Recent Posts

బెట్టింగులకు బానిసై రూ.2.40 కోట్లు అప్పు చేసిన కుమారుడు.. తీర్చలేక తల్లిదండ్రుల బలవన్మరణం

ఒక్కగానొక్క కొడుకని అల్లారుముద్దుగా పెంచారు. అడిగిందల్లా కాదనకుండా కొనిచ్చారు. వంశాన్ని నిలబెట్టే వారసుడని.. తమను పున్నామ నరకం నుంచి గట్టెక్కించే పుత్రుడని ఆశలు పెంచుకున్నారు. కానీ వారి కలలు కల్లలయ్యాయి. అతి గారాబమే తమ పాలిట మృత్యుపాశమవుతుందని.. కన్న కొడుకే తమ చావుకు కారణమవుతాడని.. పాపం ఆ వెర్రి తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. మంచి చదువులు చదివించి ప్రయోజకుడిని చేద్దామని భావించిన ఆ కన్నవారి ఆశలు అడియాశలయ్యాయి. చిన్నప్పటి నుంచి గారబంగా పెరిగిన ఆ కొడుకు.. వ్యసనాలకు బానిసయ్యాడు. బెట్టింగులకు బానిసగా మారి కోట్ల రూపాయలు …

Read More »

అన్న క్యాంటీన్లకు ఆ రోజు సెలవు.. వడ్డించే ఐటెమ్స్ ఇవే.. ఆహార పరిమాణం ఎంతంటే?

ఏపీలో అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. పేదల కడుపు నింపాలనే ఆలోచనతో గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్లకు శ్రీకారం చుట్టింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్లు మూతపడగా.. మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తిరిగి అన్న క్యాంటీన్లు తీసుకువచ్చారు. గురవారం పంద్రాగస్టు సందర్భంగా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను చంద్రబాబు ప్రారంభించారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి చంద్రబాబు అన్న క్యాంటీన్ ప్రారంభించారు. ఆగస్ట్ 16న రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాలలో ఉన్న మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, …

Read More »

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా విలయం.. నగరం అతలాకుతలం..!

హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు. చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో… లోతట్టు …

Read More »