Blog Layout

తండ్రైన శేఖర్ బాషా.. నాగార్జున ఆ మాట చెప్పగానే ఉద్వేగం.. ఎలిమినేషన్‌కి అసలు కారణం ఇదే

శేఖర్ బాషా ఎలిమినేట్ అవ్వడం ఏంట్రా బాబూ.. అని తలలు పట్టుకుంటున్నారు బిగ్ బాస్ లవర్స్. అయితే శేఖర్ బాషా ఎలిమినేషన్‌కి బలమైన కారణమే ఉంది. ఆ విషయాన్ని నేరుగా హౌస్‌లోనే ప్రకటించారు హోస్ట్ నాగార్జున. శేఖర్ బాషా భార్య నిండు గర్భిణిగా ఉండగా.. శనివారం ఉదయం ఆమె పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ విషయాన్ని శేఖర్ బాషాకి చెప్పగా.. అతను చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది శనివారం నాటి ఎపిసోడ్‌లో చూడబోతున్నాం. ఈ కారణంగానే శేఖర్ బాషాని ఎలిమినేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. …

Read More »

అందరి చూపు సెప్టెంబర్ 17వైపే.. ఓవైపు నిమజ్జనం, మరోవైపు విమోచనం.. సర్వత్రా ఉత్కంఠ..!

ప్రస్తుతం తెలంగాణ ప్రజలందరి దృష్టి సెప్టెంబర్ 17 పైనే ఉంది. ఆరోజు హైదరాబాద్‌లో వాతావరణ పరిస్థితులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు.. సెప్టెంబర్ 17వ తేదీనే హైదరాబాద్‌లో మహానిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఖైరతాబాద్ మహా గణపతితో పాటు నగర వ్యాప్తంగా ఉన్న బడా గణేషులు మంగళవారం రోజునే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం కానున్నాయి. కాగా.. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఉండటంతో.. రాజకీయ కార్యక్రమాలు కూడా జోరుగా జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఈరోజున వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. …

Read More »

ఎఫ్‌డీ చేసే వారికి బెస్ట్ ఆప్షన్.. ఈ బ్యాంకుల్లో 9 శాతం వడ్డీ.. రూ.5 లక్షలు జమ చేస్తే ఎంతొస్తుంది?

FD Rates: స్థిరమైన రాబడి పొందాలనుకునే వారికి వెంటనే గుర్తుకు వచ్చేది బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (Fixed Deposits). ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేని రాబడిని అందించే మదుపు మార్గం ఫిక్స్‌డ్ డిపాజిట్లు అని చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో డిపాజిట్లను పెంచుకునేందుకు బ్యాంకులు సైతం మంచి వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. సాధారణంగా 60 ఏళ్ల వయసు లోపు ఉండే జనరల్ కస్టమర్లకు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు ఇస్తూ.. 60 ఏళ్ల వయసు దాటిన సీనియర్ సిటిజన్లకు …

Read More »

రాజమండ్రిలో చిక్కని చిరుత.. భయం గుప్పిట్లో శివారు ప్రాంతాలు..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత సంచారం స్థానికులను కలవరపెడుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు అటవీ ప్రాంతంలో చిరుత కనిపించి 9 రోజులు దాటింది. అయితే ఇప్పటికీ దానిని అటవీశాఖ బంధించలేకపోతోంది. దీంతో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. అయితే శుక్రవారం చిరుత ట్రాప్ కెమెరాకు చిక్కడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. శివారు ప్రాంతాలైన దివాన్ చెరువు, లాలా చెరువు, స్వరూప్ నగర్, తారక నగర్, శ్రీరాంపురం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. మరోవైపు చిరుతను బంధించేందుకు అధికారులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా …

Read More »

3 నెలల్లో 4 కొత్త సర్వీసులు ప్రారంభం.. రామ్మోహన్ నాయుడా మజాకా!

ఏపీ వాసులకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మో్హన్ నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే గన్నవరం నుంచి దుబాయి, సింగపూర్‌లకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామని తెలిపారు. గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి మీద స్పెషల్ ఫోకస్ పెడతామన్న మంత్రి.. విజయవాడ నుంచి విమాన ప్రయాణికుల సంఖ్యను పెంచుతామన్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో అప్రోచ్ రహదారిని, విజయవాడ- ఢిల్లీ ఇండిగో సర్వీసును మంత్రి శనివారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన రామ్మోహన్ నాయుడు.. తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు …

Read More »

3 ఏళ్లకే లక్షకు రూ.7 లక్షలొచ్చాయ్.. ఇప్పుడు 3 షేర్లకు 1 షేరు ఫ్రీ..

టెక్స్ టైల్ సెక్టార్ కంపెనీ అక్షిత కాటన్ లిమిటెడ్ ( Axita Cotton Limited) తమ షేర్ హోల్డర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. బోనస్ షేర్ల జారీ ప్రకటన చేసింది. ఈ బోనస్ షేర్లు జారీకి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో వెల్లడించిది. అలాగే గతంలో నిర్ణయించిన రికార్డు తేదీ సెప్టెంబర్ 16ను సెప్టెంబర్ 20 కి మార్చినట్లు పేర్కొంది. అలాగే ఈ కంపెనీ షేరు గత మూడేళ్లో 561 శాతం మేర పెరిగి మల్టీబ్యాగర్ రిటర్న్స్ …

Read More »

అంబానీ, అదానీ కానేకాదు.. దేశంలో బెస్ట్ కంపెనీగా ఆ టెక్ సంస్థ..!

ఈ సంవత్సరానికి సంబంధించి ప్రపంచంలోని అత్యుత్తమ కంపెనీల జాబితాను విడుదల చేసింది టైమ్స్ మ్యాగజైన్. టైమ్ బెస్ట్ కంపెనీస్ 2024 పేరుతో లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 1000 కంపెనీలను చేర్చింది. టైమ్ బెస్ట్ కంపెనీల లిస్టులో ఈసారి భారత్‌ నుంచి మొత్తంగా 22 కంపెనీలు చోటు దక్కించుకున్నాయి. అయితే, దేశీయ కంపెనీలలో బెస్ట్ కంపెనీగా ఏ అదానీ సంస్థనో, ముకేశ్ అంబానీ సంస్థనో ఉంటుందని అనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. దిగ్గజ సంస్థలన్నింటినీ వెనక్కి నెట్టి ఓ …

Read More »

హైదరాబాద్‌వాసులకు ఆమ్రపాలి తీపికబురు.. నిమజ్జనానికి వచ్చేవారికి ఉచిత భోజనం..!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాల కోలాహలం ఇప్పటికే మొదలైంది. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి సందర్భంగా గణనాథులను ప్రతిష్ఠించగా.. మూడో రోజు నుంచే నగరంలో నిమజ్జనాలు మొదలయ్యాయి. అయితే.. హైదరాబాద్‌లోని బడాబడా గణేషులు తొమ్మిదో రోజున లేదా పదకొండో రోజున గంగమ్మ ఒడికి చేరుకోవటం ఆనవాయతీగా వస్తోంది. ఇందులో భాగంగానే.. సెప్టెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున ఖైరతాబాద్ మహగణపతి నిమజ్జనం జరగనుంది. అదే రోజున నగరవ్యాప్తంగా ఉన్న భారీ గణనాథులు కూడా.. గంగమ్మ ఒడి చేరుకునేందుకు హుస్సేన్ సాగర్‌కు క్యూ కట్టనున్నాయి. అయితే.. …

Read More »

22 గ్రామాలకు సోలార్ పవర్.. ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు, డిప్యూటీ సీఎం ఆదేశం

తెలంగాణలో డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి చేసేందుకు వీలుగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి, వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఇటీవల అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. వివిధ శాఖల పరిధిలో వాడుకలో లేని భూముల్లో సోలార్ పవర్ ఉత్పత్తి ప్లాంట్లు నెలకొల్పాలని ఆదేశించారు. సోలార్ విద్యుత్‌ను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని రైతులకు ఫ్రీగా సోలార్ పంప్‌సెట్లు అందజేయాలన్నారు. తన సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెలో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని అధికారులకు సూచించారు. సీఎం రేవంత్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్టుగా తొలిదశలో 22 గ్రామాలను …

Read More »

వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ.. ఏపీ హైకోర్టు సీరియస్, ఆ పదజాలంపై అభ్యంతరం

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తనకు భద్రత పెంచాలని వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. అయితే ఈ పిటిషన్‌లో జగన్‌కు మద్దుతగా ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ ఖాజావలి ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయడంపై సీరియస్‌గా స్పందించింది. జగన్‌ ఓవైపు తన భద్రత గురించి పిటిషన్‌ వేశాక.. మూడో పక్షం ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేయాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు. కొందరు కోర్టుల్నిప్రచార వేదికలు, క్రీడా మైదానాలుగా ఉపయోగించుకుంటున్నారని ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఖాజావలి ఇంప్లీడ్‌ పిటిషన్లో …

Read More »