Recent Posts

సంజూ శాంసన్ మెరుపు సెంచరీ.. హైదరాబాద్‌లో సిక్సర్ల వర్షం

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. సంజూ శాంసన్ మెరుపు సెంచరీ చేశాడు. అతడికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తోడవ్వడంతో బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. బంతి వేయడం గాల్లోకి చూడటం బంగ్లా ఆటగాళ్ల వంతైంది. ఆకాశమే హద్దుగా చెలరేగిన సంజూ శాంసన్ కేవలం 47 బంతుల్లో 111 పరుగులు (సిక్స్‌లు 8, ఫోర్లు 11) చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 పరుగులు (సిక్స్‌లు 5, …

Read More »

పండుగ రోజున చంద్రబాబు ఇంటికి చిరంజీవి.. అసలు కారణమదే..

మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి శనివారం సాయంత్రం వచ్చారు చిరంజీవి. చంద్రబాబును కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు విరాళం తాలూకు చెక్ అందజేశారు. విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి చిరంజీవి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. తన తరుఫున రూ.50 లక్షలు, రామ్ చరణ్ తరుఫున మరో రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ఆ మొత్తాన్ని శనివారం రోజున చంద్రబాబు నాయుడును కలిసి అందజేశారు. ఇక …

Read More »

ఏపీకి భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లోనే.. టోల్‌ ఫ్రీ నంబర్లు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్య గమనిక. ఏపీలో ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్టోబర్ 14వ తేదీ (సోమవారం) నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని కారణంగా ఆదివారం కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం, అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, …

Read More »