Blog Layout

Pawan Kalyan: పరిస్థితి చేయిదాటితే నేనే హోంమంత్రి.. పవన్ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి పదవిని ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించిన పవన్ కళ్యాణ్.. పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఏపీలో శాంతి, భద్రతలపైనా, హోం శాఖపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల నేపథ్యంలో.. తాను హోంమంత్రిని అయితే రాష్ట్రంలో పరిస్థితులు వేరేగా ఉంటాయని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పంచాయతీరాజ్, పర్యావరణ, అటవీశాఖ మంత్రిని …

Read More »

Uttarakhand: ఘోర ప్రమాదం.. బస్సు లోయలోకి దూసుకెళ్లి 23 మంది మృతి

దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం ప్రయాణీకులతో వెళ్తోన్న ఓ బస్సు అల్మోరా జిల్లాలోని మర్చులా వద్ద అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. కుపి ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీంతో మృతుల …

Read More »

తిరుమలలో అంబటి రాంబాబు షర్ట్‌పై వివాదం.. టీటీడీకి ఫిర్యాదు చేస్తానన్న ఎంపీ రమేష్

మాజీ మంత్రి అంబటి రాంబాబు వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఆయన.. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్‌ ఫొటో ఉన్న స్టిక్కర్‌తో తిరుమలకు రావడం చర్చనీయాంశమైంది. టీటీడీ నిబంధనల ప్రకారం.. రాజకీయ పార్టీల చిహ్నాలు, జెండాలు, స్టిక్కర్లతో శ్రీవారి దర్శనానికి రాకూడదు. అయినా అంబటి రాంబాబు తన చొక్కాపై జగన్‌ ఫొటో ఉన్న స్టిక్కర్‌తో వచ్చారు.. నిబంధనలకు విరుద్ధంగా ఆయన అలా రావడంపై విమర్శలు వస్తున్నాయి. అలాగే అంబటి రాంబాబు తీరుపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. …

Read More »

ఏపీ ప్రజలకు తీపికబురు.. కొత్త రేషన్‌కార్డులు ఎప్పటి నుంచో క్లారిటీ వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది జనవరికి నూతన సంవత్సర కానుకగా మరో హామీ అమలుకు సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన పేదలందరికీ కొత్త రేషన్‌ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటుగా అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్‌కార్డులు మంజూరు చేయనుంది. అంతేకాదు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రీ డిజైన్‌ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ కొత్త డిజైన్‌తో అందజేసేందుకు కసరత్తు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త …

Read More »

చంద్రబాబు, పవన్, లోకేష్‌, బాలకృష్ణలపై అసభ్యకరంగా.. ఒకేరోజు ఏకంగా 47 పోలీస్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌, ఎమ్మెల్యే బాలయ్యలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నవారిపై చర్యలు మొదలయ్యాయి. ఏపీలో కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులను లక్ష్యంగా.. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్న వారిపై టీడీపీ, జనసేన పార్టీ నేతల ఫిర్యాదులతో విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో ఒక్కరోజే పోలీసులు 42 కేసులు నమోదు చేశారు. వీటిలో నందిగామ డివిజన్‌లో 14, సైబర్‌ పీఎస్‌లో 9, సెంట్రల్‌ డివిజన్‌లో 6, పశ్చిమ డివిజన్‌లో 5, సౌత్‌ డివిజన్‌లో 3, నార్త్‌ …

Read More »

ఏపీలో పింఛన్‌ తీసుకునేవారికి శుభవార్త.. డిసెంబర్ నుంచి పక్కా, రూ.12వేలు తీసుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో హామీని నిలబెట్టుకుంటున్నారు. ఈ మేరకు పింఛన్‌కు సంబంధించిన హామీని నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇకపై ఏ నెలలోనైనా పింఛను తీసుకోకపోతే ఆ మరుసటి నెల మొత్తం కలిపి తీసుకునే వెసులుబాటు కల్పించనుంది ప్రభుత్వం. వరుసగా రెండు నెలలు తీసుకోలేకపోతే.. ఆ తర్వాత నెలలో మూడు నెలలకు కలిపి మొత్తం (రూ.12వేలు) అందిస్తారు. ఈ హామీ అమలుకు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. రెండు రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి …

Read More »

ఈ రోజు భగినీ హస్త భోజనం పండగ.. మెట్టింట ఉన్న తన సోదరి ఇంటికి వెళ్లి అన్న ఎందుకు భోజనం చేయాలంటే..

దీపావళి పండగ ఐదు రోజుల పాటు జరుపుకునే సంప్రదాయంలో ఈ అన్నా చెల్లెళ్ళ పండగ ఒకటి. ఈ రోజు వివాహం అయిన తమ ఇంటిని విడిచి వెళ్ళిన అక్క లేదా చెల్లెల ఇంటికి వెళ్లిన అన్నా లేదా తమ్ముడు.. తన సోదరికి సంతోషం కలిగిస్తాడు. అంతేకాదు ఈ రోజు తమ సోదరి చేతి భోజనం చేయడం వలన అప మృత్యు భయం తొలగిపోతుందని ఓ నమ్మకం. అసలు ఈ పండగ జరుపుకోవడానికి గల కారణం పురాణం లో పేర్కొంది. సోదర సోదరీమణులు మధ్య బంధానికి …

Read More »

 ఉచిత సిలిండర్‌కు ఆ రెండూ తప్పనిసరి.. లేకుంటే పథకం కట్: విధివిధానాలు ఇవే

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఉచిత సిలిండర్ పథకాన్ని దీపావళి రోజున ప్రారంభించింది. ఈ పథకం కింద లబ్దిదారులకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను అందజేయనున్న విషయం తెలిసిందే. దీంతో ‘దీపం 2.0’ కింద బుకింగ్స్‌ మొదలు కాగా.. అక్టోబరు 31 నుంచి సిలిండర్లూ అందిస్తున్నారు. అయితే, ఈ పథకానికి తాము అర్హులమా? కాదా? అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న మొత్తం రేషన్‌ కార్డులతో పోలిస్తే ఉచిత గ్యాస్‌కు అర్హుల సంఖ్య తక్కువగా ఉంది. దీనికి గల …

Read More »

 ప్రజాధనంతో ప్యాలెస్‌లు కట్టడం ఏంటి?.. చాలామంది ఎగిరిపోతారు.. 

ఓ వ్యక్తి విలాసాల కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారని మండిపడ్డారు..సీఎం చంద్రబాబు. జగన్‌ హయాంలో విశాఖలోని రుషికొండపై నిర్మించిన భవనాలను..ముఖ్యమంత్రి పరిశీలించారు. రోడ్లపై గుంతలు కూడా పూడ్చని జగన్‌ ప్రభుత్వం..ప్యాలెస్‌ కోసం 430 కోట్లు ఖర్చుచేసిందని ఆరోపించారు. ప్రజల నుండి వచ్చే సూచనల మేరకే రుషికొండ నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రుషికొండ భవనాల నిర్మాణం ముమ్మాటికీ నేరమే అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.. భవన నిర్మాణాల తీరు.. నిబంధనల ఉల్లంఘనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో …

Read More »

ఆ రాశి వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (నవంబర్ 3 నుంచి నవంబర్ 9, 2024 వరకు): మేష రాశి వారికి ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. మిథున రాశి వారికి కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా నెరవేరుతాయి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి ఆదివారం మొదలు శనివారం వరకు వారఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వారమంతా అనుకూలంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగంలో సానుకూల …

Read More »