పాలిటిక్స్

వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. పిన్నెల్లికి మరోసారి ఆ బాధ్యతలు, వరుసగా రెండోసారి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీలో ప్రక్షాళన మొదలు పెట్టారు అధినేత వైఎస్ జగన్. ఈ మేరకు జిల్లాల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తున్నారు.. జిల్లాలవారీగా అధ్యక్షుల్ని నియమిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, హత్యాయత్నం కేసుల్లో జైలుకు వెళ్లి విడుదలైన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి అధినేత జగన్ కీలక బాధత్యలు అప్పగించారు. పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమించారు. అంతకముందు కూడా పిన్నెల్లి ఆ బాధ్యతల్లో ఉన్నారు.. ఆయన్ను పార్టీ అధ్యక్షుడు జగన్‌ మళ్లీ నియమించారు. వైఎస్ జగన్ తాడేపల్లి నివాసంలో పల్నాడు, …

Read More »

పెళ్లిపై కంగనా రనౌత్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, ఫ్రైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ కొత్త ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొంది, లోక్ సభలో అడుగు పెట్టారు కంగన. పార్లమెంట్‌‌లో ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నారని, తన నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని ఆమె మద్దతుదారులు, ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఎంపీగా తన బాధ్యతలను కొనసాగిస్తూనే.. తాను స్వీయ దర్శకత్వంలో నటించిన ‘ఎమర్జెన్సీ’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం అయ్యారు కంగనా. అయితే, కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల …

Read More »

నారా లోకేష్ ‘రెడ్ బుక్‌’కు N-కన్వెన్షన్‌ కూల్చివేతకు లింక్.. గాదె ఇన్నయ్య సంచలన కామెంట్స్

ప్రస్తుతం హైడ్రా (HYDRA) అనేది.. టాక్ ఆఫ్ ది సిటీగానే కాకుండా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారిపోయింది. కేవలం తెలంగాణ వరకే కాకుండా.. పక్క రాష్ట్రాల్లోనూ హైడ్రా గురించి చర్చ నడుస్తోందంటే.. బుల్డోజర్ల ప్రభావం గట్టిగానే పడిందని అర్థమవుతోంది. అందుకు కారణం.. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ భూములు కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా.. సామాన్యులా, సెలెబ్రిటీలా, రాజకీయ ప్రముఖులా అనేది చూడకుండా.. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా.. అక్రమకట్టడాలపై బుల్డోజర్లు ప్రయోగిస్తుండటమే. ముఖ్యంగా.. టాలీవుడ్ అగ్రహీరో అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ …

Read More »

రాజీనామాకు రెడీ.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 5 నెలల్లో ఏకంగా 60 లక్షల మొక్కలు నాటామంటూ చెబుతున్న అటవీశాఖ సిబ్బందికి సవాల్ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ మార్కెట్‌లో నిర్వహించిన వనమహోత్సవ సభలో శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. గత 5 నెలల్లో ఇంత భారీ మొత్తంలో మొక్కలు నాటారని నిరూపిస్తూ రాజీనామా చేస్తాను అన్నారు. సోషల్ ఆడిట్లో 60 లక్షల మొక్కలు నాటినట్లు నిరూపిస్తే రాజీనామాకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. అలాగే అయ్యన్నపాత్రుడు అటవీ …

Read More »

తెలుగుదేశం పార్టీలో చేరే నేతలకు షాక్.. చంద్రబాబు సంచలన నిర్ణయం

TDP: తెలుగుదేశం పార్టీలో చేరేవారికి ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు షాక్ ఇచ్చారు. ఏపీలో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. మరీ ముఖ్యంగా వైఎస్సార్సీపీ నుంచి భారీగా నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సైకిల్ ఎక్కుతున్నారు. భవిష్యత్‌లో మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోకి వచ్చేవారు ఎవరైనా సరే.. తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పసులు కండువా కప్పుకోవాలని …

Read More »

వైసీపీకి బిగ్ షాక్, ఎంపీ రాజీనామా?.. టీడీపీలో చేరాలని నిర్ణయం!

వైఎస్సార్‌సీపీకి మరో ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. మరో ముఖ్యమైన నేత ఆ పార్టీని వీడబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గురువారం ఆ పార్టీని వీడబోతున్నట్లు కొందరు ట్వీట్‌లు చేశారు. మోపిదేవి చూపు తెలుగు దేశం పార్టీ వైపు ఉందని.. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు మోదలయ్యాయి. మోపిదేవి వెంకటరమణకు ఎంపీ పదవితో పాటుగా బాపట్ల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవి కూడా …

Read More »

స్పీకర్ పదవైనా వదిలేస్తా కానీ.. ఈ విషయంలో తగ్గేదే లేదు..

Ayyanna Patrudu on Narsipatnam RTC Depot land Private Lease issue: ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి అయ్యన్న శైలి ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఆయన. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ముక్కుసూటితనం, ఉన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం ఆయన స్టైల్. అయితే తాజాగా చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెప్తున్నా కూడా వినకుండా అధికారులు వ్యవహరిస్తున్నారని …

Read More »

రాజకీయాల్లోకి వినేశ్ ఫొగాట్.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో సోదరిపైనే పోటీ?

వినేశ్ ఫొగాట్. గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. పారిస్ ఒలింపిక్స్‌ 2024 లో మహిళల రెజ్లింగ్ విభాగంలో 100 గ్రాములు అధికంగా బరువు ఉన్న కారణంగా పతకానికి దూరమైన వినేశ్ ఫొగాట్‌ పట్ల దేశం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతి చెందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదలుకుని.. నెటిజన్ల వరకు అంతా వినేశ్ ఫొగాట్‌కు అండగా నిలిచారు. ఈ క్రమంలోనే 100 గ్రాములు ఎక్కువ బరువు ఉండడంతో చేతివరకు వచ్చిన పతకం చేజారిపోయింది. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్న వినేశ్ ఫొగాట్.. రెజ్లింగ్‌ నుంచి …

Read More »

జగన్.. నీకా అర్హత లేదు.. కేసీఆర్‌తో కుమ్మక్కై నాశనం చేశావ్: గొట్టిపాటి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం గురించి ప్రశ్నించిన వైఎస్ జగన్ మీద విరుచుకుపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత వైఎస్ జగన్‌కు లేదన్నారు. వెలిగొండ ప్రాజెక్టు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా అడ్డుకున్నది వైఎస్ జగన్‌నేనని ఆరోపించారు. ప్రకాశం జిల్లా నేతలమంతా కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిశామన్న గొట్టిపాటి రవికుమార్.. వైఎస్ జగన్ మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను నాశనం చేశారన్నారు. అప్పటి …

Read More »

వైసీపీకి కొత్త సోషల్ మీడియా ఇంఛార్జ్ నియామకం.. మరి సజ్జల భార్గవ రెడ్డి సంగతేంటి!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీచేసి కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఈ దారుణమైన ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.. పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడారు. మాజీ మంత్రులు ఆళ్ల నాని, శిద్దా రాఘవరావు.. మాజీ ఎమ్మెల్యేలు పెండెం దొరబాబు, మద్దాలి గిరి, కిలారి రోశయ్యలు వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు నరసింహయ్య కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇలా …

Read More »