amaravatinews
November 16, 2024 తెలంగాణ
128
హైదరాబాద్ పుప్పాల్‌గూడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోల్డెన్ ఓరియో అపార్ట్‌మెంట్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటంతో మంటలు వ్యాపించాయి. మంటలు వ్యాపించగానే ఇంట్లోని ఐదుగురు కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. అపార్ట్‌మెంట్ వాసులు సైతం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో అపార్ట్‌మెంట్ ప్లాట్ పూర్తిగా దగ్ధం అయింది. ఇంట్లో దాచుకున్న డబ్బులు, బట్టలు, విలువైన సామాగ్రి కాలి బూడిదైంది. దాదాపు 50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు …
Read More »
amaravatinews
November 16, 2024 అంతర్జాతీయం
119
Canada: రోజురోజుకూ కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు చేస్తూ నిత్యం ఏదో ఒక చోట నానా హంగామా సృష్టిస్తున్న ఖలిస్థానీలు.. తాజాగా తెల్లజాతివారిపై పడ్డారు. తాజాగా కెనడాలోని శ్వేత జాతీయులను దురాక్రమణదారులుగా అభివర్ణించారు. అసలైనా కెనడా తమదేనని.. తెల్లజాతివారే ఇతర దేశాల నుంచి కెనడాకు అక్రమంగా వచ్చి నివసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్వేతజాతీయులు అంతా యూరప్‌కు తిరిగి వెళ్లాలని సూచిస్తున్నారు. తాజాగా ఓ ఖలిస్థానీ మద్దతుదారుడు విడుదల చేసిన ఓ వీడియోలో.. కెనడాకు యజమానులం తామేనని …
Read More »
amaravatinews
November 16, 2024 ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం
145
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సింహాచలం ఆలయానికి ఊరట దక్కింది. గత పదిహేనేళ్లుగా ఆక్రమణదారుల చేతుల్లో చిక్కుకొని న్యాయవివాదంలో ఉండిపోయిన సింహాచలం దేవస్థానానికి చెందిన భూములు హైకోర్టు తీర్పుతో తిరిగి దక్కాయి. ఈ భూముల విలువ ఏకంగా సుమారు రూ.650 కోట్లని చెబుతున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సింహాచలం ఆలయ అధికారులకు ఈ భూములకు సంబంధించిన డాక్యుమెంట్లను అందజేశారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం గంగసాని అగ్రహారంలో సింహాచలం దేవస్థానం అనుబంధంగా కాశీవిశ్వేశ్వరస్వామి కోవెల ఉంది. ఈ ఆలయానికి సర్వే నంబర్లు 3/1, 3/4లలో 99.20 …
Read More »
amaravatinews
November 16, 2024 జాతీయం
142
ఉత్తర ప్రదేశ్‌లో తీవ్ర విషాద ఘటన జరిగింది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం జరిగింది.. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో పది మంది శిశువులు సజీవదహనం అయ్యారు. ఒక్కసారిగా మంటల వ్యాప్తితో రోగులు, ఆసుపత్రి సిబ్బంది ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. దీంతో ఆస్పత్రిలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.. వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే మెడికల్ కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. మెడికల్ కాలేజీలో …
Read More »
amaravatinews
November 16, 2024 ఆంధ్రప్రదేశ్
153
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలానికి చెందిన టీడీపీ అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్ (మహాసేన రాజేష్)పై కేసు నమోదైంది. ఆయన అనుచరులు రంజిత్‌మెహర్ (రాజోలు), యెల్లమిల్లి పండు (తూర్పుపాలెం), బోడపాటి చక్రి (తుని), వీరవల్లి ఏసుబాబు (భీమవరం), పృథ్వీరాజ్‌లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో తనపై జనవరి, ఫిబ్రవరిల్లో అనుచిత పోస్టులు చేశారని శంకరగుప్తంకు చెందిన నేతల శాంతి ఈ నెల 12న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఈ కేసు నమోదు …
Read More »
amaravatinews
November 16, 2024 ఆంధ్రప్రదేశ్
138
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి కీలకమైన చట్టం తీసుకురానుంది. ప్రతి ఏటా మే 31నాటికి ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకొని బదిలీల ప్రక్రియ ఉంటుంది. బదిలీల తర్వాత జూన్ 1న స్కూళ్లలో చేరేలా ఉత్తర్వులు ఇస్తారు. బదిలీలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా ఐదేళ్లు, ఉపాధ్యాయులకు కనీసం రెండేళ్లు, గరిష్ఠంగా 8ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకుంటారు. హెచ్‌ఆర్‌ఏ 16% ఉన్న వాటిని కేటగిరి-ఏ, 12% వాటిని కేటగిరి-బీ, 10% ఉంటే కేటగిరి-సి, 5వేల కంటే తక్కువ …
Read More »
amaravatinews
November 15, 2024 ఆంధ్రప్రదేశ్, తిరుపతి
162
తిరుమల శ్రీవారికి ఇద్దరు భక్తులు భారీ విరాళాలను అందించారు. బెంగళూరుకు చెందిన బీఎంకే నగేష్ అనే భక్తుడు టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత నగేష్ స్వయంగా డీడీని టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అందజేశారు. మరోవైపు తిరుమల శ్రీవారికి హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు ఎలక్ట్రిక్ బైకుల్ని కానుకగా అందజేశారు. హైదరాబాద్ పెరల్ మినిరల్స్ అండ్ మైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ సీ వెంకట నాగరాజ 15 …
Read More »
amaravatinews
November 15, 2024 జాతీయం
145
Ayyappa: కేరళలోని పథనంతిట్ట జిల్లాలో కొలువైన శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. 2 నెలల పాటు సాగే మండల మకరవిళక్కు పూజల కోసం నవంబర్ 15 (శుక్రవారం) సాయంత్రం 4 గంటలకు ఆలయ ద్వారాలను శబరిమల అర్చకులు తెరిచారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉదయం నుంచే మండల మకరవిళక్కు పూజల కోసం.. అయ్యప్ప భక్తులు శబరిగిరులకు పోటెత్తారు. ఇక గతేడాది అయ్యప్ప దర్శనాల సందర్భంగా నెలకొన్న భక్తుల రద్దీ నేపథ్యంలో.. ఈసారి కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఇప్పటికే అన్ని …
Read More »
amaravatinews
November 15, 2024 ఆంధ్రప్రదేశ్, జాతీయం
143
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మరో శుభవార్త వినిపించింది. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ రూ.85 వేలకోట్లు పెట్టుబడులు పెట్టనుంది. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టుకు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల(నవంబర్)లోనే శంకుస్థాపన చేయనున్నారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. నవంబర్ 29వ తేదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఇది పూర్తి అయితే భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఫెసిలిటీగా నిలుస్తుంది. …
Read More »
amaravatinews
November 15, 2024 క్రికెట్, క్రీడలు
151
ఛాంపియన్స్ ట్రోఫీ- 2025కు సంబంధించి సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సాధారణంగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభం కావాల్సింది. షెడ్యూల్ కూడా విడుదల కావాల్సింది. అయితే.. ఒక్క కారణంతో ఆలస్యం కొనసాగుతూనే ఉంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు తాము వెళ్లబోమని.. ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు (ICC) స్పష్టం చేసింది. ఇదే విషయం గురించి.. ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు చెప్పి.. హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించాలని …
Read More »