Recent Posts

కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయాలు.. కొత్త స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం

దేశంలోని క్రీడాకారులను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర క్యాబినెట్ కొత్త నేషనల్ స్పోర్ట్స్ పాలసీకి ఆమోదం తెలిపింది. మౌలిక సదుపాయాలతో పాటు క్రీడాకారుల సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేయనుంది. అటు రీసెర్చ్ డెవలప్‌మెంట్ & ఇన్నోవేషన్ స్కీమ్‌‌కు కూడా క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. రూ. 1 లక్ష కోట్లతో కార్పస్ ఫండ్‌తో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రీసెర్చ్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించడమే ప్రధాన ఉద్దేశం. అలాగే దీర్ఘకాలిక తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేని రుణాలు అందించనుంది కేంద్రం. అలాగే …

Read More »

ఆపరేషన్‌ సిందూర్‌తో భారత ఆయుధాలకు పెరిగిన డిమాండ్.. “ఆకాశ్” క్షిపణి వ్యవస్థతో పాటు “గరుడ” ఫిరంగులపై బ్రెజిల్ ఆసక్తి!

గత కొన్ని దశాబ్దాలుగా రక్షణ పరికరాలు, ఆయుధాల గురించి ప్రస్తావన వస్తే అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాలు గురించే చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఆ జాబితాలో ప్రపంచంలోనే జనాభాలో అతిపెద్ద దేశంగా, ఆర్థిక వ్యవస్థల్లో 4వ స్థానంలో ఉన్న భారత్ గురించి చెప్పుకుంటున్నారు. అందుకు కారణం పాకిస్థాన్‌లోని ఉగ్రవాదు శక్తులను మట్టికలిపించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్. ఉన్న స్థలం నుంచే పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన తీరుతో..ఈ ఆపరేషన్‌లో భారత్‌ ఉపయోగించిన ఆయుధాలకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరిగింది. ఇదే ఇప్పుడు …

Read More »

ఈ ఏడాది ఇంజినీరింగ్‌ కోర్సులకు ఫీజు పెంపు లేనట్లే..! కీలక ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ విద్యకు పాత ఫీజులనే ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో పాత ఫీజులే ఈ ఏడాదికి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2025-28 ఫీజుల ఖరారు చేసేందుకు త్వరలోనే అధికారుల కమిటీ ఏర్పాటు చేస్తామని, అప్పటివరకు పాత ఫీజులనే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మూడేళ్లకోసారి సాధారణంగా ఇంజినీరింగ్‌ కోర్సుల ఫీజులను పెంచడం రివాజుగా వస్తుంది. ఈ ఏడాది ఫీజుల పెంపుపై ఇప్పటికే సీఎం …

Read More »