Blog Layout

TVK Party: విజయ్ పార్టీ జెండా చూశారా? ప్రజారాజ్యాన్ని గుర్తుచేసిన దళపతి

తమిళ రాజకీయాలు-సినిమాలు రెండింటినీ వేర్వేరుగా చూడటం అసాధ్యం. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ స్థాపించిన ఎంజీఆర్ నుంచి ఆ పార్టీని అదే రేంజ్‌లో ముందుకు తీసుకెళ్లిన జయలలిత వరకూ అందరూ సినీనటులే. అలానే డీఎంకే పార్టీని నడిపించిన కరుణానిధి నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఆయన మనవడు ఉదయనిధి స్టాలిన్ వరకూ అందరూ సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లే. ఇక కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి కూడా రాజకీయ రంగప్రవేశం …

Read More »

ఈ రోజుల్లో ఇలాంటి శిక్షలా..? మాజీ మావోయిస్టు చనిపోతే ఒక్కరూ రాలే..!

కాలం మారుతున్నా.. కొందరు దురాచారాలను మాత్రం వీడటం లేదు. కులం పేరుతో ఇప్పటికీ దారుణాలకు పాల్పడుతున్నారు. మనిషి బతికున్నప్పడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా వారిని హింసిస్తున్నారు. తాజాగా అటువంటి దారుణ ఘటనే సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకునంది. ఓ మాజీ మావోయిస్టు చనిపోతే.. కుల కట్టుబాట్లకు తలొగ్గి ఎవరూ అంత్యక్రియల్లో పాల్గొనలేదు. చివరకు డబ్బు కొట్టేవాళ్లు కూడా రాకపోవటంతో పక్క గ్రామం నుంచి రప్పించి రెండు కుటుంబాల వారే అంతిమ సంస్కారాలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా అక్భర్పేట భూంపల్లి మండలం …

Read More »

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ కొత్త రైలు మార్గంతో బెనిఫిట్, ఈ రూట్‌లోనే!

ఆంధ్రప్రదేశ్‌లోని విలీన మండలాల సమీపంలో రైలు కూత వినిపించబోతోంది. గోదావరికి అవతలి వైపు కొత్త రైలు మార్గానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఏపీకి కలిసొస్తుంది. కేంద్రం ఒడిశాలోని మల్కాన్‌గిరి నుంచి తెలంగాణలోని బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు 200.60 కి.మీ. పొడవుతో కొత్త రైల్వే లైను నిర్మాణానికి ఓకే చెప్పింది. మొత్తం రూ.4,109 కోట్ల వ్యయంతో ఈ లైను నిర్మాణం కాబోతోంది.. ఒడిశా నుంచి ఈ లైను గోదావరి అవతలి వైపున ఉన్న చింతూరు, కూనవరం, ఎటపాక మండలాల మీదుగా వస్తుంది.. అక్కడి …

Read More »

‘అందుకు మీ సలహాలు కావాలి’.. CPM నేతలను రిక్వెస్ట్ చేసిన సీఎం రేవంత్‌

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకు రేయింబవళ్లు కష్టపడి పని చేస్తున్నామన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీపీఎం నేతలు రాఘవులు, జూలకంటి రంగారెడ్డిలతో సీఎం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. వ్యక్తిగత పనుల నిమిత్తం రాఘవులు సెక్రటేరియట్‌కు వెళ్లగా.. అక్కడే ఉన్న సీఎం ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి వారిని రేవంత్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పలు అంశాలపై రేవంత్ సీపీఎం నేతలకు వివరించారు. ఇటీవలె రూ. 2 లక్షల …

Read More »

చంద్రబాబు సర్కార్ పెద్ద మనసు.. అచ్యుతాపురం ఘటన మృతులకు రూ.కోటి పరిహారం

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు.. అలాగే గాయపడినవారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు.. వారికి కూడా పరిహారం అందజేస్తామన్నారు. మరోవైపు కేంద్రం తరఫున కూడా ప్రధాని నరేంద్ర మోదీ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. 17 మంది మృతి చెందడంపై సంతాపం తెలియజేశారు.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు …

Read More »

ఏపీలో బైక్‌లు నడిపేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై అలా కుదరదు, హైకోర్టు సీరియస్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రోడ్డు ప్రమాదాలపై దాఖలైన పిల్‌పై విచారణ జరిగింది. రాష్ట్రంలో హెల్మెట్‌ ధరించని వాహనదారులపై ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా లేవని హైకోర్టు వ్యాఖ్యానించింది. 99 శాతం మంది హెల్మెట్‌ ధరించకుండా బైక్‌లు నడుపుతున్న విషయాన్ని తాము గమనించామని తెలిపింది. విజయవాడలో హెల్మెట్‌ ధరించిన వారు కనిపించడం లేదని.. హెల్మెట్‌ ధరించడం తప్పనిసరి చేయాలని తామిచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపింది. అంతేకాదు చట్ట నిబంధనలు అమలు చేయడంలో ట్రాఫిక్‌ పోలీసులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారని.. హెల్మెట్‌ ధరించనివారికి వారు జరిమానా విధిస్తున్నట్లు తాము …

Read More »

ఏపీ ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టీర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం కూడా కోస్తా, రాయలసీమలోని పలు …

Read More »

RC Renewal : ఆన్‌లైన్‌లో సులభంగా మీ వెహికల్‌ RC రెన్యువల్‌ చేసుకోవచ్చు.. ప్రాసెస్‌ ఇదే

Online Process for RC Renewal : సాధారణంగా వాహనం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేషన్‌ (RC) గడువు 15 సంవత్సరాలపాటు ఉంటుంది. కేంద్ర మోటార్‌ వెహికల్‌ చట్టం నిబంధనల ప్రకారం ప్రైవేటు వాహనాల రిజిస్ట్రేషన్‌ గడువు 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అనంతరం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్‌ చేసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ముగింపు తేదీకి ముందే రెన్యువల్ చేసుకోవడం ఉత్తమం. ఇందుకు ఆన్‌లైన్‌ ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.. RC రెన్యువల్‌కి అవసరమైన డాక్యుమెంట్స్: ఆర్సీ రెన్యువల్ ప్రకియలో …

Read More »

అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 17 మంది చనిపోవడంపై సంతాపం తెలిపారు. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ.50 వేలు అందించనున్నట్లు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ప్రమాదం దురదృష్టకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ప్రాణాలు …

Read More »

విజయవాడ దుర్గ గుడికి వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. ఆ మూడు రోజులు ఈ సమయంలో దర్శనాలు నిలిపివేత

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ ఈవో కె.ఎస్‌ రామారావు కీలకమైన సూచన చేశారు. దుర్గమ్మకు నివేదన సమర్పించే సమయంలో.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉంటున్నారు. అందుకే ఆ సమయంలో ప్రముఖుల ప్రోటోకాల్‌ దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు దుర్గగుడి ఈవో తెలిపారు. అంతేకాదు శుక్ర, శని, ఆదివారాల్లో భక్తుల రద్దీ ఇతర రోజుల కంటే ఎక్కువగా ఉంటోంది. ఉదయం 11.30 నుంచి …

Read More »