Recent Posts

భార్యతో కలిసి సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్.. ఫొటో వైరల్

అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టి ప్రజల్లోకి వెళ్లిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్(YS Jagan) ఇప్పుడు తాను సామాన్యమైన వ్యక్తినని కవరింగ్ ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ ఆయన భార్య భారతి కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైసీపీ అధినేత సాధారణ వ్యక్తిలా విమానంలో భార్యతో కలిసి ప్రయాణించారు. గతంలో సీఎంగా ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన ఆయన ప్రస్తుతం సామాన్యుడిలా సాధారణ విమానాల్లో ఎకానమీ క్లాసులో ప్రయాణిస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ …

Read More »

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియమాకం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామాకాలపై తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. ఈ ఎమ్మెల్సీల నియమాకాల విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా కూడా స్టే విధించాలన్న పిటిషనర్ అభ్యర్ధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కొత్త ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంటే… గవర్నర్‌, ప్రభుత్వ హక్కులను హరించినట్లే అవుతుందని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ప్రసన్న బాలచంద్రల ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎప్పటికప్పుడు నియామకాల చేపట్టడం ప్రభుత్వ విధి …

Read More »

కశ్మీర్‌లో ముష్కర మూకల కోసం వేట.. ఆర్మీ కెప్టెన్ వీరమరణం

జమ్మూ కశ్మీర్‌లో ముష్కర మూకల కోసం గాలిస్తుండగా.. ఓ సైనికాధికారి అమరుడయ్యాడు. దోడా జిల్లాలో బుధవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. అస్సార్ అలీ ప్రాంతంలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఓ ఆర్మీ కెప్టెన్‌ వీరమరణం పొందాడు. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతుంది. శివ్‌గఢ్-అస్సార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్టు సమాచారం రావడంతో జమ్మూ కశ్మీర్ పోలీసులు, సైన్యం సంయుక్తంగా …

Read More »