తెలంగాణలో కొనసాగుతోన్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, ఏపీలో కొనసాగుతున్న తెలంగాణ కేడర్ అధికారులు.. తమ సొంత రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఇటీవల కేంద్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో.. ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌గా కొనసాగుతోన్న ఆమ్రపాలితో పాటు మిగతా 10 మంది అధికారులకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ సెంటర్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16లోగా ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉండగా.. ఐఏఎస్‌లు ట్విస్ట్ ఇచ్చారు. డీఓపీటీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆమ్రపాలి సహా నలుగురు …
Read More »దసరాకు ‘ఆల్ టైం రికార్డు’ సృష్టించిన మందుబాబులు.. గతేడాది కంటే రూ.200 కోట్లు ఎక్కువ.. ఆ జిల్లానే టాప్..!
Telangana Wines Shops: తెలంగాణలో దసరా అంటే మామూలుగా ఉండదు. చుక్కా ముక్కా ఉండాల్సిందే. అది కూడా ఏదో సరదాగా తాగటం కాదు.. అదో యుద్ధం చేసినట్టే ఉంటుంది. అలాగని తెలంగాణ ప్రజలకు తాగటం ఓ వ్యసనం కాదు.. అలవాటు పడిన ఓ సంప్రదాయం. అయితే.. ప్రతీ దసరాకు.. ఖజానాకు గట్టిగానే కాసులు ముట్టజెప్తారు తెలంగాణ మందుబాబులు. ప్రతిసారిలాగే ఈసారి కూడా.. మందుబాబులు రికార్డుస్థాయిలో మద్యం తాగేశారు. కేవలం పది రోజుల్లో వెయ్యి కోట్లు మార్కు దాటించి.. ఆల్ టైం రికార్డు సృష్టించారు. అయితే.. …
Read More »HYD నగరంలో అతిపెద్ద అండర్‌పాస్.. ఆ ఏరియాలోనే, ట్రాఫిక్ సమస్యకు చెక్
హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే నగరం రూపరేఖలు మారిపోయాయి. కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు అందుబాటులోకి వచ్చాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని నిర్మిచంగా.. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాసుల నిర్మాణానికి సిద్ధమైంది. గ్రేటర్ పరిధిలోనే అతిపెద్ద అండర్‌పాస్‌ను నగరంలోని కేబీఆర్ పార్క్ సమీపంలో నిర్మిస్తున్నారు. పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ ప్రయాణాలు సాగేలా ప్రభుత్వం ఈ అండర్‌పాస్‌లను అందుబాటులోకి తీసుకొస్తుంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ –45 వైపు నుంచి కేబీఆర్ పార్కు మెయిన్ గేటు వైపు దాదాపు …
Read More »కొండగట్టు అంజన్న సన్నిదిలో ఇదేం దరిద్రపు పని.. అది కూడా అన్నసత్రంలో.. సీసీకెమెరాల్లో రికార్డు..!
Kondagattu Anjaneya Swamy Temple: తెలంగాణలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నిత్యం ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. మరో వార్త ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. కొండగట్టు అంజన్న సన్నిధిలో దొంగతనం జరిగింది. అది కూడా ఆలయ నిత్య అన్నదాన సత్రంలో ఈ చోరీ జరింది. ఈ నెల 9న.. బియ్యం బస్తాలు, ఇతర వస్తువులు ఎత్తుకుపోయారు. ఈ విషయంలో సీసీ కెమెరాలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. అసలు ఈ చోరీ …
Read More »డీఎస్పీ హోదాలో క్రికెటర్ మహమ్మద్ సిరాజ్.. లుక్ అదుర్స్
టీమిండియా ఆటగాడు, హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్.. డీఎస్పీగా (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్) బాధ్యతలు స్వీకరించారు. ఖాకీ డ్రెస్సు ధరించి, చేతిలో లాఠీ పట్టిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహ్మద్ సిరాజ్.. శుక్రవారం (అక్టోబర్ 12) తెలంగాణ డీజీపీ డాక్టర్ జితేందర్‌ను కలిసి రిపోర్ట్ చేశారు. ఆయన చేతుల మీదుగా జాయినింగ్ లెటర్‌ను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు మహేష్ భగవత్, రమేశ్‌తో పాటు ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో …
Read More »AP Rains: ఏపీకి మరో తుపాను ముప్పు.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరికలు
గత నెల మెుదటి వారంలో కురిసిన భారీ వర్షాలకు ఏపీ అతాలకుతలం అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరం మెుత్తం నీట మునిగింది. బుడమేరుకు గండి పడటంతో నగరంలో వరదలు వచ్చాయి. వేల కోట్ల నష్టం వాటల్లింది. ఇక గత కొద్ది రోజులుగా ఏపీలో వర్షాలు కురవటం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా.. అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు రాష్ట్రానికి మరోసారి తుపాను హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని చెప్పారు. దక్షిణ బంగాళాఖాతంలో రేపటి వరకల్లా ఉపరితల …
Read More »కిన్నెర మొగులయ్యకు అన్యాయం.. రాత్రికిరాత్రే కూల్చివేత.. సర్కార్ ఇచ్చిన 15 రోజులకే..!
పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు ఊహించని పరిణామం ఎదురైంది. కిన్నెర మొగులయ్యను ఆర్థికంగా ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కార్.. ఇటీవలే (సెప్టెంబర్ 24న) హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో 600 గజాల ఇంటి స్థలాన్ని ఇచ్చింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే.. ఆ భూమి పట్టాను మొగులయ్యకు అందించారు. దీంతో.. ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని భావించిన మొగులయ్య.. మొదట తన సొంత ఖర్చుతో చదును చేసుకుని చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటుచేసుకున్నాడు. ఇంతలోనే ఏమైందో తెలియదు కానీ.. రాత్రికి రాత్రే ఆ కాంపౌండ్ వాల్‌ను ఎవరో …
Read More »హైదరాబాద్ నగరానికి కొత్త రూపు.. కూడళ్ల విస్తరణ, ఫుట్ పాత్‌ల అభివృద్ధికి భారీగా నిధులు
హైదరాబాద్ మహా నగరం విశ్వనగరంగా అభివృద్ది చెందుతోంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు నగరానికి క్యూ కడుతున్నాయి. ఇక నగరాన్ని మరింతగా అభివృద్ది చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోంది. ఫోర్త్ సిటీ ఏర్పాటుతో పాటు మూసీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటుంది. నగరంలోని ప్రధాన రహదారుల అభివృద్ధిపై జీహెచ్‌ఎంసీ (GHMC) ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా నగరంలోని ప్రధాన కూడళ్లను విస్తరించి, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా ఇంజినీరింగ్, యూబీడీ విభాగాల ఆధ్వర్యంలో 329 పనులను చేపట్టింది. అభివృద్ధి పనులకు భారీగా నిధులు …
Read More »చెరువుల్లో 386 ఎకరాలు మాయం!
హైదరాబాద్ నగరం, చుట్టుపక్కల ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో అంతులేని ఆక్రమణలు చోటుచేసుకున్నాయి. ప్రత్యేకించి గడిచిన పదేళ్లకాలంలో అత్యధికంగా చెరువులు కబ్జాకు గురయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు వరకు మొత్తం 695 చెరువులు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతుండగా.. ఇందులో 2014 నుంచి 2023 మధ్య కాలంలోనే 44 చెరువులు పూర్తిగా కబ్జాలకు గురై కనుమరుగయ్యాయి. మరో 127 చెరువుల్లో పెద్ద మొత్తం విస్తీర్ణం ఆక్రమణల పాలైంది. మొత్తంగా ఆయా చెరువులన్నింట్లో కలిపి గత పదేళ్లలో 386.71 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు తేల్చారు. వీటిలో …
Read More »తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. హైడ్రా కూల్చివేతలు నిలుపుదల..?
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా నేలమట్టం చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటికే వందల ఇండ్లను నేలమట్టం చేశారు. కొందరు పేదల ఇండ్లతో పాటుగా బడాబాబుల ఖరీదైన విల్లాలను సైతం బుల్డోజర్ల సాయంతో కూల్చేశారు. అయితే ఈ కూల్చివేతలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అమీన్‌పూర్, పటేల్‌గూడ ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టగా.. బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం …
Read More »