amaravatinews

ఆ వీడియో చూసి సీఎం చంద్రబాబు ఎమోషనల్.. పోలీసులపై ప్రశంసలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ వీడియోను చూసి ఎమోషనల్ అయ్యారు. ఆ వీడియో తనను ఎంతో కదిలించింది అంటూ ట్వీట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీసులు చోరీ అయిన 251 బైక్‌లను స్వాధీనం చేసుకొని, 25 మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.. పోలీసుల్ని అభినందించారు. అయితే నీలి అలివేణి మహిళలకు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు అప్పగిస్తున్నప్పుడు.. ఆమె భావోద్వేగం తనను కదిలించిందన్నారు చంద్రబాబు. ప్రతి రోజూ జీవితంలో బైక్ ఆవశ్యకతను ఈ ఘటన తెలియజేస్తుంది అన్నారు. …

Read More »

ఏపీలోని ఆ ఆలయంలో ఇకపై పెళ్లిళ్లు చేసుకోవడానికి అనుమతి లేదు.. టీటీడీ కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో రాములోరు కొలువైన ఒంటిమిట్ట కోదండ రామాలయానికి సంబంధించి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇకపై ఒంటిమిట్ట రామాలయంలో వివాహాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వొద్దని.. పెళ్లిలు జరగనీయకుండా ఆపేయాలని భారత పురాతత్త్వ-సర్వేక్షణశాఖ అధికారులు మౌఖిక ఆంక్షలు విధించారు. ఈ మేరకు టీటీడీ శుపరిపాలన యంత్రాంగానికి మొబైల్‌లో కాల్ చేసి ఆదేశించారు. పెళ్లిళ్లకు అనుమతులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంతో భక్తులు అవాక్కయ్యారు. ఈ నిర్ణయం సరికాదని.. వెంటనే వెనక్కు తీసుకోవాలంటున్నారు. ఇది వాస్తవమేనని.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్‌. ఒంటిమిట్ట కోదండ …

Read More »

సమగ్ర కుటుంబ సర్వే.. వివరాల నమోదుకు సొంతూరు వెళ్లాలా..? అధికారుల క్లారిటీ

తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 6న సర్వే ప్రారంభం కాగా.. ఈనెల 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈనెల 6 నుంచి 8 వరకు ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు చేసి స్టిక్కరింగ్ వేశారు. తెలంగాణలో మొత్తం 1,17,44,954 కుటుంబాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. అందుకు అనుగుణంగా 87,092 ఎన్యూమరేషన్‌ బ్లాక్‌లుగా విభజించి వారికి సర్వే బాధ్యతలు అప్పగించారు. ఒక్కో ఎన్యూమరేటర్ …

Read More »

కోటి దీపోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు.. ఈసారి ప్రత్యేకతలు, వివరాలివే..

ఏటా కార్తీకమాసంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరిగే కోటి దీపోత్సవానికి ప్రత్యేక గుర్తింపు, ఆదరణ ఉంది. ఎన్టీవీ – భక్తి టీవీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా భక్తులకు ఆధ్యాత్మిక వైభవం అందించేందుకు కోటి దీపోత్సవ జాతర సిద్ధమైంది. నవంబర్ 9 నుంచి 25 వరకు 17 రోజుల పాటు జరుగనున్న కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. శివ, కేశవుల థీమ్‌తో భారీ సెట్టింగ్ వేశారు. వేదికను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈసారి …

Read More »

ఆ రాశి నిరుద్యోగులకు ఆఫర్లు.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 9, 2024): మేష రాశి వారికి ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి శుభవార్త వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. మంచి పరిచయాలు …

Read More »

శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త.. జనవరి నుంచి ఆ ఇబ్బందులు తప్పినట్టే!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నిత్యం వేలాదిమంది భక్తులు ఎక్కడికెక్కడి నుంచో తరలివస్తుంటారు. సుదూరం నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి.. ఆ దేవదేవుడి దర్శనం కోసం వస్తుంటారు. అలా వచ్చే వారి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉంటుంది. యాత్రికుల వసతి, భోజనం, దర్శనం విషయాల్లో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వస్తోంది. శ్రీవారి దర్శనానికి రోజురోజుకూ యాత్రికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. తిరుమల శ్రీవారి భక్తుల వసతి కోసం నూతన సముదాయాన్ని టీటీడీ నిర్మిస్తోంది. …

Read More »

మాజీ మంత్రి విడదల రజిని కోరిక నెరవేరిందిగా.. వైఎస్ జగన్ కీలక నిర్ణయం, ప్రమోషన్!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్సార్‌సీపీ రూట్ మార్చింది. పార్టీలో అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టారు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు కొత్త అధ్యక్షుల్ని నియమించారు. అంతేకాదు పార్టీ అనుబంధ విభాగాలకు కూడా అధ్యక్షుల్ని నియమించారు. అంతేకాదు ఆయా జిల్లాల్లో నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లను కూడా మారుస్తున్నారు. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను మార్చేశారు. మాజీ మంత్రి విడదల రజినికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాడికొండ, చిలకలూరిపేట నియోజకవర్గాలకు వైఎస్సార్‌సీపీ కొత్త సమన్వయకర్తలను నియమించింది. తాడికొండలో …

Read More »

ఏపీలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులకు శుభవార్త.. డిసెంబర్‌లో పక్కా, రెడీగా ఉండండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేయనుంది. ఈ నెల 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా.. 184 మంది రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేస్తారు. సెప్టెంబర్‌లో నిర్వహించాలని భావించినా.. వరదల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది. పాఠశాల, ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, డిగ్రీ, విశ్వవిద్యాలయాలు, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ అద్యాపకులకు ఉత్తమ అవార్డులు ప్రదానం చేయనున్నారు. విజయవాడలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. మరోవైపు నారా లోకేష్ …

Read More »

హైదరాబాద్‌లో కొత్త రైల్వేస్టేషన్.. త్వరలోనే ప్రారంభం.. ఇక్కడి నుంచి నడిచే రైళ్ల జాబితా ఇదే..!?

హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అదిపెద్ద రైల్వేస్టేషన్ నిర్మాణం పూర్తికావొచ్చింది. సుమారు 100 ఏళ్ల తర్వాత నగరంలో అతి పెద్ద రైల్వేస్టేషన్‌గా చర్లపల్లి రైల్వే స్టేషన్ అవతరిస్తోంది. హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే ఉన్న.. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లకు రోజురోజుకు ప్రయాణికుల రద్దీ పెరగటంతో పాటు.. వాళ్ల సౌకర్యార్థం నడుపుతున్న రైళ్ల రాకపోకలు కూడా పెరుగుతుండటంతో.. ఆ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధి చేస్తోంది. సుమారు రూ.430 కోట్ల వ్యయంతో విమానాశ్రయాన్ని తలపించేలా సకల …

Read More »

ఏపీలో రైతులకు శుభవార్త.. రూ.19,000 ఫిక్స్, కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పామాయిల్‌ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. పామాయిల్ రైతులు, కంపెనీల యాజమాన్యాలు, ఆయిల్‌ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.. ప్రధానంగా ఆయిల్‌పామ్‌ సాగు విస్తరణపై చర్చించారు. పామాయిల్‌ ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తామన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పామాయిల్ రైతులకు ఊరట లభించింది అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలలకే టన్ను ధర రూ.12,500 నుంచి ఏకంగా రూ.19,000కి ధర పెరిగింది …

Read More »