Recent Posts

హైదరాబాద్‌ గజగజ.. ఆరేళ్ల తర్వాత మళ్లీ విజృంభిస్తున్న చలిపులి!

ఆరేళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్ లో చలి పులి విజృంభిస్తుంది. ఓ వైపు చలితో జనాలు అల్లాడిపోతుంటే.. మరోవైపు నానాటికీ పడిపోతున్న గాలినాణ్యత డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. దీంతో జనజీవనం ప్రశ్నార్ధకంగా మారింది. ఆదివారం సిటీలో దాదాపు 300 AQI నమైదైంది. సోమవారం మధ్యాహ్నం నాటికి గాలి నాణ్యత కాస్త కోలుకుంది..హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. అల్పపీడన ప్రభావంతో ఉదయం, రాత్రి వేళల్లో చలిపంజా విసురుతోంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతంగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చలితీవ్ర వల్ల …

Read More »

మరోసారి భాగ్యనగరంలో గుప్పుమన్న మత్తు మందు.. రూ. కోటి 25 లక్షల విలువ చేసే డ్రగ్స్ సీజ్

తెలంగాణ నార్కోటిక్‌ అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నా.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందా మాత్రం ఆగడంలేదు. తాజాగా మీర్‌పేట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడడం కలకలం రేపుతోంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్‌‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. వారి నుంచి 53 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా రక్షణ స్వాధీనం చేసుకున్నారు ఎల్బీనగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు. మీర్‌పేట్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా …

Read More »

తెలంగాణలో హరిత విప్లవం దిశగా కీలక అడుగులు.. సీఎం రేవంత్‌ సర్కార్ సంచలన నిర్ణయం..!

తెలంగాణ‌లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తయ్యింది. స్వరాష్ట్రంలో పదేళ్లుగా ఎదురే లేద‌నుకున్న గులాబి పార్టీని ఓడించి, తెలంగాణ‌కు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అంతే దూకుడుగా రేవంత్ రెడ్డి పాలనలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సీఎం. ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారుతోన్న వాతావరణ మార్పులను అధిగమించేందుకు రేవంత్‌ రెడ్డి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ …

Read More »