Recent Posts

ఒకేసారి 3 శుభవార్తలు చెప్పిన ప్రముఖ టెక్ సంస్థ.. అంచనాల్ని మించి లాభాలు.. ఉద్యోగులకు పండగే!

L and T Technology Services: ప్రముఖ ఇంజినీరింగ్ సేవల సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (LTTS) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ ఫలితాల్ని ప్రకటించింది. అక్టోబర్ 16న ఫలితాల్ని వెల్లడించగా.. నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 1.3 శాతం మేర పెరిగి రూ. 319.60 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఈ సమయంలో లాభం రూ. 315.4 కోట్లుగా ఉండేది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం రెండో త్రైమాసికంలో …

Read More »

టీడీపీని వీడి వైసీపీలో చేరిన కీలక నేత.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో సార్వత్రిక ఎన్నికలు వైఎస్సార్‌సీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. ఫలితాల తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పేశారు.. జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిన నేతల్ని చూశాం.. కానీ ఈయన మాత్రం కాస్త వెరైటీ. అధికారంలో ఉన్న టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరి షాకిచ్చారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు …

Read More »

హైడ్రా కూల్చివేతలపై మరో కీలక నిర్ణయం.. బాధితులకు పరిహారం..!

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత 2-3 నెలల వ్యవధిలో వందలాది ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. కాగా, ఈ హైడ్రా కూల్చివేతలపై విమర్శలు వస్తున్నాయి. పేదల ఇండ్లను మాత్రమే నేలమట్టం చేస్తున్నారని.. పైసా పైసా కూడబెట్టి కష్టపడి కట్టుకున్న ఇండ్లను కూల్చేయటం సరైంది కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. బిల్డర్లు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసిన మోసానికి పేదలు నష్టపోతున్నారని.. అసలు అది చెరువుల …

Read More »