తెలంగాణ

చూడటానికి తియ్యటి చాక్లెట్స్‌లా ఉన్నాయి.. ఓపెన్ చేసి చూస్తే గుండె ధడేల్..!

చూడటానికి తియ్యటి చాక్లెట్స్ లాగే ఉంటాయి.. రంగుల కాగితం చుట్టి, చూస్తే తినాలి అనిపించేంత అందంగా ఉంటాయి. కానీ, అవి బయట షాపుల్లో దొరికే చిన్న పిల్లలు తినే చాక్లెట్లు అనుకుంటే మీరు పొరబడినట్లే.. అచ్చంగా గంజాయి చాక్లెట్లు.. ఏకంగా 4 కేజీల, 957 గ్రాముల గాంజా చాక్లెట్స్ సీజ్ చేసి, అవి అమ్ముతున్న వ్యక్తిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం రైడ్స్ చేపట్టింది. ఇందులో భాగంగా గాంజా చాక్లెట్స్ విక్రయిస్తున్న వీరేంద్ర పాండే …

Read More »

ఇదెక్కడి దరిద్రంరా నాయనా.. బూట్లు, చెప్పులు ఎత్తుకెళ్లి..

హైదరాబాద్‌ ఉప్పల్‌ ప్రాంతంలోని భరత్‌ నగర్‌లో ఇటీవల కాలంలో చెప్పులు, షూలు మాయమవుతున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. అయితే, చెప్పులు, షూలు మాయమవ్వడం సాధారణ దొంగతనంగా భావించిన స్థానికులు.. కొంతకాలానికి దీని వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుసుకున్నారు. చెప్పులు, షూలు, స్లిప్పర్లను చోరీ చేస్తూ.. అవి విక్రయించడానికి ఓ దంపతులు వినూత్న పద్ధతిని ఉపయోగించారు. వారి ఇంటిని చెప్పుల గోడౌన్‌గా మార్చి, భారీగా దొంగతనాలకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనకు గురిచేశారు. బుధవారం, స్థానిక వ్యక్తి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించి …

Read More »

అబద్దాల మోహన్‌ బాబు.. మీడియానే కాదు పోలీసులపై కూడా విమర్శలు.. ఆ రోజు అసలేం జరిగిందంటే..

మీడియాపై తాను చేసిన దాడి గురించి నటుడు మోహన్‌బాబు వివరణ ఇస్తూ ఓ ఆడియో విడుదల చేశారు. దానిలో తను చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అబద్ధాల కవరింగ్‌తో, తన నటనా చాతుర్యపు కలరింగ్‌తో…. వాస్తవాలకు మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేశారు మోహన్‌బాబు… అసలు ఆరోజు ఏం జరిగిందో మొత్తం గమనించగలరు..హైదరాబాద్‌ శివార్లలోని జల్‌పల్లి వేదికగా…నటుడు మంచు మోహన్‌బాబు ఇంట్లో కొద్ది రోజులుగా రచ్చ జరుగుతోంది. మోహన్‌బాబు, ఆయన పెద్దకొడుకు విష్ణు ఓవైపు, చిన్న కుమారుడు మంచు మనోజ్‌ మరోవైపు …

Read More »

 కేబినెట్‌లో చోటు దక్కించుకునేదెవరు..? హైకమండ్‌ మదిలో ఎవరున్నారు…?

ఓవైపు మంతనాలు… మరోవైపు అధిష్టానానికి లేఖలు. యస్… తెలంగాణ కేబినెట్‌లో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు. స్టేట్‌లోనే కాదు ఢిల్లీలోనూ గట్టిగానే లాబీయింగ్‌ చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసిన షార్ట్‌ లిస్టులో ఎవరి పేర్లున్నాయ్…? హైకమండ్‌ మదిలో ఎవరున్నారు…? ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు కాబోతున్నారు…!కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైనప్పటికీ… సీఎం రేవంత్‌ సహా మరో 11 మంది మంత్రులతోనే ప్రభుత్వం నడుస్తోంది. ఇంకా మరో ఆరుగురికి అవకాశం ఉన్నప్పటికీ…. ఆ దిశగా అడుగులు పడలేదు. …

Read More »

 జైల్లో లగచర్ల రైతుకు గుండెనొప్పి.. సంకెళ్లతో ఆస్పత్రికి.. సీఎం రియాక్షన్ ఇదే..

అతనేమీ హంతకుడు కాదు. ఉగ్రవాది అంతకన్నా కాదు.. అతనో అన్నదాత.. ఆయన తన భూమిని కాపాడుకునే క్రమంలో జైలుకు వెళ్లిన లగచర్ల రైతు.. లగచర్ల రైతుకు గుండెపోటు వస్తే పోలీసులు బేడీలు వేసి ఆస్పత్రికి తరలించడం తెలంగాణలో కలకలం రేపింది.పైన ఫోటోలో మనం చూస్తున్న రైతు పేరు హీర్యానాయక్‌. ఈయనకు గుండెపోటు వస్తే పోలీసులు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తీసుకెళ్లారు. రైతుకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి రెఫర్ చేశారు. రైతుకు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించడంపై బీఆర్ఎస్‌ …

Read More »

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పట్టుకోని పిల్లలు.. కొడుకు తిక్క కుదిర్చిన ఓ తండ్రి..!

మెదక్ జిల్లాలో ఓ కొడుకు అస్తిపాస్తులు పంచుకుని తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్‌కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కీలక ఆదేశాలు ఇచ్చారు.తల్లిదండ్రులు తమ పిల్లలను అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. అయితే ఆ పిల్లలు మాత్రం తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు వారి బాగోగులు చూసుకునేందుకు ప్రస్తుత కాలంలో ఇష్టపడట్లేదు. ఆస్తిపాస్తులు, బంగారం, డబ్బులు తీసుకుని తల్లిదండ్రులను అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. వాళ్లను పట్టించుకోకుండా వేరే ఇంట్లో ఉంచుతున్నారు. వేరే దిక్కు లేక, చివరి రోజుల్లో అతికష్టం మీద బతుకు ఈడ్చుకుంటూ వాళ్ళు కూడా అలాగే వృద్ధాశ్రమంలో …

Read More »

మేము తలుచుకుంటే వారి పేర్లు, విగ్రహాలు ఉండేవా? రాహుల్‌కు కేటీఆర్ ఘాటు లేఖ..

చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని సీఎంని తెలంగాణ నెత్తిన రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు లేఖ రాశారు. గ్యారెంటీలన్నీ గారడీలేనని కాంగ్రెస్ ఏడాది పాలన చూస్తే అర్థమైపోయిందని ఆయన విమర్శించారుతెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతుంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్కరి మీద మరొక్కరు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ వివాదం ముగియక ముందే మాజీ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీకి లేఖ రాశారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై …

Read More »

విద్యార్థులకు ఉపాధ్యాయుడు బైబిల్ పంపిణీ..కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది

విద్యా బోధనలు నేర్పించే పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మత ప్రచారం చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ పేరుతో విద్యార్థులకు బైబిల్‌ను పంపిణీ చేశాడు. ఇది తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఉపాధ్యాయుడితో ఆందోళనకు దిగారు.ప్రభుత్వ పాఠశాల మత ప్రచారం కేంద్రంగా మారింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు మత బోధకుడిగా మారిపోయాడు. ఏకంగా విద్యార్థులకు బైబిల్ పంపిణి చేశాడు. ఈ విషయం పేరెంట్స్‌కి తెలియడంతో ఉపాధ్యాయుడిని నిలదీశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. రాజన్న …

Read More »

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి కీలక ఆదేశాలు

ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కలెక్టర్‌ల వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుల పరిశీలనకు డెడ్‌లైన్ విధింంచిన మంత్రి.. పొరపాట్లకు తావులేకుండా సర్వే నిర్వహించాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న‌ను పకడ్బందీగా చేప‌ట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి జిల్లా. ఇందిరమ్మ ఇండ్ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న, సామాజిక స‌ర్వే త‌దిత‌ర అంశాల‌పై సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి. ఈకార్యక్రమంలో సీఎం సలహాదారు, సీఎస్ …

Read More »

షార్ట్‌ లిస్ట్ రెడీ.. సంక్రాంతికి విడుదల..! ఢిల్లీకి చేరిన తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయం

తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో ఆరుగురు అదృష్టవంతులు ఎవరో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. అన్నీ కుదిరితే సంక్రాంతికి తెలంగాణ కేబినెట్‌లో కొత్త అమాత్యులు చేరబోతున్నారు. ఇందు కోసమే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ పర్యటనకు వెళ్లారని చర్చ జరుగుతోంది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సహా మరో 11 మంది మంత్రులతోనే రేవంత్ సర్కార్ నడుస్తోంది. ఇంకా మరో ఆరుగురికి కేబినెట్‌లో అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ …

Read More »