భక్తి

పూరీ జగన్నాథ్ ఆలయ రహస్యం.. నేలపై నీడ పడని వైనం, దైవ ఘటనా, ఆలయ నిర్మాణ శైలా..

ఒడిశాలోని పూరిలో ఉన్న జగన్నాథుని ఆలయం హిందూ మతంలోని నాలుగు ధామాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. జగన్నాథుడు అంటే ప్రపంచానికి ప్రభువు అని అర్ధం. ఇక్కడ దేవుడి సజీవంగా ఉన్నాడని భక్తుల నమ్మకం. అంతేకాదు ఈ జగన్నాథ ఆలయంలో ఎవరూ కనుగొనలేని అనేక అపరిష్కృత రహస్యాలు ఉన్నాయి. ఈ రహస్యాలలో ఒకటి జగన్నాథ్ పూరి ఆలయం నీడ కనిపించకపోవడం. దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాందేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలలో జగన్నాథ పూరి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు తన అన్నయ్య బలభద్రుడు , సోదరి …

Read More »

హిందు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఐక్యంగా పోరాడుదాం.. ధర్మ పరిరక్షణకు మురుగన్ తోడుః పవన్

ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుబ్రమణ్య భక్తుల సమీకరణ కోసం హిందూ మున్నని ఆధ్వర్యంలో ఈ భారీ కార్యక్రమం చేపట్టారు. లక్షలాది మంది భక్తులు సుబ్రమణ్య స్వామి కంద షష్ఠి కవచాన్ని పఠించిన ఈ కార్యక్రమంలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. ధర్మం కోసం నిలబడే ప్రతి అడగు మనల్ని విజయతీరాలకు చేరుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మధురైలోని అమ్మతిడల్ ప్రాంగణంలో హిందూ మున్నాని సంస్థ నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా …

Read More »

 దుర్గమ్మ భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇకపై కొండపైకి వెళ్లకుండానే దర్శన టికెట్లు పొందొచ్చు!

విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు శుభవార్త చెప్పారు. ఇకపై ఆలయ పరిసరాల్లోనే కాకుండా, బస్‌స్టేషన్‌, రైల్వే స్టేషన్‌లలోనూ భక్తులకు అమ్మవారి దర్శన టికెట్లను అందుబాటులో ఉంచే విధంగా దేవస్థాన కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా భక్తుల విజ్ఞప్తి మేరకు విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, తారాపేట మాడపాటి గెస్ట్ హౌస్, వన్ టౌన్ జమ్మి దొడ్డిలలో దేవస్థానం కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. ఈ క్రమంలోనే విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. భద్రకాళి అమ్మవారి బోనాలు తాత్కాలిక వాయిదా.. ఎందుకంటే!

వరంగల్ భద్రకాళి అమ్మవారికి బోనాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. అయితే ఇటీవల భ‌ద్రకాళి అమ్మవారి బోనాల‌కి సంబంధించి కొంత‌ మంది నుంచి అభ్యంతరాలు రావడంతో పాటు.. పలు సోషల్‌ మీడియా మాధ్యమాల్లో ఈ విషయంపై త‌ప్పుడు వార్తలు ప్రచురితమైన దృష్ట్యా, ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న రాజకీయ విభేదాలను.. పవిత్రమైన అమ్మవారికి …

Read More »

బోనాల జాతరకు వేళాయెరా..! ఈ ఉత్సవాలు ఏ రోజున ఎక్కడ జరగనున్నాయంటే..

బోనాల పండుగ ఇది హైదరాబాద్ పండుగ ఆషాడమాసం అనగానే హైదరాబాద్ బోనాల గుర్తుకొస్తాయి ఈ బోనాల పండుగ నిర్వహించేందుకు ఇప్పటికే ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను ముమ్మరం చేస్తుంది. ప్రతి ఏడాది బోనాల జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. నెలరోజుల పాటు జరిగేటటువంటి ఈ బోనాలకు లక్షలాదిమంది భక్తులు ఆయా ప్రాంతాల్లో బోనాలు సమర్పించుకొని మొక్కులను చెల్లించుకుంటారుఆషాడ జాతర వచ్చేస్తుంది. అమ్మవారిని తమ ఇంటి బిడ్డగా భావించి అత్త ఇంటి నుంచి పుట్టింటికి తీసుకువచ్చి ఎంతో అందంగా అలంకరించి ధూప నైవేద్యాలతో సారే …

Read More »

ఆశ్చర్యంగా నెమలి ప్రవర్తన – 6 ఏళ్లుగా సమ్మక్క సారక్క గుడికి – సూర్యాస్తమయానికి మాయం

ఆరేళ్లుగా స్థానిక సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద ప్రతిరోజూ దర్శనమిచ్చే ఈ నెమలి భక్తులను ఆకట్టుకుంటోంది. ఉదయం ఎనిమిదికి ఆలయానికి చేరి సాయంత్రం నాలుగున అడవికి వెళ్ళే ఈ నెమలిని.. భక్తులు అమ్మవారి ప్రతిరూపంగా భావిస్తున్నారు. ఆ నెమలితో ప్రత్యేకంగా సెల్పీలు దిగుతున్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారుగూడెం గ్రామ సమ్మక్క సారలమ్మ ఆలయం వద్ద కనిపించే ఓ నెమలి భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటలకు ఆలయానికి చేరుకొని.. సాయంత్రం నాలుగు గంటలకు తిరిగి అడవికి వెళ్లిపోతుంది. గత …

Read More »

పాలకొల్లులో ఆవుల కోసం గరుకు స్తంభాల ఏర్పాటు.. ఈ గరుకు స్తంభం విశిష్టత ఏమిటంటే..

మనిషికి దురద పుడితే ఏం చేస్తారు చేతితో గోకుతారు. వీపు భాగం లో ఐతే పుల్ల తోనో మరేదైనా వస్తువునో ఉపయోగిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా వెదురుతో చేసిన వస్తువులు సైతం మార్కెట్ లో అందుబాటులో వున్నాయి. మరి ఇదే కష్టం ఒక నోరులేని జీవికి వస్తే అది యెంత వేదనకు గురి అవుతుంది. సాధ్యమైనంత వరకు తనకు తాను శరీరానికి కలిగిన అసౌకర్యాన్ని తొలిగించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆవుకి ఉండే గంగ డోలుకి దురద కలిగితే.. తీర్చుకునేందుకు గరుకు స్థంభాలను ఏర్పాటు …

Read More »

తిరుమల కొండలో ట్యాక్సీల దందాకు చెక్.. భక్తుల సౌకర్యం కోసం టీటీడీ పక్కా ప్లాన్

ఆపదమొక్కుల స్వామికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు దేశ విదేశాల నుంచి తిరుమల కొండకు చేరతారు. మొక్కులు చెల్లించేందుకు ఎన్నో వ్యయ ప్రయాసలు పడుతారు. ముడుపులు కట్టి కొండ మెట్లు ఎక్కి కోనేటి రాయుడు దర్శనం కోసం తిరుమల కొండకు చేరి భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లిస్తారు. అయితే భక్తులను ప్రవేయిట్ వాహనదారులు అధిక చార్జీల పేరుతో దోపిడీ చేస్తున్నారు. ఈ దందాకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్లాన్ చేసింది.ఏడుకొండల మీద కొలువైన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు కొందరు మెట్ట …

Read More »

పెళ్ళికొడుకు అలంకారం లో ముస్తాబైన పరమశివుడు… మహాశివరాత్రికి మూడు రోజుల ముందే కళ్యాణ మహోత్సవం…

23 వ తేదీ ఆదివారం మాఘ బహుళ దశమి ముహూర్తాన ఉదయం 11 గంటలకు శ్రీ భవాని సహిత సిద్దేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారు.. ఈ నేపద్యంలో ఆలయాన్ని కళ్యాణ వేడుకకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. కల్యాణ మహోత్సవానికి ముందు ఆనవాయితీ ప్రకారం సిద్దేశ్వరన్నీ పెళ్లి కొడుకులా ముస్తాబు చేశారు.. స్వయంభు సిద్దేశ్వరస్వామి లింగం వద్ద స్వామి వారినీ అచ్చం పెళ్ళి కొడుకులా ముస్తాబు చేసిన అలంకరణ ను చూసి భక్తులు మురిసి పోతున్నారు..దక్షిణ కాశీగా పేరుగాంచిన వరంగల్ లోని శ్రీ స్వయంభు …

Read More »

దేశంలోనే మొట్టమొదటి ఎత్తయిన స్వర్ణగోపురం కలిగిన ఆలయంగా యాదగిరిగుట్ట

ప్రపంచ అద్భుత ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఏ దేవాలయంలో లేని విధంగా ఆలయ విమానం గోపురం స్వర్ణమయమైంది. 23న సుదర్శన లక్ష్మీనరసింహ దివ్య విమాన స్వర్ణ గోపురం మహాకుంభాభిషేక ప్రతిష్టా మహోత్సవం జరుగుతుంది.యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ విమానావిష్కరణకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు స్వస్తివాచనం, విష్వక్సేనారాధన, పుణ్యాహ వాచనం, రక్షాబంధనం పూజలతో మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, మృత్సంగ్రహణం, యాగశాల ప్రవేశం, …

Read More »