ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో వాడీవేడి చర్చ జరిగింది.. కూటమి ప్రభుత్వంలో ముఖ్య నేతలు, వారి ఇళ్లలో మహిళలపై కొందరు సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెడుతున్న తీరు ప్రస్తావను వచ్చింది. సోషల్ మీడియాలో పోస్టులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.. కొంతమంది ఉద్దేశపూర్వకంగా మళ్లీ మళ్లీ పోస్టులు పెడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్లనూ వదిలిపెట్టకుండా అసభ్యకరంగా పోస్టులు పెట్టడంపై ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కొందరు పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొంతమంది పోలీసుల …
Read More »ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. అకౌంట్‌లలో డబ్బుల జమ, కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీల బ్యాంకు అకౌంట్‌లకు నేరుగా బదిలీ చేసే పాత విధానాన్ని పునరుద్ధరిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.‘చాలామంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన అంశాలపై నన్ను ట్యాగ్ చేసి స్పందించమని అడిగారు. విద్యార్థులు ప్రస్తావించిన అంశాలను నేను నోట్ చేసుకున్నాను. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన రూ.3,500 కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తాం. అలాగే సర్టిఫికెట్లు, ఇతర అవసరమైన పత్రాల జారీలో విద్యార్థుల సమస్యలు …
Read More »US Elections: ట్రంప్, కమలా ఎవరు గెలిచినా.. అమెరికా ఎన్నికల ఫలితాలపై జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు
US Elections: అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎక్కేది ఎవరు అనేది ప్రస్తుతం ప్రపంచ దేశాలను ఆసక్తిగా తిలకించేలా చేస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడి స్థానంలో ఎవరు ఉంటే తమకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనేది ప్రపంచ దేశాలు బేరీజు వేసుకుంటూ ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో ఎవరు ఉంటే తమ దేశంతో సంబంధాలు ఎలా ఉంటాయి అని అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్.. వీళ్లిద్దరిలో ఎవరు గెలిచినా …
Read More »స్టాక్ మార్కెట్లలో ‘ట్రంప్’ జోష్.. 80వేల పైకి సెన్సెక్స్.. ఐటీ కంపెనీలకు భారీ లాభాలు!
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ మళ్లీ 80 వేల మార్క్ దాటింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖరారైంది. ఈ క్రమంలో సూచీలు పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ సుమారు 700 పాయింట్ల మేర లాభపడింది. ఇక నిఫ్టీ 50 ఇండెక్స్ 24,400 మార్క్ దాటి ట్రేడింగ్ అవుతోంది. అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ట్రంప్ విజయం ఖరారైన క్రమంలో ప్రధానంగా దేశీయ ఐటీ కంపెనీల్లో జోష్ కనిపిస్తోంది. ఐటీ కంపెనీల షేర్లు కొనుగోలు …
Read More »ఏపీలో కొత్త పింఛన్‌ల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి.. ఆ నెల నుంచే డబ్బులు ఇస్తారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరుకు సంబంధించి కసరత్తు చేస్తోంది. జనవరిలో కొత్త పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.. జనవరిలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఆ సభల్లో కొత్త లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ హయాంలో అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది తప్పుడు డాక్యుమెంట్లతో పింఛన్లు పొందినట్లు విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా దివ్యాంగుల కేటగిరీలో కొన్ని వేల మంది …
Read More »TG Schools: నేటి నుంచి ఒంటి పూట బడులు.. ఎప్పటి వరకంటే..?
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు తీపి కబురు. నేటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఒంటి పూట బడులు నిర్వహించనున్నారు. అయితే ఈ ఒంటిపూట బడులు అన్ని స్కూళ్లకు కాదు. ప్రైమరీ స్కూళ్లు మాత్రమే సగం పూట నడవనున్నాయి. ప్రైమరీ స్కూళ్లను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నడపనున్నారు. తెలంగాణలో నేటి నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరగనుంది. నవంబర్ 6 నుంచి 30 వరకు …
Read More »తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్.. రంగంలోకి సీబీఐ సిట్, టీమ్‌లో నలుగురు సభ్యుల వివరాలివే
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై బిగ్ అప్డేట్ వచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన సీబీఐ నేతృత్వంలోని సిట్ విచారణ ప్రారంభించింది. ఈ సిట్‌లో సభ్యులుగా సీబీఐ నుంచి ఎస్వీ వీరేష్ ప్రభు (హైదరాబాద్‌లో ఏజెన్సీ జాయింట్ డైరెక్టర్), మురళీ రంభ (విశాఖపట్నంలోని సీబీఐ ఎస్పీ)లను నియమించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ్ త్రిపాఠి, గోపీనాథ్ జెట్టి (డీఐజీ, విశాఖపట్నం రేంజ్)లను సిట్ సభ్యులుగా నియమించింది. అయితే ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ నుంచి సభ్యుడిని ప్రకటించాల్సి ఉంది. సీబీఐ …
Read More »US Elections Result LIVE Counting: కమలా, ట్రంప్ మధ్య తగ్గుతోన్న ఆధిక్యం.. ఫలితాలపై ఉత్కంఠ
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా.. ఫలితాలు వెలువడుతున్నాయి. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన డొనాల్డ్ ట్రంప్.. కమలా హ్యారిస్ కంటే 100 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు లీడ్‌లో ఉన్నారు. కానీ, క్రమంగా పుంజుకున్న డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హ్యారిస్.. 200 మార్క్ దాటారు. దీంతో ఇరువురి మధ్య ప్రస్తుతం కేవలం 20 ఓట్ల తేడా మాత్రమే ఉంది. అయితే, స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్ ఆధిక్యంలో ఉండటంతో ఆయనకు గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. 24 రాష్ట్రాల్లో గెలిచి.. మరో ఐదు రాష్ట్రాల్లో …
Read More »Cyber Crime: రూ.1.22 కోట్లు పోగొట్టుకున్న ప్రైవేటు ఉద్యోగి.. నిమిషాల్లోనే రికవరీ చేసిన పోలీసులు
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. రకరకాల పద్దతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను టార్గెట్‌గా చేసుకొని చాలా ఈజీగా దోచేస్తున్నారు. సామాన్యుల అత్యాశను పెట్టుబడిగా చేసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. మెున్నటి వరకు ఈ కేవైసీ, గిఫ్ట్ కార్డులు, లక్కీ డ్రాలు, డ్రగ్స్ పార్సిల్స్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. ఇటీవల కాలంలో చాలా మంది యువత, ఉద్యోగులు ట్రేడింగ్ వైపు మెుగ్గు చూపుతుండటంతో అటుగా వారి ఫోకస్ పడింది. ఆన్‌లైన్ ట్రేడింగ్ పాఠాలు, చిట్కాలు, పెట్టుబడులు అంటూ చాలా ఈజీగా మోసాలు చేస్తున్నారు. …
Read More »కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేత.. చంద్రబాబు కండిషన్స్‌కు ఓకే చెప్పి, ఆ లేఖ పంపి మరీ!
చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ వైఎస్సార్‌సీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేశారు. తన ఛైర్మన్ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్‌కు పంపారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో డాక్టర్ సుధీర్ తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని.. ఆయన వెంట కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా …
Read More »
Amaravati News Navyandhra First Digital News Portal