Recent Posts

ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు.. ఘాట్ రోడ్డు మూసివేత, ఏడుగురు మృతి

Vijayawada Rains: ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం అతలాకుతలం అవుతోంది. రెండు రోజులుగా ముసురు వానలు కురుస్తుండగా.. శనివారం ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరం మొత్తం వరదతో నిండిపోయింది. ప్రధాన రహదారులు మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇక ప్రముఖ ఇంద్రకీలాద్రి గుట్టపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై ఉన్న ప్రోటోకాల్ రూమ్‌పై భారీ బండరాళ్లు విరిగిపడటంతో అది …

Read More »

గుంటూరులో కారు కొట్టుకుపోయి టీచర్, విద్యార్థులు మృతి; 

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలు పలు చోట్ల తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు నగరాలను కుండపోత వానలు అతలాకుతలం చేస్తున్నాయి. గుంటూరు జిల్లా ఉప్పలపాడులో విషాదం చోటు చేసుకుంది. వరద ఉద్ధృతికి కారు వాగులో కొట్టుకుపోయి, స్కూల్ టీచర్ సహా ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్, మానిక్‌గా గుర్తించారు. మంగళగిరి మండలం, ఉప్పలపాడుకు చెందిన నడుంపల్లి రాఘవేంద్ర (38).. నంబూరులోని వివా స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం తరగతులు ముగిసిన అనంతరం.. ఇంటికి బయల్దేరే …

Read More »

ఆగకుండా కురుస్తోన్న వర్షం.. ఈ జిల్లాల్లో అత్యంత భారీ వానలు, వాతావరణశాఖ హెచ్చరికలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా వైపుగా కదులుతున్న వాయుగుండం తీవ్రంగా బలపడింది. కళింగపట్నానికి దక్షిణంగా 30కి.మీ, విశాఖకు ఈశాన్యంగా 90 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్‌, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, …

Read More »