Recent Posts

అర్హులైనా రైతు రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ. పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ. 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మెుత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్ష, రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ …

Read More »

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లపైకి భారీగా వరద, బయటకెళ్లేవారు జాగ్రత్త

హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణుడు దంచికొడుతున్నాడు. జోరువానతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ప్రధానంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎర్రమంజిల్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెుహదీపట్నం, చౌలిచౌకి, యూసఫ్‌గూడ, మసాబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6.40 గంటలకు మెుదలైన వాన గంట నుంచి కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వరదతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు …

Read More »

మాజీ మంత్రి జోగి రమేష్‌కు షాక్.. మాజీ మంత్రి ఇంట్లో ఏసీబీ సోదాలు, చిక్కులు తప్పవా!

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ఇబ్రహీపంట్నలోని రమేష్ నివాసంలో 15మంది అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు చేస్తోంది.. ఈ క్రమంలోనే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ భూముల విషయంలో జోగి రమేష్‌పై ఆరోపణలు వచ్చాయి. అగ్రిగోల్డ్‌కు సంబంధించి సీఐడీ స్వాధీనంలో ఉన్న రూ.5కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఏసీబీ రంగంలోకి దిగి ఈ సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్‌ జిల్లా అంబాపురంలో అగ్రిగోల్డ్‌కు చెందిన భూమి …

Read More »