తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న సర్వే ప్రారంభం కాగా.. ఈనెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి 8 వరకు ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు చేసి స్టిక్కరింగ్ వేశారు. తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అందుకు అనుగుణంగా 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించి వారికి సర్వే బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఎన్యూమరేటర్ …
Read More »కోటి దీపోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు.. ఈసారి ప్రత్యేకతలు, వివరాలివే..
ఏటా కార్తీకమాసంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరిగే కోటి దీపోత్సవానికి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ ఉంది. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా భక్తులకు ఆధ్యాత్మిక వైభవం అందించేందుకు కోటి దీపోత్సవ జాతర సిద్ధమైంది. నవంబర్ 9 నుంచి 25 వరకు 17 రోజుల పాటు జరుగనున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. శివ, కేశవుల థీమ్‌తో భారీ సెట్టింగ్ వేశారు. వేదికను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈసారి …
Read More »హైదరాబాద్‌లో కొత్త రైల్వేస్టేషన్.. త్వరలోనే ప్రారంభం.. ఇక్కడి నుంచి నడిచే రైళ్ల జాబితా ఇదే..!?
హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అదిపెద్ద రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తికావొచ్చింది. సుమారు 100 ఏళ్ల తర్వాత నగరంలో అతి పెద్ద రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి రైల్వే స్టేషన్ అవతరిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఉన్న.. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు రోజురోజుకు ప్రయాణికుల రద్దీ పెరగటంతో పాటు.. వాళ్ల సౌకర్యార్థం నడుపుతున్న రైళ్ల రాకపోకలు కూడా పెరుగుతుండటంతో.. ఆ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేస్తోంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని తలపించేలా సకల …
Read More »తెలంగాణలో వాళ్లందరికీ శుభవార్త.. ఒక్కొక్కరికీ రూ.లక్ష సాయం.. భట్టి కీలక ప్రకటన
Telangana UPSC Aspirants: తెలంగాణలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త వినిపించారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన ప్రతి ఒక్క అభ్యర్థికి లక్ష రూపాయల నగదు సాయం అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భట్టి విక్రమార్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ …
Read More »TG Schools: నేటి నుంచి ఒంటి పూట బడులు.. ఎప్పటి వరకంటే..?
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీపి కబురు. నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. అయితే ఈ ఒంటిపూట బడులు అన్ని స్కూళ్లకు కాదు. ప్రైమరీ స్కూళ్లు మాత్రమే సగం పూట నడవనున్నాయి. ప్రైమరీ స్కూళ్లను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నడపనున్నారు. తెలంగాణలో నేటి నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరగనుంది. నవంబర్ 6 నుంచి 30 వరకు …
Read More »HYD: బాలుడి ప్రాణం తీసిన బడి గేటు.. విరిగిపడటంతో ఒకటో తరగతి విద్యార్థి మృతి
హైదరాబాద్ శివారు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్కూల్ గేటు మీద పడటంతో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. హయత్‌నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో సోమవారం (నవంబర్ 4) సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్ ముదిరాజ్ కాలనీలో నివాసం ఉండే అలకంటి చందు, సరోజ దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు అజయ్ (6) హయత్‌నగర్ మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం …
Read More »సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. పాదయాత్రకు సిద్ధం.. పుట్టిన రోజునే శ్రీకారం..!
సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న మూసీ పునరుజీవం ప్రాజెక్టు విషయంలో ప్రజల నుంచి వస్తున్న మిశ్రమ స్పందనతో.. మూసీ పరివాహక ప్రాంతాల్లో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలను కలుసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. నవంబర్ 08వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా.. తన క్షేత్రస్థాయి పర్యటనలకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని.. సీఎం …
Read More »హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నగరంలో మరో స్కైవాక్, ఈ ఏరియాలోనే
హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరంలో పెట్టుబడులు పెట్టాయి. మరికొన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇక అంతర్జాతీయంగా నగరం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మౌళిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నగర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. కొన్ని చోట్ల గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో నగరంలో కొత్త అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు, రహదారులు నిర్మాణానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరంలో భారీగా ఫ్లైఓవర్లు, …
Read More »కురుమూర్తి జాతరకు వెళ్తున్నారా..? TGSRTC తీపి కబురు
పాలమూరు జిల్లాలోని సప్త కొండలు నెలరోజుల పాటు గోవిందనామస్మరణతో మారుమోగనున్నాయి. జిల్లా ప్రజల ఇలవేల్పు దైవం కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఏడు కొండల మధ్య లక్ష్మి సమేతంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈనెల 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపురం సమీపంలో స్వయంభవుగా వెలిసిన స్వామివారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లానుంచే కాకుండా తెలంగాణ, ఆంధ్రా, కర్ణాటక, …
Read More »తిరుమల తిరుపతి దేవస్థానం పాఠశాలలో SGT టీచర్ పోస్టులు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఎస్జీటీ టీచర్ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధులను ఎంపిక చేయనున్నారు.. నవంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ ప్రగతినగర్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పాఠశాలలో ఎస్జీటీ గెస్ట్ ఉపాధ్యాయ పోస్టులకు అర్హులైన దరఖాస్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు …
Read More »