Recent Posts

SDRF: తెలంగాణలో సిద్ధమైన సరికొత్త దళం.. విపత్తు సమయాల్లో ఇక క్షణాల్లో సాయం..!

తెలంగాణలో బలమైన సైన్యం రెడీ అయింది. విపత్తులు సంభవించినప్పుడు కేంద్రంపై ఆధారపడకుండా ఉండేందుకు కొత్త దళాన్ని సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అత్యవసరంగా రక్షణ చర్యలు చేపట్టే లక్ష్యంతో 2000 మందికి వేర్వేరు రాష్ట్రాల్లో శిక్షణ ఇప్పించి మెరికాల్లా మారింది. తెలంగాణలో సరికొత్త దళం సిద్ధమైంది. జాతీయ విపత్తు స్పందన దళం తరహాలో తెలంగాణ విపత్తు స్పందన దళం సిద్ధమైంది. భారీ అగ్ని ప్రమాదాలు, వరదలు, భూకంపం వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసర సహాయ చర్యలు చేపట్టడానికి ఈ దళం సిద్ధమవుతోంది. తెలంగాణ అగ్నిమాపక …

Read More »

‘పీఎం-కిసాన్’ స్కీమ్.. అనర్హుల నుంచి రూ.335 కోట్ల రికవరీ చేసిన కేంద్రం

పీఎం-కిసాన్ కార్యక్రమం కింద నగదు ప్రయోజనాలను పొందిన అనర్హుల నుండి రూ. 335 కోట్లను రికవరీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. PM-కిసాన్ కింద, అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ. 6,000 చొప్పున మద్దతును అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి చొప్పున మూడు సమాన నగదు బదిలీలలో రూ.2,000 చెల్లిస్తోంది. మొదటి వాయిదా చెల్లింపును ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించింది నరేంద్ర మోదీ సర్కార్. రైతులకు ఆర్థికంగా మద్దతిచ్చేందుకు 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీ ప్రభుత్వం. …

Read More »

ఇలా తయారు అయ్యారేంట్రా బాబూ..! సినిమా సీన్ తలపించే ఛేజింగ్.. చివరికి ఇలా !

ఓ వ్యక్తి ఆసుపత్రి వద్ద కాలికి గాయంతో ఉన్నాడు. అయితే ఆ ఆ వ్యక్తి తన ఊరికి వెళ్లాలనుకున్నాడు. అక్కడే ఉన్న ఓ అంబులెన్స్ వేసుకుని వెళ్లాడు. కానీ అనుకున్నట్టుగా అతను ఇంటికి చేరుకోలేదు. అంబులెన్స్‌తో పారిపోతున్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు సినిమా స్టైల్ చేజ్ చేయాల్సి వచ్చింది. సీన్ కట్ చేస్తే అంబులెన్స్‌తో కల్వర్టుకు ఢీ కొట్టి ప్రమాదానికి గురైయ్యాడు. అసలేం జరిగింది అంటే..? హయత్‌నగర్‌లో 108 వాహనాన్ని ఎత్తుకెళ్లాడో దొంగ. అంబులెన్స్‌తో విజయవాడ పరారయ్యేందుకు యత్నించాడు. ఇక్కడి వరకు బాగానే ఉంది. …

Read More »