Recent Posts

తీవ్రమైన చలితో హైపోథెర్మియా వంటి వ్యాధులు.. వైద్యుల హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలపై చలిపులి..పంజా విసురుతోంది. ఉన్నట్లుండి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. పెరిగిన చలి తీవ్రతతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో కనిష్టంగా 6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా..అల్లూరి జిల్లా మినుములూరులో 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డయింది. నిర్మల్‌లో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ …

Read More »

పెళ్లికి రావాలని సీఎం చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లను కలిసి తన వివాహ వేడుకకు రావాలని ఆహ్వానించారు. పీవీ సింధు, వ్యాపారవేత్త వెంకటదత్త సాయిల వివాహం ఈ నెల 22న రాజస్థాన్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో సింధు పలువురు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందచేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడిని …

Read More »

ఏపీలో అప్పుడే మొదలైన పందెంరాయుళ్ల హడావిడి

ఏపీలో అప్పుడే పందెం కోళ్లు కత్తులు దూస్తున్నాయి. సంక్రాంతి పండగకు నెలరోజుల ముందే పందెం రాయుళ్లు కాయ్‌ రాజా కాయ్‌ అంటున్నారు. కోళ్లకు కత్తులు కట్టి కొట్లాట పెట్టారు. బరిలో బస్తీ మే సవాల్ అని తొడలు కొడుతున్నారు. పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా పట్టపగలే కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ బైపాస్ రోడ్డులో బరులు ఏర్పాటు చేసి కోడి పందాలు నిర్వహిస్తున్నారు. వేలల్లో డబ్బులు చేతులు మారుతున్నాయి. కోళ్ల పందాలపై సమాచారం అందుకున్న గుడివాడ రూరల్ పోలీసులు బరులపై దాడులు చేశారు. పోలీసులను …

Read More »