దసరా నుంచి పాఠశాలలకు సెలవుల సీజన్ స్టార్ట్ అయినట్లే భావిస్తారు పిల్లలు. అక్టోబర్ తర్వాత నవంబర్ అంతా బడికి వెళ్లిన స్టూడెంట్స్ కు డిసెంబర్ మళ్లీ సెలవుల సంతోషాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. డిసెంబర్ నెలలో దాదాపు 9 రోజులు హాలీడేస్ వస్తున్నాయి. అందులో 7 పక్కా కాగా.. రెండు మాత్రం కొన్ని స్కూల్స్ వాటి ప్రాధాన్యతను బట్టి ఇచ్చుకునే ఛాన్స్ ఉంది. ఇక మిషనరీ స్కూల్స్ మాత్రం 10 రోజులు హాలీడేస్ వస్తున్నాయి. డిసెంబర్ నెలలో స్కూల్ పిల్లలకు ఎగిరి గంతేసేలా సెలవులు వస్తున్నాయి. …
Read More »తెలంగాణవాసులకు బిగ్ అప్డేట్.. సర్పంచ్ ఎన్నికలు జరిగేది అప్పుడే.. ఇక ఊళ్లలో పండగే..!
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సంబురానికి సమయం ఆసన్నమైంది. సర్పంచుల పదవీ కాలం ముగిసి ఏడాది గడుస్తున్న వేళ.. పంచాయతీ ఎన్నికలు ఇప్పుడో అప్పుడో ఎప్పుడో అంటూ తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయినట్టుగా మరోసారి వార్తలు వస్తున్నాయి. కాగా.. పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. రిజర్వేషన్ల విషయంపై క్లారిటీ వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఎదురుచూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త రిజర్వేషన్లతోనే …
Read More »హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకునే వారికి భారీ శుభవార్త.. ఇక ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు..!
ప్రతి సామాన్యుడికి సొంతిళ్లు అనేది ఓ కల. తాము ఉద్యోగం చేసే ఊర్లో ఓ సొంతిళ్లు ఉండాలని ప్రతిఒక్కరు కలలు కంటుంటారు. చాలా మంది అప్పులు చేసైనా, లోన్లు తీసుకునైనా సరే.. సొంతింటి కలను నెరవేర్చుకుంటుంటారు. గతంలో అయితే స్థలం కొనుక్కుని.. అందులో మనకు కావాల్సినట్టుగా కలల సౌధాన్ని నిర్మించుకునేవారు. కానీ ఇప్పుడు బిల్డర్లే కట్టి రెడీమేడ్‌గా.. కూరగాయలు అమ్మినట్టుగా అమ్మేస్తున్నారు. ఇండిపెండెంట్ ఇండ్లు, అపార్టమెంట్లలో ఫ్లాట్లు ఇలా ఏది కావాలన్నా దొరుకుతుంది కానీ.. వాటి ధరలు చూస్తే దిమ్మతిరిగి బొమ్మ కనపడాల్సిందే. అప్పర్ …
Read More »భవనం కూల్చివేశారు సరే.. మా భవిష్యత్తేంటి? గచ్చిబౌలి ఘటనలో ట్విస్ట్
గచ్చిబౌలిలోని సిద్ధిఖీ నగర్‌లో నాలుగంతస్తుల భవనం మంగళవారం రాత్రి ఒకపక్కకు ఒరిగి భయాందోళన సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఆ భవనాన్ని అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. ఇదిలా ఉండగా.. భవనం పక్కన గుంతలు తవ్వి పక్కకు ఒరగడానికి కారణమైన బిల్డర్‌పై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డర్ శ్రీను అలియాస్ కల్వకోలు శ్రీను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా భవనం పక్కనే గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వ్యవహరించారని జీహెచ్‌ఎంసీ సిటీ ప్లానర్ వెంకటరమణ ఫిర్యాదు చేయడంతో మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. …
Read More »HYD-విజయవాడ నేషనల్ హైవే విస్తరణ.. NHAI అధికారులకు మంత్రి కీలక ఆదేశం
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ రహదారిపై ప్రతి నిత్యం కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే ఒకటి. అయితే ఈ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉండగా.. వాహనాల రద్దీ కారణంగా ప్రతినిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రహదారి విస్తరణకు కేంద్రం డిసైడ్ అయింది. ఆరు వరుసలుగా విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు గ్రీన్ …
Read More »హైదరాబాద్‌లో భారీ స్కామ్.. గోల్డ్ బిస్కట్ పేరు చెప్పి నిండా ముంచేశారు
రాజధాని హైదరాబాద్ పరిధిలో మరో భారీ మోసం వెలుగుచూసింది. గోల్డ్ బిస్కట్ పేరు చెప్పి ఓ సంస్థ ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ పేరుతో కూకట్‌పల్లి కేంద్రంగా ఓ సంస్థ వ్యాపారం ప్రారంభించింది. తమ కంపెనీలో 8 లక్షల 8 వేలు పెట్టి రెండు గుంటల స్థలం కొంటే.. ప్రతి నెలా 4 శాతం చొప్పున రూ.32 వేలు తిరిగి చెల్లిస్తామని ప్రచారం చేశారు. ఆ రకంగా 25 నెలలు చెల్లిస్తామంటూ ఈ కంపెనీ …
Read More »Lagacharla incident: పట్నం మహేందర్ రెడ్డికి ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఈనెల 11న ఫార్మా కంపెనీ భూసేకరణ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లిన జిల్లా కలెక్టర్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా.. హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. పట్నం వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నరేందర్ రెడ్డికి చర్లపల్లి జైలులో అందరు ఖైదీలతో ఉంచకుండా స్పెషల్ …
Read More »రేషన్ కార్డుదారులకు బ్యాడ్‌న్యూస్.. ఆ హామీ మరింత ఆలస్యం, ఇక ఉగాది నుంచే..!
తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఇది నింజగా బ్యాడ్‌న్యూసే. జనవరి నుంచి రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వ హాస్టల్స్, అంగన్‌నాడీ కేంద్రాలకు మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తుండగా.. జనవరి నుంచి లబ్దిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించారు. రేషన్ కార్డులు ఉన్న ప్రతి లబ్దిదారుడికి కుటుంబంలోని ఒక్కో సభ్యుడికి 6 కేజీల చొప్పున ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. …
Read More »తెలంగాణ వెదర్ రిపోర్ట్.. పెరుగుతున్న చలి తీవ్రత
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం బంగాళాఖాతంలో దక్షిణం, ఉత్తరాన రెండు ఆవర్తనాలు ఉన్నాయని చెప్పారు. అయితే వాటి ప్రభావం ఏపీ, తెలంగాణలపై ప్రస్తుతానికి లేదన్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వర్షాలు కురిసే అవకాశం లేదని చెప్పారు. అయితే ఈనెల 26 లేదా 27 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. దాని ప్రభావంతో రాయలసీమ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. తెలంగాణలోని దక్షిణ తెలంగాణ జిల్లాల్ల్లో వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. ఇక తెలంగాణలో చలి …
Read More »తెలంగాణలో కొత్తగా 4 విమానాశ్రయాలు.. అక్కడ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కూడా.. మంత్రి కీలక ప్రకటన
Telangana 4 New Airports: తెలంగాణలో ప్రస్తుతం.. హైదరాబాద్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుతో పాటు శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమనాశ్రయాలు మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. కాగా.. తాజాగా రేవంత్ రెడ్డి సర్కార్ వరంగల్ జిల్లాలోని మామునూరులోని విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించటమే కాకుండా.. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. ఎయిర్ పోర్ట్ విస్తరణకు 256 ఎకరాలు అవసరముండగా.. అందుకోసం పరిపాలనా అనుమతులు ఇస్తూ.. 205 కోట్ల నిధులను కూడా విడుదల చేసింది. అంతేకాదు.. నవంబర్ 19వ తేదీన ఎయిర్ …
Read More »