హైదరాబాద్ నగరంలో అతి భారీ వర్షం కురుస్తోంది. సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మేఘావృతమై.. కుండపోతగా వర్షం కుమ్మరిస్తోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మేఘం విరిగిపడిందా అన్నట్టుగా వాన కురుస్తుండటంతో.. నగరంలోని రహదారులన్ని ఒక్కసారిగా జలమయం అయ్యాయి. ఉరుములు మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులతో.. వరుణుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా నగరంలో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోయింది. రోడ్లపై ఉన్న వాహనదారులు రోడ్లపైనే వర్షంలో తడిసి ముద్దయిపోయారు. చాలా సేపటి నుంచి కురుస్తున్న వర్షంతో… లోతట్టు …
Read More »బిగ్ ట్విస్ట్.. కవితకు నో బెయిల్.. ఆ నిందితునికి మాత్రం భారీ ఊరట..!
Delhi Liquor Scam Case: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో రోజులో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. ఈ కేసులో సుమారు 17 నెలలుగా జైలులో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఎట్టకేలకు ఇటీవలే బెయిల్ దొరకగా.. ఇప్పుడు ఈ కేసులో నిందితునిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త అభిషేక్ బోయినపల్లికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం.. మరో రెండు వారాలు పొడిగిస్తూ తీర్పునిచ్చింది. అదనపు సొలిసిటర్ జనరల్ …
Read More »అర్హులైనా రైతు రుణమాఫీ కాలేదా..? గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి పొన్నం
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ. పంట రుణాలు తీసుకున్న రైతులకు రూ. 2 లక్షల వరకు లోన్లు మాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మెుత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుండగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్ష, రూ. లక్షన్నర వరకు రుణాలు మాఫీ అయ్యాయి. ఆగస్టు 15న మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ …
Read More »హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. రోడ్లపైకి భారీగా వరద, బయటకెళ్లేవారు జాగ్రత్త
హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా వరుణుడు దంచికొడుతున్నాడు. జోరువానతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దయింది. ప్రధానంగా పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎర్రమంజిల్, కూకట్‌పల్లి, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, బాలానగర్, మెుహదీపట్నం, చౌలిచౌకి, యూసఫ్‌గూడ, మసాబ్‌ట్యాంక్ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం 6.40 గంటలకు మెుదలైన వాన గంట నుంచి కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. భారీ వరదతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు …
Read More »రైతులకు మరో శుభవార్త.. ఖాతాల్లోకి ఒకేసారి 15 వేలు.. ముహూర్తం అప్పుడే..!?
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వరుసగా ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల్లో భాగంగా.. పలు పథకాలను అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. తాజాగా ప్రతిష్ఠాత్మకమైన రుణమాఫీ హామీని అమలు చేస్తోంది. ఆగస్టు 15లోపు రాష్ట్రంలోని అన్నదాతలందరికీ 2 లక్షల మేర రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఇప్పటికే రెండు విడతల్లో రుణాలు మాఫీ చేసిన సర్కార్.. ఇప్పుడు మూడో విడతకు సిద్ధమైంది. ఆగస్టు నెల పూర్తయ్యేలోపు 2 లక్షల రుణమాఫీ …
Read More »కవిత బెయిల్ పిటిషన్.. ఈడీ, సీబీఐలకు సుప్రీం నోటీసులు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత బెయిల్ ఇవ్వాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈనెల 9న బెయిల్ కోరుతూ ఆమె తరుపు న్యాయవాదులు సుప్రీంలో పిటిషన్ వేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం పిటిషన్‌ను విచారించింది. ఈ మేరకు …
Read More »రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. కొత్తగా 2.74లక్షల మంది రైతులకు బీమా..!
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రైతు బీమా పథకంలో భాగంగా రైతులకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తోన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఎల్‌ఐసీ కింద ఒక్కో రైతుకు రూ.3,600 చొప్పున బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించింది. ఈ ఏడాది ప్రీమియం ఎంత చెల్లించాలనేది త్వరలో ఖరారు కానుంది. రైతు బీమా పథకం ద్వారా రైతులు సహజంగా, లేదా ఏ విధంగానైనా మరణిస్తే, సదరు రైతు కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల …
Read More »చంద్రబాబుతో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ భేటీ.. ఆ లెటర్లను ఓకే చేయాలని స్పెషల్ రిక్వెస్ట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలిశఆరు. ఈ మేరకు ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.. తాను ఏపీ సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని నివాసంలో మర్యాదపూర్వంగా కలిశానని.. తిరుమల శ్రీవారి దర్శనాలకు సంబంధించి రిక్వెస్ట్ చేసినట్లు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి, దర్శనానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యుల ఉత్తర్వులకు అర్హత కల్పించాలని వినతి అందించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను ఆమోదించాలని స్పీకర్ ప్రసాద్ చంద్రబాబును కోరారు. దైవ దర్శనం …
Read More »తెలంగాణలో ‘స్టాన్‌ఫర్డ్ వర్సిటీ’ శాటిలైట్ సెంటర్.. యువత భవితకు కొత్త బాటలు
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శనివారం (భారత కాలమానం ప్రకారం) స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్‌పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ …
Read More »తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్.. కోడలికి పార్టీ పగ్గాలు..!?
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఏపీలో జనసేన, బీజేపీతో జట్టు కట్టి.. వైఎస్స్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించిన చంద్రబాబు.. ఇప్పుడు తెలంగాణలో కనుమరుగైన టీడీపీని మరోసారి వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు షురూ చేశారు. ఏపీ ఎన్నికల తర్వాత సీఎం హోదాలో తెలంగాణకు వచ్చిన చంద్రబాబుకు.. ఘన స్వాగతం లభించింది. బేగంపేట విమానాశ్రయం నుంచి తన నివాసం వరకు బైక్ ర్యాలీతో తెలుగు తమ్ముళ్లు స్వాగతం పలికారు. గతంలో టీడీపీలో పని చేసి.. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కాంగ్రెస్ …
Read More »