Recent Posts

 హైదరాబాద్‌ శివారులో భయం భయం… ఒంటరిగా బయట తిరగొద్దని అధికారుల ప్రకటన

గ్రేటర్‌ హైదరాబాద్‌ శివారులో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. బాలాపూర్‌లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రీసెర్చ్‌ సెంటర్‌ ఇమారత్‌లో రెండు చిరుతల సంచరించడం నిజమేనని అధికారులు తేల్చారు. చిరుతల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఒంటరిగా బయట తిరగొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో చిరుతల సంచారం స్థానికంగా సంచలనంగా మారింది. గతంలోనూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వరుసగా చిరుత పులులు సంచరించాయి. నగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అప్పుడు అటవి అధికారులు శ్రమించి నగర శివార్లలో తిరుగుతున్న పులులను పట్టుకున్నారు. అనంతరం …

Read More »

హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు కస్టడీ కోరనున్న సీఐడీ… ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనున్న సీఐడీ

హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌ రావును కస్టడీ కోరనుంది సీఐడీ. నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జగన్‌తో పాటు మరికొంత మంది నిందితులను విచారించనుంది సీఐడీ. ఈడీ రాసిన లేఖపై కూడా నిర్ణయం తీసుకోనుంది సీఐడీ. ఈ క్రమంలో హెచ్‌సీఏ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈడీ నెక్స్ట్ యాక్షన్ ప్లానేంటి? అనే అంశం ఇప్పుడు క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. హైదరాబాద్ క్రికెట్‌ అసోసియేషన్‌లో అవకతవకలపై ఈడీ విచారణ మొదలుపెట్టింది. ప్రాథమిక సమాచారం ఇవ్వాలని సీఐడీకి …

Read More »

తెలంగాణలో రోహిత్ వేముల చట్టం..! బీజేపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: డిప్యూటీ సీఎం భట్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రోహిత్ వేముల ఆత్మహత్య కేసుకు సంబంధించిన వ్యక్తిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు. రోహిత్ వేములకు న్యాయం చేయడానికి త్వరలోనే రోహిత్ వేముల చట్టాన్ని తీసుకువస్తామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు నియామకం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్. రోహిత్ వేముల ఆత్మహత్యకు కారకులైన వారికి పదవులివ్వడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క. …

Read More »