తెలంగాణ

డిగ్రీ సైన్స్‌ కోర్సుల్లో క్రెడిట్లకు భారీగా కోత.. ప్రాక్టికల్స్‌ రద్దు! వచ్చే ఏడాది నుంచి అమలు

తెలంగాణ ఉన్నత విద్యామండలి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంది. డిగ్రీ సైన్స్ కోర్సుల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి సైన్స్ కోర్సుల్లో క్రెడిట్ పాయింట్లను భారీగా తగ్గించనుంది. అలాగే ప్రాక్టికల్స్ కూడా రద్దు చేయనుంది. వీటి స్థానంలో ప్రాజెక్ట్ వర్క్ లను తీసుకురానుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి వెల్లడించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో సైన్స్‌ కోర్సుల క్రెడిట్లకు ఉన్నత విద్యా మండలి కోతపెట్టనుంది. ఇప్పటి వరకు సైన్స్‌ కోర్సుల్లో 160 క్రెడిట్లు ఉండగా వీటిని …

Read More »

పైకి చూసి ఉత్తుత్తి చాక్లెట్లు అనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే

పోలీసులు, ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వం.. ఇలా అందరూ డ్రగ్స్‌తో దొరికారో తాట తీస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చినా.. కేటుగాళ్లు మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. న్యూఇయర్ వేళ భారీ ఎత్తున అక్రమంగా గంజాయి తరలిస్తూ.. ఆ స్టోరీ వివరాలు ఇలా ఉన్నాయి.థర్టీ ఫస్ట్‌ రోజు లైన్‌ క్రాస్‌ చేస్తే తాటతీస్తాం. డ్రగ్స్‌ వాడారో దబిడిదిబిడే. అక్రమ మద్యంతో దొరికారా అంతుచూస్తాం అంటూ నిన్ననే సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు పోలీసులు. అయినప్పటికీ కేటుగాళ్లు తగ్గేదేలే అంటున్నారు. తాజాగా చాక్లెట్ల రూపంలో గంజాయి తరలిస్తున్న కంత్రిగాళ్ల ఆటకట్టించారు …

Read More »

అనుమతులు ఉన్నా.. లేకున్నా వాటి జోలికి వెళ్లం.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

హైడ్రా ఓవరాల్ ప్రోగ్రెస్‌పై కమిషనర్ రంగనాథ్ స్పందించారు.. ఇప్పటివరకు 8చెరువులు, 12 పార్కులను హైడ్రా కాపాడిందని తెలిపారు. దీంతోపాటు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌పై ప్రజలకు అవగాహన కల్పించామని.. ఇకపై ఆక్రమణలు చేస్తే మాత్రం హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.అనుమతులు ఉన్నా.. లేకున్నా.. నివాస గృహాల జోలికి హైడ్రా వెళ్లదు.. ఇకపై ఆక్రమణలు చేస్తే మాత్రం హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుంది.. అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 8చెరువులు, …

Read More »

ఎల్లలు దాటిన స్నేహం.. ఫ్రెండ్ పెళ్లి కోసం జర్మన్ నుంచి వచ్చిన దంపతులు.. హిందూ సాంప్రదాయ దుస్తులల్లో పెళ్లింట సందడి..

స్నేహానికి మించింది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. స్నేహానికన్న మిన్న ఈ లోకానా లేదురా..అనే కూడా సాంగ్ ఉంది. సరిగ్గా అలానే ఎల్లలు దాటి స్నేహం కోసం…స్నేహానికి విలువిస్తూ దేశం కాని దేశం నుంచి స్నేహితుని పెళ్లి వేడుకను కనులారా చూసి నూతన దంపతులకు ఆశీర్వాదం ఇచ్చేందుకు జర్మనీ దేశానికి చెందిన ఒక విదేశీ జంట ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జరిగిన స్నేహితుని వివాహానికి హాజయ్యారు.ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన మాటురి ప్రియాంకకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ కు చెందిన …

Read More »

కోడి కనిపిస్తే ఫసక్.. ఒరెయ్.. మీకు ఇదేం రోగంరా బాబు..!

చోరీకి కాదేదీ అనర్హం అన్నట్లు.. దొంగలు రెచ్చిపోతున్నారు. ఎక్కడైనా విలువైన వస్తువులను దొంగతనం జరగడం గురించి విన్నాం. వీళ్లు మాత్రం వేరే రేంజ్.. చికెన్ షాపులను మాత్రమే టార్గెట్ చేస్తారు.. దర్జాగా ఆటోలో వస్తారు.. చికెన్ షాపు బయట కనిపించే కోళ్లను తస్కరిస్తారు. కోళ్లను మెల్లగా ఆటోలో వేసుకుని జారుకుంటారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో కోళ్ల మాయమవుతండటంతో అనుమానం వచ్చిన యాజమానులు సీసీ కెమెరాలను పరిశీలించడంతో అసలు వ్యవహారం బయటపడింది.ఎవరైనా విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు, డబ్బు దొంగిలిస్తారు. …

Read More »

అమ్మ బాబోయ్.. బెంబేలెత్తిస్తున్న బెబ్బులి..! పులి రోజుకు ఎన్ని కిలోమీటర్లు పరుగెడుతోందో తెలుసా..?

ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దపులి కలకలం రేపుతుంది. పాదముద్రల ఆధారంగా పులి కదలికను పసి గడుతున్నారు అటవీశాఖ సిబ్బంది. ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. డప్పు దండోరా వేస్తూ కొత్తగూడ, నల్లబెల్లి గ్రామాల ప్రజలను అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం చేసింది. బెంగాల్‌ టైగర్‌ సంచరిస్తున్నట్లు అంచనా వేసిని అటవీ శాఖ, ఆడ పులి జాడ వెతుక్కుంటూ కొత్తగూడ ఏరియాకు వచ్చినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ మగపులి కోనాపురం, ఓటాయి, కామారం సమీప అడవుల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారుఅటు అదిలాబాద్ జిల్లాను వణికిస్తున్న పెద్ద …

Read More »

రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ఇదిగో క్లారిటీ…

తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్, సంక్రాంతి సందడి మొదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీ సర్కార్ సెలవుల్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ సంక్రాంతి సెలవులపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సంక్రాంతి సెలవులు ఏయే తేదీల్లో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…ఏపీలో సంక్రాంతి సెలవులపై క్లారిటీ వచ్చింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పండుగ సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణలో సంక్రాంతి హాలిడేస్ ఎన్ని రోజులు అనే చర్చ మొదలైంది. దీంతో అకడమిక్ …

Read More »

గోవా నుంచి వికారాబాద్ వచ్చిన ట్రైన్.. ఓ భోగీలో తనిఖీలు చేయగా

కొత్త సంవత్సరం వేడుకలకు సమయం దగ్గరపడుతోంది.. ముందుగానే ఏర్పాట్లు షురూ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో గ్రాండ్‌గా ఈవెంట్స్ నిర్వహణ జరుగనుంది. ఈవెంట్స్, సెలబ్రేషన్స్ సంగతి అలా ఉంటే.. ఇటు పోలీసులు సైతం అలెర్ట్ అయ్యారు. అక్రమ మద్యం రవాణాపై నిఘా పెంచారు.వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గోవా మద్యం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ మద్యం తీసుకువచ్చినట్లు గుర్తించార. వాస్కోడిగామా ట్రైన్‌లో 95 మద్యం బాటిళ్లు పట్టుకున్నారు. హైదరాబాద్‌కి చెందిన కొందరు యువకులు కొత్త ఏడాది …

Read More »

పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన

హైదరాబాద్‌లో ఇటీవల సోషల్ మీడియాలో ‘ట్రాఫిక్ చలాన్ల పై భారీ డిస్కౌంట్’ అనే పేరు మీద ఒక వార్త వైరల్ అవుతోంది. ఈ ఫేక్ వార్త ప్రకారం, ట్రాఫిక్ చలాన్లు క్లియర్ చేయడానికి తెలంగాణ పోలీసులు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్ అందిస్తున్నట్లు వైరల్ చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఇది పూర్తిగా ఫేక్ వార్తగా తేల్చేసారు. గతంలో ఈ తరహాలో డిస్కౌంట్‌లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం వాహనదారులకు హైదరాబాద్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఈసారి వైరల్ …

Read More »

2025 సంవత్సరం ప్రభుత్వ సెలవుల వివరాలు క్లియర్‌గా…

2025కి సంబంధించి హాలిడేస్ లిస్ట్‌ను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. ఇందులో 27 సాధారణ సెలవులను ప్రకటించగా.. 23 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. కాగా ఆప్షనల్ సెలవు తీసుకోవడానికి, ఉద్యోగులు ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి. వారి సూపర్‌వైజర్ నుంచి అనుమతి పొందాలి.మరో 3 రోజుల్లో 2024 సంవత్సరం ముగిసిపోతుంది. 2025లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టేందుకు అందరూ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తాజాగా 2025లో పండగల సెలవులపై కూడా క్లారిటీ వచ్చింది.  2025 సంవత్సరానికి సంబంధించిన సాధారణ, ఆప్షనల్ సెలవుల లిస్ట్‌ను తెలంగాణ సర్కార్ తాజాగా రిలీజ్ చేసింది. …

Read More »