amaravatinews

తిరుపతి: 150 గంటల్లోనే భారీ భవన నిర్మాణం పూర్తి.. ప్రపంచ రికార్డ్, ఈ టెక్నాలజీ అదిరింది

ఓ పరిశ్రమను నిర్మించాలంటే ఎంత సమయం పడుతుంది.. కనీసం ఆరునెలల నుంచి ఏడాది మాత్రం పక్కా. తిరుపతి జిల్లాలో మాత్రం అలా కాదు.. కేవలం 150 గంటల్లో ఏకంగా లక్షన్నర చదరపు అడుగుల భారీ విస్తీర్ణంలో పరిశ్రమను ఏర్పాటు చేసి సరికొత్త రికార్డును నమోదు చేశారు. తిరుపతి జిల్లాలోని తడ సమీపంలోని మాంబట్టు ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రముఖ ప్రీ-ఇంజనీర్డ్‌ బిల్డింగ్‌ (పీఈబీ) నిర్మాణ సంస్థ ఈప్యాక్‌ ప్రీఫ్యాబ్‌ ఈ పరిశ్రమను నిర్మించింది. కేవలం 150 గంటల్లోనే ఒక భారీ పరిశ్రమను నిర్మించి రికార్డు సృష్టించారు. …

Read More »

వైఎస్ జగన్ సొంత జిల్లాపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. ఢిల్లీలోని కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావన

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులను పవన్ కళ్యాణ్ కలుస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉదయం గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసిన పవన్ కళ్యా్ణ్.. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటకానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఏపీలో టూరిజం ప్రాజెక్టులు, పర్యాటక వర్సిటీ సహా మొత్తం ఏడు అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్లు.. భేటీ అనంతరం …

Read More »

మహా కుంభమేళాలో తొలిసారి.. అచ్చం రజినీకాంత్ రోబో సినిమా లాగే, కానీ..!

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మరికొన్ని రోజుల్లో జరగనున్న మహా కుంభమేళా కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు రానున్న నేపథ్యంలో మహా కుంభమేళాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే భద్రత, ఇతర తక్షణ అవసరాల కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్‌మెంట్‌లను సర్కార్ అలర్ట్ చేస్తోంది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఈసారి మహా కుంభమేళాలో తొలిసారి రోబోలను వినియోగిస్తున్నారు. కుంభమేళాలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు తలెత్తకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లను అధికారులు రంగంలోకి దించారు. …

Read More »

Aadhaar Update: ఇక ఆధార్ అప్డేట్ ఈజీ కాదు.. రూల్స్ కఠినతరం.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి!

Aadhaar Update: ఆధార్ కార్డు అనేది భారతీయులకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. గుర్తింపు కార్డు కోసం ఇప్పుడు ఆధార్ కార్డునే అడుగుతున్నారు. ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదనే చెప్పాలి. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమా పథకాల నుంచి బ్యాంకులో అకౌంట్ తెరవాలన్నా ఆధార్ తప్పనిసరి. ఇలాంటి ముఖ్యమైన ఆదార్ కార్డులోని వివరాలు తప్పుగా ఉంటే పెద్ద సమస్యే వస్తుంది. గతంలో ఆధార్ కార్డులో పేరు, అడ్రస్ వంటి వివరాల్లో తప్పులు ఉంటే ఆన్‌లైన్ ద్వారానే ఇంటి నుంచే అప్డేట్ చేసుకునే వీలు ఉండేది. …

Read More »

Pawan kalyan: రామ్‌గోపాల్ వర్మ కోసం పోలీసుల గాలింపు.. పవన్ కీలక వ్యాఖ్యలు

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే ఆరోపణలపై రామ్‌గోపాల్ వర్మ మీద ఏపీలో కేసులు నమోదయ్యాయి. దీనిపై ఒంగోలు పోలీసులు ఆర్జీవీకి నోటీసులు కూడా ఇచ్చారు. అయితే విచారణకు హాజరుకాకపోవటంతో రామ్‌ గోపాల్ వర్మ కోసం ప్రకాశం జిల్లా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న …

Read More »

ఉత్తరాంధ్రవాసుల కల నెరవేరబోతోంది.. రైల్వే జోన్‌పై మరో ముందడుగు, రెండేళ్లలో పూర్తి

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటుకు మరో ముందడుగు పడింది. నగరంలోని ముడసర్లోవ ప్రాంతంలో ‘దక్షిణ కోస్తా రైల్వే జోన్‌’ ప్రధాన కార్యాలయం భవన నిర్మాణ పనులకు రైల్వే శాఖ టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ భవన సముదాయానికి సంబంధించిన డిజైన్ కూడా ఫైనల్ చేశారు. ఈ భవన సముదాయాన్ని బీ1+బీ2+జీ+9 (బేస్‌మెంట్‌ 1, 2, గ్రౌండ్, మొత్తం 9 ఫ్లోర్లు)గా నిర్మించాలని నిర్ణయించారు.. ఈ మేరకు ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు డీపీఆర్‌లో డిజైన్ ఆకట్టుకుంది. ఈ భవనాన్ని మొత్తం 27,548.3 …

Read More »

నా గన్‌మెన్‌లను వెనక్కు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి స్వరూపానంద లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు కల్పిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోవాలని కోరారు విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్ (X) 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ రాశారు. 2019 నుంచి 2024 వరకూ తన భద్రత, శ్రేయస్సు కోసం ప్రస్తుత, గత ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని.. 2019 నుంచి విశాఖపట్నంలోని శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు వైఎస్సార్‌సీపీ, కూటమి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇకపై రిషికేశ్‌లో తపస్సులోనే ఎక్కువ …

Read More »

ఐపీఎల్‌లోకి సిక్కోలు కుర్రాడు.. ఢిల్లీ కేపిటల్స్‌ టీమ్‌లోకి ఆల్‌రౌండర్ విజయ్

క్కోలు జిల్లా కుర్రాడు ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్‌‌ను.. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ కేపిటల్స్ టీమ్‌ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ యువ ఆల్‌రౌండర్‌ అటు ఏపీఎల్‌తో పాటుగా ఇటు రంజీ మ్యాచ్‌ల్లోనూ రాణిస్తూ ఇప్పుడు ఐపీఎల్‌లో ఛాన్స్ దక్కించుకున్నాడు. విజయ్‌ను, కుటుంబ సభ్యుల్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు అభినందించారు. ‘శ్రీకాకుళం జిల్లా నుంచి ఐపీఎల్‌కు ఎంపికైన త్రిపురాన విజయ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ కొత్త అధ్యాయంలో మీరు విజయం సాధించాలని …

Read More »

భారీగా పెరుగుతున్న రూ. 500 దొంగ నోట్లు.. ఐదేళ్లలో 317 శాతం జంప్.. నకిలీ నోటు గుర్తించడం ఎలా?

Spot Rs 500 Rupee Note Fake: 2016 నవంబర్‌ నెలలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా పెద్ద నోట్లను రద్దు చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేసి.. రూ. 2 వేలు విలువైన నోటును చలామణీలోకి ప్రవేశపెట్టింది. ఆ తర్వాత మరో కొత్త డిజైన్‌లో రూ. 500 నోటు తీసుకొచ్చింది. ఇక గతేడాది రూ. 2000 బ్యాంక్ నోట్లను కూడా ఉపసంహరించుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. …

Read More »

ఏపీలో కొత్తగా మరో గ్రీన్‌ ఫీల్డ్ హైవే.. ఈ రూట్‌లోనే 6 లైన్లుగా, అక్కడికి 8 గంటల్లో వెళ్లిపోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో గ్రీన్ ఫీల్డ్ హైవేకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖపట్నం– ఖరగ్‌పూర్‌ (పశ్చిమ బెంగాల్‌) మధ్య హైవే నిర్మాణానికి కేంద్ర జాతీయ రహదారుల శాఖ నిర్ణయించింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా పశ్చిమ బెంగాల్ వరకు నిర్మించనున్నారు. ఈ మేరకు డీపీఆర్‌ రూపొందించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. కేంద్రం ప్రధాన మంత్రి గతి శక్తి ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ హైవేను నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన డీపీఆర్‌ రూపొందించేందుకు టెండర్లు పిలవగా.. 10 …

Read More »