Recent Posts

సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌పై ఇజ్రాయేల్ భీరక దాడులు

ఇజ్రాయేల్ అనుకున్నంత పనిచేసింది. ఈ నెల ప్రారంభంలో తమపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయేల్.. శనివారం ఉదయం ఇరాన్‌పై విరుచుకుపడింది. టెహ్రాన్ సహా నాలుగు నగరాల్లోని ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. ఆరు నెలల వ్యవధిలో ఇరాన్‌పై ఇజ్రాయేల్ దాడి చేయడం ఇది రెండోసారి. అక్టోబరు 1న ఇజ్రాయేల్‌పై 200కిపైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని అమెరికాతో కలిసి ఇజ్రాయేల్ అడ్డుకుంది. దాడి నేపథ్యంలో ఇజ్రాయేల్ అంతటా సైరన్లు మోగించి ప్రజలను …

Read More »

ఏపీలో టీచర్లకు తీపికబురు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు, డిసెంబర్‌లో ఫిక్స్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ప్రత్యేకంగా చట్టం తీసుకురాబోతోంది. ఈ ముసాయిదా బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. టీచర్లు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి పదవీవిరమణ వరకు మారుమూల ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసేలా చట్టాన్ని తీసుకొస్తోంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు ఉన్న ప్రాంతాలను నాలుగు కేటగిరీలుగా విభజించాలని నిర్ణయించారు. ఈ బదిలీలకు గరిష్ఠంగా 8 ఏళ్ల సర్వీసు కాగా.. కనీస సర్వీసు ఎంతనేది మాత్రం నిర్ణయం తీసుకోలేదు. ముందుగా ప్రమోషన్లు ఇచ్చి, ఆ తర్వాత …

Read More »

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు 4 గంటల్లోనే.. కొత్త రైలు మార్గం, ఈ రూట్‌లోనే!

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీపికబురు చెప్పింది. రెండు రాష్ట్రాల మధ్య రైలు ప్రయాణానికి సంబంధించి.. రెండు ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణం తగ్గనుంది. విశాఖపట్నం-శంషాబాద్‌ (దువ్వాడ) మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ ఎలైన్‌మెంట్ ఖాయమైంది. ఈ మార్గాన్ని సూర్యాపేట, విజయవాడ మీదుగా ఈ ప్రతిపాదన చేశారు. అలాగే విశాఖ నుంచి విజయవాడ, సూర్యాపేటల మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇది విశాఖపట్నం నుంచి మొదలై.. సూర్యాపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌ మీదుగా కర్నూలు వరకు ఉంటుంది. ఈ …

Read More »