Recent Posts

తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ రోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, ఆ సేవ కూడా!

తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. అక్టోబర్ 1న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. అక్టోబరు 4 నుంచి 12 వరకు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా తిరుమల ఆలయంలో మంగళవారం (అక్టోబరు 1) రోజున ఆలయ శుద్ధి నిర్వహిస్తున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా.. అక్టోబర్ 1న వీఐపీ బ్రేక్ దర్శనాన్ని (ప్రోటోకాల్ వీఐపీలు మినహా) టీటీడీ రద్దు చేసింది. కాబట్టి సెప్టెంబర్ 30న ఎటువంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. భక్తులు దీనిని గమనించి నిర్వాహకులకు సహకరించాలని …

Read More »

లడ్డూ పెట్టిన మంట.. టీ-బీజేపీ వర్సెస్ వైసీపీ!

ఏపీలో మొదలైన తిరుపతి లడ్డూ వ్యవహారం క్రమంగా పక్క రాష్ట్రానికి కూడా పాకుతోంది. ఇప్పటి వరకూ వైసీపీ వర్సెస్ టీడీపీ కూటమిగా ఉన్న వ్యవహారం క్రమంగా తెలంగాణ బీజేపీ వర్సెస్ వైసీపీగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే వార్తల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో తిరుమల అపవిత్రమైందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నేత మాధవీలత ఇటీవల తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లారు. రైళ్లో భజన చేసుకుంటూ మాధవీలత తిరుమలకు వెళ్లారు. …

Read More »

పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్యకుమార్

ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ధర్మవరంలోని ఎన్డీఏ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన మంత్రి.. వారి కాళ్లు కడిగారు. అనంతరం వారికి దుస్తులు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుల కోసం స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు విరాళాలు వేసుకుని దుస్తులను సమకూర్చారు. వీటిని మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి పంపిణీ చేశారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్​కల సాకారం కావడంలో …

Read More »