Recent Posts

భర్త కనిపించడం లేదంటూ భార్య ఫిర్యాదు.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు..!

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. భర్త కనిపించడం లేదంటూ 50 రోజుల క్రితం చేసిన ఫిర్యాదు ఎట్టకేలకు మర్డర్ కేసుగా మారింది. దృశ్యం సినిమాను తలపించేలా దర్యాప్తులో తీగలాగితే డొంక కదిలింది. వివరాల్లోకి వెళితే హత్యకు గురైన ప్రభాకర్ వృత్తిరీత్యా ఎలక్ట్రిషన్. అన్నమయ్య జిల్లా పుల్లంపేట కు చెందిన ప్రభాకర్ పదేళ్ల క్రితం ఎలక్ట్రిషన్ పనుల కోసం శ్రీకాళహస్తికి వచ్చాడు. కొత్తపేటలో ఉన్న స్నేహితుడి తో కలిసి అద్దెలో ఉంటున్నాడు. పనులేని రోజుల్లో ఇంటికి వెళుతూ వస్తున్న ప్రభాకర్‌కు శ్రీకాళహస్తిలో …

Read More »

మాయదారి రోగం మళ్లీ దాపురించింది.. నెల్లూరు జిల్లాలో జికా వైరస్ కలకలం..!

ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ లక్షణాలు కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్‌ లక్షణాలు ఉన్నట్టు వైద్యులు అనుమానిస్తున్నారు.. బాలుడికి మెరుగైన వైద్యం కోసం చెన్నై ఆసుపత్రికి తరలించారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర మంత్రి ఆనం రాంనారయణరెడ్డి స్పందించారు. జిల్లాలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది.కరోనా మహమ్మారి తర్వాత ఏ వైరస్ పేరు విన్నా వెన్నులో వణుకు పుడుతోంది. ఆమధ్య దేశ వ్యాప్తంగా కలకలం రేపిన జీకా వైరస్ బెడద తప్పిందని అనుకుంటుండగా మరోసారి భయం మొదలైంది. నెల్లూరు జిల్లాలో …

Read More »

నీట్ యూజీ 2025 కొత్త సిలబస్‌ వచ్చేసింది.. సబ్జెక్టుల వారీగా పూర్తి వివరాలివే..

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మెడికల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న నీట్ యూజీ 2025 పరీక్స సిలబస్ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) విడుదల చేసింది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల వారీగా అంశాలను పొందుపరిచారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారాదేశవ్యాప్తంగా ఉన్న పలు మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి బ్యాచిలర్‌ డిగ్రీ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ ప్రవేశ పరీక్ష- అండర్ గ్రాడ్యుయేట్ (నీట్‌ యూజీ) సిలబస్‌ …

Read More »