Recent Posts

రైల్వేశాఖ మరో జాబ్ నోటిఫికేషన్‌ విడుదల.. 1376 ఉద్యోగాల భర్తీకి ప్రకటన

 రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB).. మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://indianrailways.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. భర్తీ చేసే ఆర్‌ఆర్‌బీ రీజియన్లు ఇవే : అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పూర్, …

Read More »

రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2.74లక్షల మంది రైతులకు బీమా..!

రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు బీమా పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎల్‌ఐసీ కింద ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది ప్రీమియం ఎంత చెల్లించాలనేది త్వరలో ఖరారు కానుంది. రైతు బీమా పథకం ద్వారా రైతులు సహజంగా, లేదా ఏ విధంగానైనా మరణిస్తే, సదరు రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల …

Read More »

మంటల్లో జపోరిజియా అణువిద్యుత్ ప్లాంట్‌.. అంతర్జాతీయ సమాజం ఆందోళన

ఐరోపాలో అతిపెద్ద అణువిద్యుత్తు కర్మాగారంలో మంటలు చెలరేగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన‌ జపోరిజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌ ప్రస్తుతం రష్యా నియంత్రణలో ఉంది. దీనిపై రష్యా, ఉక్రెయిన్‌లు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. రష్యా సైన్యమే ఈ పేలుళ్లకు పాల్పడినట్టు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. కీవ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేయడానికి ఈ చర్యకు తెగబడ్డారని ఆయన మండిపడ్డారు. అటు, ఉక్రెయిన్‌ దళాలు ప్రయోగించిన శతఘ్నుల వల్లే మంటలు వ్యాపించాయని మాస్కో ప్రత్యారోపణలు చేసింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో ఈ …

Read More »