Recent Posts

కేంద్రమంత్రులైనా ఎంపీలని మర్చిపోకండి.. తప్పించుకోవద్దు: చంద్రబాబు సీరియస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్ స్టేషన్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ఏపీ ట్రాన్స్ కో పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వర్చువల్‌ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శ్రీకాకుళం, కృష్ణా, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ …

Read More »

భార్య ముందు అంకుల్ అన్నాడని.. బట్టల షాపు ఓనర్‌ను చితగ్గొట్టిన యువకుడు!

భార్యతో కలిసి ఓ బట్టల దుకాణానికి వెళ్లిన వ్యక్తిని.. షాప్ ఓనర్ అంకుల్ అని పిలవడంతో అతడి ఇగో దెబ్బతింది. దుకాణదారుడితో గొడవపడిన అతడ్ని.. భార్య సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. కానీ, ఆ వ్యక్తి మాత్రం దానిని జీర్ణించుకోలేక.. అంతటితో వదిలిపెట్టలేదు. కాసేపటికే తన స్నేహితులను వెంటేసుకుని వచ్చి ఆ షాప్ ఓనర్‌ను చితగ్గొట్టాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తుగొలిపే ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ప్రస్తుతం …

Read More »

ఇంటిని కూల్చేసిన అధికారులు.. రూ.25 లక్షలు జరిమానా వేసిన సుప్రీంకోర్టు

ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆక్రమణల పేరుతో ఇళ్లు కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రికిరాత్రే బుల్డోజర్లు పంపి అక్రమ నిర్మాణాల పేరుతో నివాసాలు కూల్చివేయజాలదని స్పష్టం చేసింది. కేవలం 3.7 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించారనే సాకుతో ఇంటిని కూల్చి వేసినందుకు బాధితుడికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని యోగి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు బాధ్యులైన అధికారులపై విచారణ చేపట్టాలని సూచించింది. ఈ క్రమంలో రహదారి విస్తరణ సమయంలో ఎలా …

Read More »