Recent Posts

ఏపీ, తెలంగాణకు నారా భువనేశ్వరి భారీ విరాళం.. హెరిటేజ్ తరఫున కళ్లు చెదిరే మొత్తం

ఆంధ్రప్రదేశ్‌కు వర్షం, వరద రూపంలో పెద్ద విపత్తు వచ్చిపడింది. ముఖ్యంగా విజయవాడ పరిస్థితి దయనీయంగా ఉంది.. నాలుగు రోజుల తర్వాత పరిస్థితి ఇప్పుడిప్పుడే కాస్త మెరుగుపడుతోంది. రాష్ట్రంలో పరిస్థితుల్ని చూసిన ఎంతోమంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నాయి.. కొందరు విరాళాలు ప్రకటిస్తుంటే.. మరికొందరు ఆహారం అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ ఎండీ నారా భువనేశ్వరి భారీగా …

Read More »

మాజీ ప్రిన్సిపల్ భారీ కుట్రదారు.. సీబీఐ సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై సీబీఐ దర్యాప్తు సాగుతోంది. ఆసుపత్రిలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలపై మాజీ ప్రిన్సిపల్‌ ప్రొ. సందీప్ ఘోష్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.. మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సందీప్ ఘోష్‌‌పై సీబీఐ తరఫు లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, వాటిని తవ్వితీయాల్సిన అవసరం ఉందని వివరించారు. సందీప్ ఘోష్‌ను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ వాదనలతో ఏకీభవించిన …

Read More »

యాచారం ఫార్మాసిటీ ఉన్నట్లా? లేనట్లా?.. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్ నగర శివార్లలోని రంగారెడ్డి జిల్లా యాచారం, కడ్తాల్, కందుకూరు మండలాల పరిధిలో 19 వేల ఎకరాల్లో ఫార్మాసిటీ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు భూసేకరణ కూడా చేపట్టింది. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోయి.. కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం కొలువుదీరగానే ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫార్మాసిటీ సేకరించిన భూముల్లో గ్రీన్ సిటీ టౌన్‌షిప్‌లు అభివృద్ది చేయాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా.. ఈ ఫార్మా భూములు విషయంలో హైకోర్టులో విచారణ జరిగింది. అసలు ఫార్మాసిటీ ఉన్నట్లా..? …

Read More »