Telangana UPSC Aspirants: తెలంగాణలో సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుభవార్త వినిపించారు. సివిల్స్ మెయిన్స్ పరీక్షకు ఎంపికైన ప్రతి ఒక్క అభ్యర్థికి లక్ష రూపాయల నగదు సాయం అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్‌లో ఏర్పాటు చేసిన సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భట్టి విక్రమార్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క.. ఎన్నికల ముందు ప్రకటించినట్టుగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను కచ్చితంగా భర్తీ …
Read More »ఏపీలో మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. పెద్ద కష్టమే వచ్చింది
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీ అమలవుతోంది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులకు లాటరీ నిర్వహించి అప్పగించారు. ఆ వెంటనే అమ్మకాలు మొదలయ్యాయి..రూ.99కే క్వార్టర్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఏడాది అక్టోబరు 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకూ కొత్త మద్యం విధానం అమల్లో ఉంటుంది. అయితే మందుబాబులకు ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చి పడింది. రాష్ట్రంలోని మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్ల మద్యం, బీర్లకు తీవ్రంగా కొరత ఉందని చెబుతున్నారు. వ్యాపారులు ఆర్డర్లు పెడుతున్నా ఆయా బ్రాండ్ల మద్యం తగినంత …
Read More »Green Card: అమెరికాలోని భారతీయులకు షాకివ్వనున్న ట్రంప్.. 10 లక్షల మందికి గ్రీన్ కార్డులు లేనట్లే
Green Card: మొదటి నుంచి అమెరికా ఫస్ట్ నినాదంతో ముందుకు వెళ్తున్న డొనాల్డ్ ట్రంప్.. ఈసారి కూడా అదే మంత్రం పఠిస్తున్నారు. అమెరికాలోని ఉద్యోగ ఉపాధి అవకాశాలు.. అమెరికన్లకే చెందాలి అనేది ట్రంప్ వాదన. ఈ క్రమంలోనే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన ట్రంప్.. ఇతర దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడిన గ్రీన్ కార్డు హోల్డర్లపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. గ్రీన్ కార్డు నిబంధనలు మార్చేందుకు ట్రంప్ యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న …
Read More »కేంద్రమంత్రులైనా ఎంపీలని మర్చిపోకండి.. తప్పించుకోవద్దు: చంద్రబాబు సీరియస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాళ్లాయపాలెంలో రూ.505 కోట్లతో నిర్మించిన 400/220 కేవీ గ్యాస్ ఇన్సులేటెడ్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో రూ.702 కోట్లతో నిర్మించిన 5 సబ్ స్టేషన్లను కూడా వర్చువల్ గా ప్రారంభించారు. రూ.4,665 కోట్లతో చేపట్టనున్న 14 ఏపీ ట్రాన్స్ కో పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం, కృష్ణా, నంద్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ …
Read More »భార్య ముందు అంకుల్ అన్నాడని.. బట్టల షాపు ఓనర్‌ను చితగ్గొట్టిన యువకుడు!
భార్యతో కలిసి ఓ బట్టల దుకాణానికి వెళ్లిన వ్యక్తిని.. షాప్ ఓనర్ అంకుల్ అని పిలవడంతో అతడి ఇగో దెబ్బతింది. దుకాణదారుడితో గొడవపడిన అతడ్ని.. భార్య సర్దిచెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లింది. కానీ, ఆ వ్యక్తి మాత్రం దానిని జీర్ణించుకోలేక.. అంతటితో వదిలిపెట్టలేదు. కాసేపటికే తన స్నేహితులను వెంటేసుకుని వచ్చి ఆ షాప్ ఓనర్‌ను చితగ్గొట్టాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విస్తుగొలిపే ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో ప్రస్తుతం …
Read More »ఇంటిని కూల్చేసిన అధికారులు.. రూ.25 లక్షలు జరిమానా వేసిన సుప్రీంకోర్టు
ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆక్రమణల పేరుతో ఇళ్లు కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రికిరాత్రే బుల్డోజర్లు పంపి అక్రమ నిర్మాణాల పేరుతో నివాసాలు కూల్చివేయజాలదని స్పష్టం చేసింది. కేవలం 3.7 చదరపు మీటర్ల స్థలాన్ని ఆక్రమించారనే సాకుతో ఇంటిని కూల్చి వేసినందుకు బాధితుడికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని యోగి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు బాధ్యులైన అధికారులపై విచారణ చేపట్టాలని సూచించింది. ఈ క్రమంలో రహదారి విస్తరణ సమయంలో ఎలా …
Read More »అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. భారత్‌కు లాభాలేంటి? నష్టాలేంటి..?
India US Relations: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో ప్రపంచ దేశాలు.. అమెరికా కొత్త అధ్యక్షుడి హయాంలో ఆ దేశంతో సంబంధాలు ఎలా ఉంటాయి అనేది లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే.. ట్రంప్ 2.0 హయాంలో భారత్-అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం తీవ్ర ఆసక్తికరంగా మారింది. వాణిజ్యం, దౌత్యపరమైన సంబంధాలు, వలసలు, సైనిక సహకారం వంటి అంశాల్లో భారత్-అమెరికా మధ్య …
Read More »ఏపీలో వారికి అదిరే శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.లక్షల నుంచి రూ.3లక్షలు, మంచి ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ కార్పొరేషన్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. 2014-19 మధ్య టీడీపీ హయాంలో కార్పొరేషన్ ద్వారా అమలు చేసిన పథకాలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ఈ పథకాల్లో తొలి పథకంగా.. జీవనోపాధి కల్పనకు రూ.50 వేల రాయితీతో రుణాల మంజూరుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం అజయ్‌ని అనుసంధానించి సెర్ప్ ద్వారా అమలుకు శ్రీకారం చుట్టింది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 1,732 మంది ఎస్సీ లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశాలు జారీ చేశారు. …
Read More »ఏపీలో స్కూల్ విద్యార్థులకు బంపరాఫర్.. ఉచితంగా కిట్లు, డబ్బులు కూడా ఇస్తారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరంలో.. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పథకం కింద కిట్లు అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేయగా.. ఈ పథకం కింద కిట్లు అందించేందుకు రూ. 953.71 కోట్ల వ్యయంకానుంది. ఈ నిధుల్లో కేంద్రం రూ. 175.03 కోట్లు.. రాష్ట్రం రూ. 778.68 కోట్లు కేటాయించనుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదివే …
Read More »‘హలో మిస్టర్ ప్రెసిడెంట్.. ఆ హామీ నేరవేరుస్తారని ఆశిస్తున్నా’: ట్రంప్‌పై భారతీయ చెఫ్ పోస్ట్ వైరల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ అద్బుత విజయాన్ని అందుకున్నారు. దీంతో అమెరికాకు 47వ అధ్యక్షుడిగా రెండోసారి ఆయన శ్వేతసౌధంలోకి అడుగుపెట్టనున్నారు. ట్రంప్ విజయంపై ప్రపంచ దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఆయనకు శుభాకాంక్షలు తెలిపి.. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం, ప్రపంచ స్థిరత్వం, శాంతికి కలిసి పనిచేద్దామని సూచించారు. కాగా, ట్రంప్‌నకు అభినందనలు తెలుపుతూ.. భారతీయ చెఫ్ వికాస్ ఖన్నా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal