్‌, క్యాప్చా …

Read More »

అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు..? తెలుగు రాష్ట్రాల సీఎంలు ఫైర్..

ప్రజల పక్షాన పనిచేసేందుకు అసెంబ్లీకి రానివారికి జీతం ఎందుకు దండగ అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకుంటున్నారని చంద్రబాబు, స్పీకర్‌ విమర్శిస్తే..తెలంగాణలో కేసీఆర్ తీరును ఎండగట్టారు సీఎం రేవంత్. ఆ వివరాలు ఇలా..ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు.. వారుకూడా ఒకవిధంగా ప్రభుత్వ ఉద్యోగులే.. ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రతి నెలా జీత భత్యాలు తీసుకునే వారు ఎన్నుకున్న ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకి రాకపోతే ఎలా? అనే ప్రశ్న అసెంబ్లీలో లేవనెత్తారు సీఎం చంద్రబాబు, …

Read More »

అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రైతు భరోసాకు ఎన్ని వేల కోట్లు కేటాయించారో తెలుసా?

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసింది. అన్ని సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు సాగింది. రాష్ట్రంలో రైతులకే కాకుండా ఇతర రంగాల వారికి కూడా అధిక బడ్జెట్‌ను కేటాయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో వెల్లడించారు. మరి ఈ బడ్జెట్‌లో ఏ రంగానికి ఎంత బడ్జెట్‌ కేటాయించారో చూద్దాం.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ …

Read More »

ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత: భట్టి విక్రమార్క

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌ మొత్తం రూ.3 లక్షల కోట్లు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి.. తెలంగాణ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 3 లక్షల 4 వేల 965 కోట్లతో బడ్జెట్‌కు రూపకల్పన చేశారు. తెలంగాణ సుస్థిర అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో …

Read More »

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. రెవెన్యూలో 10,954 గ్రామస్థాయి పోస్టులు వస్తున్నాయ్‌!

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 19) శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్ర భట్టి ఇచ్చన బడ్జెట్‌ ప్రసంగంలో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా రాష్ట్ర నిరుద్యోగులకు..తెలంగాణ శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం (మార్చి 19) ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రవేశ పెట్టిన రెండో బడ్జెట్‌ ఇది. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమానికి …

Read More »