Recent Posts

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎప్పుడంటే..?

భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య మరింత బంధం బలపడనుంది. రెండు భారీ రక్షణ ఒప్పందాలు ఖరారు కానున్నాయి. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నిర్వహించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ సమ్మిట్ కోసం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరిలో పారిస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఈ పర్యటన జరగవచ్చని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాల సమాచారం.రష్యా తర్వాత ఇప్పుడు ఫ్రాన్స్ కూడా భారత్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది. 2025 ఫిబ్రవరిలో …

Read More »

లా అండ్ ఆర్డర్‌ విషయంలో ఇష్టారాజ్యంగా ఉంటే తొక్కి నార తీస్తాః డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఆరు నెలలు అయింది.. హనీమూన్ ముగిసింది.. ఇప్పటికీ మేలుకోకపోతే మేటర్ సీరియస్సే.. అంటూ అధికారుల సీటు కింద హీటు పెంచేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. ఇప్పటిదాకా నేను ప్రశ్నించా..ఇకమీదట మీరు ప్రశ్నించండి అంటూ ప్రజానీకానికి బంపరాఫర్ ఇచ్చారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులకు స్వీట్ వార్నింగ్ ఇస్తూనే.. ఆ విధంగా ప్రజలకూ భరోసానిచ్చే ప్రయత్నం చేశారు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురం మండలం కుమారపురం గ్రామంలో మినీ గోకులాన్ని పవన్ …

Read More »

వందేభారత్ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త.. సంక్రాంతి ముందే వచ్చేసిందిగా

వందేభారత్ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త. సంక్రాంతి ముందే వచ్చేసిందని చెప్పొచ్చు. జనవరి 11 నుంచి విశాఖపట్నం – సికింద్రాబాద్ – విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను జత చేయనుంది దక్షిణ మధ్య రైల్వే. 20833-34 నెంబర్ గల విశాఖ-సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం 16 కోచ్‌లతో 1,128 ప్యాసింజర్ల సామర్థ్యంతో సేవలు అందిస్తుండగా.. రేపటి నుంచి అనగా జనవరి 11న ఈ ట్రైన్ 1,414 ప్యాసింజర్ల సామర్థ్యంతో 20 కోచ్‌లతో పట్టాలెక్కనుంది. ప్రస్తుతం 16 కోచ్‌లు ఉన్న ఈ వందేభారత్‌లో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్, …

Read More »